Beware Of This Scam In Amazon: ఎక్స్‌ఛేంజ్‌లో వస్తువులు కొంటున్నారా? ఐతే జాగ్రత్త ఇలా కూడా మోసం చేస్తారు!

ఎక్స్‌ఛేంజ్‌లో వస్తువులు కొంటున్నారా? ఐతే జాగ్రత్త ఇలా కూడా మోసం చేస్తారు!

Supreme Court Advocate Ordered iPhone 15 On Amazon With Exchange Old iPhone 13 But He Lost 38 Thousand By Amazon Delivery Executive, Supervisor: సుప్రీంకోర్టు లాయర్ నే మోసం చేశారంటే.. సాధారణ మనుషులను మోసం చేయడం ఒక లెక్క. ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో పాత ఐఫోన్ ని ఇచ్చి కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే 38 వేలు స్కామ్ చేశారు అమెజాన్ డెలివరీ ఏజెంట్ మరియి అతని టీమ్. దీంతో ఆయనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే?

Supreme Court Advocate Ordered iPhone 15 On Amazon With Exchange Old iPhone 13 But He Lost 38 Thousand By Amazon Delivery Executive, Supervisor: సుప్రీంకోర్టు లాయర్ నే మోసం చేశారంటే.. సాధారణ మనుషులను మోసం చేయడం ఒక లెక్క. ఎక్స్ ఛేంజ్ ఆఫర్ లో పాత ఐఫోన్ ని ఇచ్చి కొత్త ఐఫోన్ కొనుగోలు చేస్తే 38 వేలు స్కామ్ చేశారు అమెజాన్ డెలివరీ ఏజెంట్ మరియి అతని టీమ్. దీంతో ఆయనకు జరిగిన అన్యాయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత ఏమైందంటే?

సుప్రీంకోర్టులో అడ్వకేట్ గా పని చేస్తున్న ముకుంద్ పీ ఉన్ని అనే వ్యక్తి జూలై 21న అమెజాన్ లో ఐఫోన్ 15ని ఆర్డర్ చేశారు. తన దగ్గర ఉన్న ఐఫోన్ 13ని ఎక్స్ ఛేంజ్ చేసి కొత్త ఐఫోన్ తీసుకోవాలనుకున్నారు. ఎక్స్ ఛేంజ్ పెట్టి 38 వేల రూపాయలకి కొత్త ఐఫోన్ 15ని ఆర్డర్ చేశారు. జూలై 22న డెలివరీ ఎగ్జిక్యూటివ్ రాత్రి 9.30 గంటల సమయంలో ముకుంద్ ఇంటికి వెళ్ళాడు. అయితే ఓటీపీ చెప్పి ఐఫోన్ 15 ఫోన్ ని తీసుకున్నారు ముకుంద్. అలానే తన దగ్గర ఉన్న ఐఫోన్ 13 ఫోన్ ని డెలివరీ ఎగ్జిక్యూటివ్ కి ఇచ్చారు. అయితే ఆ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ముకుంద్ ని వేరే ఓటీపీ అడిగాడు. ఎక్స్ ఛేంజ్ కోసం కూడా ఓటీపీ ఉంటుంది అంటూ వెల్లడించాడు. కానీ ముకుంద్ దగ్గర ఒకటే ఓటీపీ ఉంది. అదే చెప్పారు. కొద్దిసేపు డెలివరీ ఎగ్జిక్యూటివ్ ముకుంద్ తో వాదించాడు.

ఆ తర్వాత డెలివరీ పర్సన్ సూపర్వైజర్ కి కాల్ చేసి మాట్లాడాడు. సూపర్వైజర్ తో మాట్లాడిన తర్వాత డెలివరీ ఎగ్జిక్యూటివ్.. ఎక్స్ ఛేంజ్ ఫైనల్ అవ్వలేదు కాబట్టి ఐఫోన్ 15ని వెనక్కి ఇచ్చేయమని అడిగాడు. అయితే ముకుంద్ సూపర్వైజర్ తో మాట్లాడాలని పట్టుబట్టారు. దీంతో ఎక్స్ ఛేంజ్ అనేది వేరే టీమ్ చేస్తుందని.. మీరు అయితే ఐఫోన్ 15ని వెనక్కి ఇచ్చేయండి అని అడిగాడు ఆ సూపర్వైజర్. అయితే తాను ఇవ్వనని.. ఓటీపీ చెప్పాను, డెలివరీ అయినట్టు యాప్ లో చూపిస్తుంది. ఎలా ఇస్తాను అని ముకుంద్ ఆ సూపర్వైజర్ తో వాదించారు. దానికి అతను దీని వల్ల తమ టీమ్ నష్టపోతామని.. అందుకు ఐఫోన్ 15ని వెనక్కి ఇవ్వమని కోరాడు. మరుసటి రోజు ఎక్స్ ఛేంజ్ చేస్తామని సూపర్వైజర్ చెప్పడంతో ముకుంద్ కొత్త ఐఫోన్ ని వెనక్కి ఇచ్చారు. ఇది 21న జరిగింది.

23న అమెజాన్ కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేశారు. ఐఫోన్ 15 డెలివర్ కాలేదు.. మనీ రిఫండ్ చేయండి అని ఫిర్యాదు చేశారు. 25వ తేదీన కాంటాక్ట్ అవ్వమని చెప్పడంతో 26న మళ్ళీ కాల్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని 31వ తేదీ వరకూ ఎదురుచూడమని చెప్పారు. అయితే ఆగస్టు 1న కాల్ చేస్తే ఇన్వెస్టిగేషన్ పూర్తయిపోయింది. డబ్బులు వెనక్కి ఇవ్వడం కుదరదని చెప్పారు. దీంతో అమెజాన్ ఎలాంటి నిజ నిర్ధారణ చేయలేదని ముకుంద్ ఫిక్స్ అయ్యారు. దీంతో ఆయన 38 వేలు నష్టపోయారు. సూపర్వైజర్, డెలివరీ ఎగ్జిక్యూటివ్, అమెజాన్ లో పని చేసే కొంతమంది కలిసి తనను మోసం చేశారని అన్నారు. ఇది ఎవరికైనా జరగొచ్చు.. జాగ్రత్తగా ఉండండి అంటూ ఆయన సోషల్ మీడియాలో తనకు జరిగిన స్కామ్ ని పోస్ట్ చేశారు.

అది వైరల్ అవ్వడంతో అమెజాన్ స్పందించింది. దీంతో డెలివరీ ఎగ్జిక్యూటివ్ ముకుంద్ కి కాల్ చేసి మీకు నచ్చిన లొకేషన్ కి వచ్చి పాత ఫోన్ ఇస్తే కొత్త ఫోన్ 24 గంటల్లో డెలివరీ అవుతుందని చెప్పాడు. కానీ మరలా స్కామ్ చేస్తారని ముకుంద్ వెళ్ళలేదు. అయితే అమెజాన్ దీని మీద స్పందించి ఆయన డబ్బులను వెనక్కి ఇచ్చేసింది. కానీ ఇది చాలా బాధ కలిగించే విషయం అని.. కానీ తనకు సపోర్ట్ చేసిన వారికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. దీనిపై కొంతమంది నెటిజన్ స్పందిస్తూ.. మీకు డబ్బులు బానే వచ్చాయి కానీ మాకు రాలేదని.. నష్టపోయామని కామెంట్స్ చేశారు. కాబట్టి ఇలాంటి స్కామ్ లు కూడా చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే సోషల్ మీడియాలో మీ స్టోరీని పోస్ట్ చేసి వైరల్ చేయండి. రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

Show comments