nagidream
ఇన్ స్టా రీల్స్ మోజులో పడి నేటి కుర్రాళ్ళు ప్రపంచమే మర్చిపోతున్నారు. ఇక ఇంట్లో తల్లిదండ్రులు, వారి పడే కష్టం ఏం పట్టించుకుంటారు. ఒక కుర్రాడు తన తండ్రికి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు.
ఇన్ స్టా రీల్స్ మోజులో పడి నేటి కుర్రాళ్ళు ప్రపంచమే మర్చిపోతున్నారు. ఇక ఇంట్లో తల్లిదండ్రులు, వారి పడే కష్టం ఏం పట్టించుకుంటారు. ఒక కుర్రాడు తన తండ్రికి జీవితంలో మర్చిపోలేని బహుమతి ఇచ్చాడు.
nagidream
కూలి పని చేసుకుని బతికే తండ్రికి కొడుకు లైఫ్ లాంగ్ గుర్తుడిపోయే ఒక బహుమతి ఇచ్చాడు. కొడుకులు తండ్రిని పున్నామ నరకం నుంచి రక్షించాలి కానీ జీవించి ఉన్నంత వరకూ నరకం అనుభవించేలా చేయకూడదు. కొడుకు ఇన్ స్టా రీల్స్ మోజులో పడి తండ్రికి తీవ్ర అన్యాయం చేశాడు. రీల్స్, షార్ట్స్ మనిషి లైఫ్ ని షార్ట్ చేసి పడేస్తున్నాయి. వీటి కారణంగా ఇంట్లో వాళ్లనే కాకుండా తనను తాను మర్చిపోయే పరిస్థితి వచ్చేసింది మనుషులకి. ఇన్‌స్టా రీల్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రైలొస్తోందన్న స్పృహ లేకుండా పట్టాల మీద, కార్లు వస్తాయన్న ధ్యాస లేకుండా రోడ్ల మధ్యలో ఇలా ప్రాణాలు పోతాయన్న భయం లేకుండా రీల్స్ చేస్తున్నారు.
ఇటీవల ఇద్దరు యువకులు హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్ మీద ఫోటోలు దిగుతుంటే వేగంగా అటుగా వచ్చిన కారు గుద్దేసి వెళ్ళిపోయింది. దీంతో యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ యువకుడు ఇన్‌స్టా రీల్ మోజులో పడి ప్రాణాలను కోల్పోయాడు. ఉత్తరప్రదేశ్ కి చెందిన 21 ఏళ్ల శివమ్ కుమార్ అనే యువకుడు వైరల్ అవ్వాలని చేసిన స్టంట్ ప్రాణాల మీదకు తెచ్చింది. స్కూల్ పై కప్పు మీద ఉన్న జెండా పోల్ కి కాళ్ళు ఆనించి తలకిందులుగా వేలాడుతూ స్టంట్ చేయబోయాడు. దాన్ని స్నేహితులు వీడియో రికార్డ్ చేస్తున్నారు. తలకిందులుగా వేలాడుతూ ఆ జెండా పోల్ మీద జెండా పెట్టాలని శివమ్ కుమార్ అనుకున్నాడు.
అయితే సిమెంట్ తో చేసిన ఆ జెండా పోల్ శివమ్ కుమార్ బరువును మోయలేక విరిగిపోయింది. దీంతో శివమ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ షాకింగ్ ఘటన జంపడ్ బండలోని ఖైరదా గ్రామంలో జూనియర్ హైస్కూల్లో జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో శివమ్ తన తండ్రిని రైల్వేస్టేషన్ నుంచి ఇంట్లో డ్రాప్ చేసి స్కూల్ కి వెళ్ళాడు. అతని స్నేహితులు అను, అంకిత్ స్కూల్లో శివమ్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే శివమ్ వచ్చాక రీల్ కోసం స్టంట్ చేస్తుంటే ఇద్దరు స్నేహితులు రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈలోపు పోల్ విరగడంతో శివమ్ ప్రాణాలు పోయాయి. శివమ్ ఇలా స్టంట్స్ చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో సీలింగ్ లకి, చెట్లకి తలకిందులుగా వేలాడుతూ పలు స్టంట్స్ చేశాడు. కానీ ఈసారి అతను చేసిన స్టంట్ బెడిసికొట్టింది.
అతని ఇన్‌స్టా ఖాతా నిండా స్టంట్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి. అయితే కొడుకు మరణంతో అతని తండ్రి వర్ధని ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కూలి పని చేసుకుంటూ జీవనం సాగించే ఆయన ఉన్నట్టుండి కొడుకుని కోల్పోవడంతో జీర్ణించుకోలేకపోతున్నారు. కూలి పని చేసుకుని బతికే తండ్రికి కొడుకుగా ఇదేనా ఇచ్చే బహుమతి. తండ్రిని కష్టం నుంచి ఎలా బయటపడేయాలా అని ఆలోచించాల్సిన యువత.. నేడు ఎలా వైరల్ అవ్వాలి, ఎలా ఫేమస్ అవ్వాలి అన్న దాని గురించే ఆలోచిస్తున్నారు. ఆ మోజులో పడి ప్రాణాలు పోతాయన్న సంగతే మర్చిపోతున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.