iDreamPost
android-app
ios-app

మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్.. ఈ ఎవరో తెలుసా?

  • Published Jul 31, 2024 | 8:56 AM Updated Updated Jul 31, 2024 | 8:56 AM

Sweezal Furtado: మిస్ గ్లోబల్ అనేది 2013లో స్థాపించబడిన ఒక అంతర్జాతీయ అందాల పోటీ.. ఇప్పటి వరకు వివిధ దేశాలకు చెందిన అందమైన భామలు ఈ పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకున్నారు.

Sweezal Furtado: మిస్ గ్లోబల్ అనేది 2013లో స్థాపించబడిన ఒక అంతర్జాతీయ అందాల పోటీ.. ఇప్పటి వరకు వివిధ దేశాలకు చెందిన అందమైన భామలు ఈ పోటీలో పాల్గొని కిరీటాన్ని దక్కించుకున్నారు.

మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం సొంతం చేసుకున్న స్వీజల్.. ఈ ఎవరో తెలుసా?

అందం, ప్రతిభ, సంకల్పం వీటిలో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన అందాల భామలకు బహుమతులు ఇచ్చి సత్కరిస్తుంటారు. అలా 2013 లో మిస్ గ్లోబల్ అనే అంతర్జాతీయ అందాల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పోటీలో ఎంతోమంది అందాల భామలు పోటీపడి కిరీటాన్ని దక్కించుకున్నారు. 2013లో మూడో రన్నరప్ గా భారత దేశానికి చెందిన అప్నిత్ మాన్ పోటీలో నిలిచారు. 2023లో మిస్ గ్లోబల్ ప్యూర్టో రికోకు చెందిన యాష్లే మెలెండెజ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఏడాది జరిగిన మిస్ గ్లోబల్ అందాల పోటీలో భారత దేశానికి చెందిన బ్యూటీ స్వీజల్ ఫుర్టాడో కిరీటాన్ని దక్కించుకుంది. దీంతో స్వీజల్ ఫుర్టాడో ఎవరు అన్న విషయంపై నెటిజన్లు సోషల్ మీడియాలో సర్చింగ్ మొదలు పెట్టారు. వివరాల్లోకి వెళితే..

మిస్ గ్లోబల్ అనేది అంతర్జాతీయ అందాల పోటీ. 2013లో మొదలైన మిస్ గ్లోబల్ పోటీలో భారత దేశానికి చెందిన అప్నిత్ మాన్ అనే యువతి మూడో రన్నరప్ గా నిలిచింది. చాలా ఏళ్ల తర్వాత మిస్ గ్లోబల్ ఇండియా – 2024 అందాల పోటీలో తన అద్భుత ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకొని కిరీటాన్ని దక్కించుకుంది బెంగుళూరు బ్యూటీ స్వీజల్ ఫుర్టాడో. జులై 28న జైపూర్ లోని క్లార్క్స్ అమెర్‌లో జరిగిన మిస్ సూపర్ మోడల్ ఇండియా ఈవెంట్ లో ఆమెకు కిరీటంతో పట్టాభిషేకం చేశారు.19 ఏళ్ల స్విజల్ అందాల పోటీలు, మోడలింగ్ రంగంలో ముందుకు సాగుతుంది.. మిస్ గ్లోబల్ ఇండియా కిరీటం దక్కడం ఆమెకు ఇదో మైలురాయిగా నిలుస్తుందని అంటున్నారు.

Miss global india

కర్ణాటకకు చెందిన 19 ఏళ్ల స్విజల్ ‘ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇగ్నైట్ ఇండియా 2021’ టైటిల్ గెల్చుకోవడంతో ఆమె కెరీర్ ప్రారంభం అయ్యింది. ఆ తర్వా మిస్ సూపర్ మోడల్ ఇండియా 2022 పోటీలో రెండో రన్నరప్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2023 లో ప్రపంచ వేదికపై భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించింది. ఇక ఈ అందాల భామ స్విజల్ విషయానికి వస్తే.. ఉడిపికి చెందిన స్వీజల్ ఫుర్టాడో ప్రస్తుతం బెంగుళూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఎంటర్ ప్రెన్యూయర్ షిప్ లో థార్డ్ ఇయర్ చదువుతుంది. ఇటీవల ఇంటర్నెషనల్ ప్రిన్సెస్ టైటిల్ కూడా గెల్చుకుంది. మిస్ టీన్ యూనివర్సల్ ఆసియా,బెస్ట్ నేషనల్ కాస్ట్యూమ్ టైటిళ్లను కూడా సొంతం చేసుకుంది. చిన్నవయసులో అందాల పోటీలో తన ప్రతిభ నిరూపించుకుంటున్న స్వీజల్ ఫుర్టాడో మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని సన్నిహితులు, నెటిజన్లు కోరుకుంటున్నారు.