iDreamPost
android-app
ios-app

రైలు పట్టాలపై పెరుగుతున్న కుట్రలు! వీళ్ళు మనుషులేనా?

  • Published Sep 11, 2024 | 9:55 AM Updated Updated Sep 11, 2024 | 9:55 AM

Conspiracies Rising on The Rails: దేశంలో లక్షల మంది ప్రతిరోజూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికుల భయాందోళనకు గురిఅవుతున్నారు.

Conspiracies Rising on The Rails: దేశంలో లక్షల మంది ప్రతిరోజూ రైలు ప్రయాణాలు చేస్తుంటారు. ఇటీవల వరుస రైలు ప్రమాదాలతో ప్రయాణికుల భయాందోళనకు గురిఅవుతున్నారు.

రైలు పట్టాలపై పెరుగుతున్న కుట్రలు! వీళ్ళు మనుషులేనా?

ప్రపంచంలో అతి పెద్ద రవాణా వ్యవస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థ ఒకటి. దేశంలో ప్రతిరోజు లక్షల సంఖ్యల్లో రైలు ప్రయాణాలు చేస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికే ఇష్టపడతారు. ముఖ్యంగా సుదూర ప్రయాణాలు చేసేవారికి రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. రైలు ప్రయాణం చేయడం ఎంతో భద్రత, సురక్షితం అంటారు. కానీ ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే రైలు ఎక్కాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. సాంకేతిక లోపాలు, సిగ్నల్స్ తప్పిదాలు కొన్ని అయితే.. సంఘ విద్రోహులు, ఉగ్రవాదుల చర్యల వల్ల ప్రమాదాలు జరుగతున్నాయని అంటున్నారు. ఇటీవల రైలు ప్రమాదాల కుట్రకోణానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

దేశంలో నిత్యం లక్షల సంఖ్యల్లో ప్రయాణికులతో చుక్.. చుక్.. అంటూ కూత పెడుతూ రైలు ప్రయాణాలు కొనసాగుతూ ఉంటాయి. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణాల కన్నా రైలు ప్రయాణం సురక్షితం, తక్కువ ఖర్చు. అందుకే పేద, మధ్యతరగతి కుటుంబీకులు లక్షల సంఖ్యల్లో రైలు ప్రయాణాలు చేయడానికి సుముఖత చూపుతున్నారు. ఇటీవల భారత దేశంలో వరుస రైలు ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. ఎన్‌సిఆర్‌బీ లెక్కల ప్రకారం 2013-2023 మధ్య రైలు ప్రమాదాలు దాదాపు 2 లక్షల 60 వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నాయి. చాలా వరకు ప్రమాదాలకు కారణం మానవ తప్పిదాలే అంటున్నారు. రైలు పట్టాలపై అడ్డంగా పెద్ద సిమెంట్ దిమ్మెలు, సైకిళ్ళు, ఇనుప రాడ్లు,  బండరాళ్లు, గ్యాస్ సిలిండర్లు ఇతర సున్నితమైన వస్తువులు ఉంచుతూ ప్రమాదాలకు కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి వికృతమైన, పైశాచిక చర్యల వల్ల రైలు పట్టాలు తప్పి ప్రమాదాలకు గురి కావడం.. వేల సంఖ్యల్లో మరణాలు, కోట్లలో ఆస్తి నష్టం వాటిల్లుతుంది.

Train accidents behind PAK plan

ఈ కుట్రల వెనుక దేశంలొని కొన్ని సంఘ విద్రోహక శక్తులతో పాటు పాకిస్థాన్ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. భారత దేశంలో అలజడి సృష్టించడానికి తరుచూ ఉగ్రవాదులు రక రకాలుగా కుట్రలు పన్నుతున్నారు. ఈ ఏడాది బెంగుళూర్ లోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ళ వెనుక పాకిస్థాన్ ఉగ్రవాది ఫర్హతుల్లా ఘోరి ఉన్నాడని పోలీసులు తెలిపారు. 2002 అక్షర‌ధామ్ ఆలయంపై దాడి, బెంగుళూర్ కేఫ్ పెలుళ్ల సూత్రదారి ఫర్హతుల్లా ఘోరీ.. భారత్ లో పాక్ ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కు కీలక మెసేజ్ లు పంపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ట్రైన్స్ పై రాళ్లు రువ్వించడం, పట్టాలు తప్పించేలా ప్లాన్ చేయడం, భారత రైల్వే మౌలిక సదుపాయాలను దెబ్బ తీయడం, పెట్రోలియం పైప్ లైన్లు, హిందూ నాయకులను దాడులు చేయాలని కుట్రలు చేసినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఫర్హతుల్లా వీడియోలు మెసేజ్, కుట్ర చేయాలని భావించడం నిజమే అయినప్పటికీ వారి కుట్ర ఫలించలేదని అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనా పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్రల మూలంగా దేశంలో రైలు ప్రమాదాలు జరిగి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. వేల సంఖ్యల్లో వికలాంగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి దారుణమైన కుట్రలు పన్నే వారు అసలు మనుషులేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు.

ఈ ఏడాది ఆగస్టులో కాన్పూర్ సమీపంలో సబర్మతి ఎక్స్ ప్రెస్ లో 20 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ట్రాక్ పై ఒక వస్తువు ఉంచడం వల్ల జరిగిందని అధికారులు తెలిపార. ఈ వారంలోనే కాన్పూర్ సమీపంలో బర్రారాజ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ట్రాక్ పై ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ఉంచారు. ఆ మార్గంలో వెళ్తున్న కాళింది ఎక్స్ ప్రెస్ కి ఢీ కొట్టడంతో భారీ పేలుడు సంభవించింది.కాన్పూర్ ఘటన మరువక ముందే మరుసటి రోజు రాజస్థాన్ లోని అజ్మేర్ సమీపంలో రైలు పట్టాలపై 70 కిలోలు బరువు ఉండే సిమెంట్ దిమ్మను ఉంచారు అగంతకులు. ఈ మార్గంలో వెళ్లే గూడ్స్ రైలు దిమ్మెను ఢీ కొట్టింది. అదృష్టం కొద్ది ఈ రెండు ఘటనల్లో ఎవరికీ ఏమీ కాలేదు.. ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.గత ఏడాది ఇలాంటి ఘటనలు 24 జరిగినట్లు భారత రేల్వే నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మూడుసార్లు కుట్రలు జరిగినట్లు అధికారలు తెలిపారు. నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు కుట్రలను భగ్నం చేస్తున్నా ఎక్కడో అక్కడ పొరపాటు జరిగి వేల సంఖ్యల్లో ప్రయాణికులు చనిపోతున్నారు.రైల్వే ప్రమాదాలు ఎక్కువగా ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, చండీఘడ్, రాజస్థాన్, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, ఒడిశాలో ఎక్కువగా కుట్రపూరిత యత్నాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.