Venkateswarlu
ఇంటర్నెట్ అనేది అన్ని విధాలా నిత్య అవసరం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇంటర్‌నెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక్క రోజు ఇంటర్‌నెట్ ఆగిపోయినా అంతా అస్తవ్యస్తం అవుతుంది. అలాంటి అసలు ఇంటర్ నెట్ లేకుండా పోతే పరిస్థితి ఏంటి
ఇంటర్‌నెట్ అనేది అన్ని విధాలా నిత్య అవసరం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇంటర్‌నెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక్క రోజు ఇంటర్‌నెట్ ఆగిపోయినా అంతా అస్తవ్యస్తం అవుతుంది. అలాంటి అసలు ఇంటర్ నెట్ లేకుండా పోతే పరిస్థితి ఏంటి
Venkateswarlu
‘ఇంటర్ నెట్’ లేకుండా నేటి ప్రపంచాన్ని ఊహించుకోవటం అసాధ్యం. ఓ వారం రోజులు కరెంట్ లేకపోయినా ఉండగలమేమో కానీ, ఇంటర్‌నెట్ లేకుండా బతకటం చాలా కష్టం. ఇంటర్‌నెట్ అనేది అన్ని విధాలా నిత్య అవసరం అయిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ఉద్యోగాలు ఇంటర్‌నెట్ మీదే ఆధారపడి ఉన్నాయి. ఒక్క రోజు ఇంటర్‌నెట్ ఆగిపోయినా అంతా అస్తవ్యస్తం అవుతుంది. అలాంటి అసలు ఇంటర్ నెట్ లేకుండా పోతే పరిస్థితి ఏంటి? ఊహించడానికి కూడా భయంగా ఉంది కదూ.. మరో రెండేళ్లలో అదే జరగబోతోందట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయమే హాట్ టాపిక్‌గా మారింది. అందరూ ‘ఇంటర్‌నెట్ ఆపోకలిప్స్’ గురించే మాట్లాడుకుంటున్నారు.
ఇంతకీ ఏంటీ ఇంటర్‌నెట్ అపోకలిప్స్!
‘సోలార్ తుఫాను’ కారణంగా భూమ్మీద ఇంటర్‌నెట్ పని చేయకుండా పోవటాన్నే ఇంటర్‌నెట్ అపోకలిప్స్ అంటారు. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం.. సూర్యుడు మరో రెండేళ్లలో భూమికి అతి దగ్గరగా రానున్నాడు. 2025 మధ్యలో కంతా సూర్యుడు భూమి దగ్గరకు వచ్చేస్తాడు. ఇలా సూర్యుడు భూమికి సమీపంగా వచ్చినపుడు ‘సోలార్ తుఫాను’ సంభవిస్తుంది. ఇంటర్ నెట్ వాడకం మొదలైన తర్వాత ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. కానీ, 1859లో మొదటి సారి సంభవించింది.
అప్పుడు టెలిగ్రాఫ్ లైన్లు కాలిపోయాయి. సిబ్బంది కరెంట్ షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత 1989లో మరోసారి సోలార్ తుఫాను వచ్చింది. దీని కారణంగా క్యూబెక్ పవర్ గ్రిడ్ కొన్ని గంటలు నిలిచిపోయింది. అయితే, ‘ఇంటర్‌నెట్ అపోకలిప్స్’ గురించి మాత్రం వాషింగ్టన్ పోస్ట్ చెప్పలేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఇంటర్ నెట్ అపోకలిప్స్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. 2025 కల్లా సూర్యుడు భూమికి దగ్గరగా రాగానే.. ఇంటర్‌నెట్ పని చేయకుండా పోతుందని నెటిజన్లు భావిస్తున్నారు. మరి, ఈ ఇంటర్‌నెట్ ఆపోకలిప్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.