iDreamPost
android-app
ios-app

10th ఫలితాల్లో పేదింటి బిడ్డ అద్భుతం! 500కి ఏకంగా 499 మార్కులు!

ఆడపిల్లకు చదువు ఎందుకు దండగ అనే రోజుల నుండి... ఆడ పిల్లకు చదువే ముఖ్యం అన్న రోజులకు మారింది సమాజం. తల్లిదండ్రులు కూడా ఆడ పిల్లల్నిచదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయడం లేదు వారు కూడా.

ఆడపిల్లకు చదువు ఎందుకు దండగ అనే రోజుల నుండి... ఆడ పిల్లకు చదువే ముఖ్యం అన్న రోజులకు మారింది సమాజం. తల్లిదండ్రులు కూడా ఆడ పిల్లల్నిచదివించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వారి నమ్మకాన్ని వమ్ముచేయడం లేదు వారు కూడా.

10th ఫలితాల్లో పేదింటి బిడ్డ అద్భుతం! 500కి ఏకంగా 499 మార్కులు!

అమ్మాయిలు ఆణిముత్యాలు అని మరోసారి రుజువు అవుతుంది. ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంటర్, పది తరగతి ఫలితాల్లో ఆడ పిల్లలు మంచి ర్యాంకులు సాధించిన సంగతి విదితమే. కర్ణాటక ఫలితాల్లో కూడా వారిదే హవా. సామాన్యులు, పేద కుటుంబంలో పుట్టిన బిడ్డలు, రైతుల పిల్లలు స్టేట్ ర్యాంక్స్ సాధించి.. తల్లిదండ్రులు, టీచర్లు గర్వపడేలా చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో కూడా 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తమిళనాడు బోర్డు ఫలితాలను ప్రకటించింది. 8,94,264 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 8,18,743 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే ఉత్తీర్ణత శాతం 91.55 శాతంగా నమోదైంది. గత ఏడాది కన్నా కాస్త ఎక్కువ.

తమిళనాడు పదో తరగతి ఫలితాల్లో కూడా విద్యార్థినులు విజయ దుందుభి మోగించారు. 4,22,591 మంది విద్యార్థినులు ఉత్తీర్ణులు అయ్యారు. 3,96,152 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.కాగా, ఇందులో కూడా ముగ్గురు అమ్మాయిలు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ ముగ్గురు విద్యార్థినులకు 500లకు గానూ 499 మార్కులు సాధించడం విశేషం. దిండిగల్ జిల్లా ఒతం చత్రంలోని అక్షయ పాఠశాల విద్యార్థిని కావ్యశ్రీ 10వ తరగతి ఫలితాల్లో రాష్ట్ర తొలి ర్యాంక్ సాధించింది. లాంగ్వేజ్ భాషలో తప్ప మిగిలిన వాటిన్నింటీలో ఆమెకు సెంట్ పర్సెంట్ మార్కులు రావడం గమనార్హం. కాగా,ఆమె మార్కులు జాబితాను చూసి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

తమిళ భాషలో 99, ఆంగ్లంలో 100, మాథ్య్స్ 100, సైన్స్‌లో 100, సోషల్ సైన్స్‌లో 100 మార్కులు వచ్చాయి. తమిళం మినహా అన్ని సబ్జెక్టుల్లో 100 మార్కులు సాధించాడు .తమిళనాడులో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని కావ్యశ్రీని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందిస్తున్నారు. ఇదిలా ఉంటే పేదరికాన్ని జయించి.. ఆమె స్టేట్ ఫస్ట్ నిలిచింది. కాగా, గత ఏడాది స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అమ్మాయిని తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అభినందించిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు స్టేట్ ర్యాంకర్లను అభినందించి సత్కరించాడు. ఇప్పుడు కూడా స్టేట్ ర్యాంకర్లను అభినందించనున్నట్లు తెలుస్తోంది.  తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని గుర్తిస్తున్న ఆడ పిల్లలు.. చదువుల్లో మేటీగా నిలుస్తూ.. వారికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వస్తున్నారు.