iDreamPost
android-app
ios-app

హెచ్‌ఐవీ కలకలం.. 47 మంది విద్యార్థులు మృతి! ఎక్కడ అంటే?

  • Published Jul 06, 2024 | 12:22 PM Updated Updated Jul 06, 2024 | 12:22 PM

HIV for Students: కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఎయిడ్స్ వ్యాధి సోకితే.. స్వయంకృద అపరాదం వల్ల మరికొంతమందికి ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. ఎయిడ్స్ ప్రాణాంతకరమైన వ్యాధి అని అంటారు.

HIV for Students: కొంతమంది నిర్లక్ష్యం కారణంగా ఎయిడ్స్ వ్యాధి సోకితే.. స్వయంకృద అపరాదం వల్ల మరికొంతమందికి ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. ఎయిడ్స్ ప్రాణాంతకరమైన వ్యాధి అని అంటారు.

  • Published Jul 06, 2024 | 12:22 PMUpdated Jul 06, 2024 | 12:22 PM
హెచ్‌ఐవీ కలకలం..  47 మంది విద్యార్థులు మృతి! ఎక్కడ అంటే?

హెచ్ఐవీ ప్రాణాంతరమైన వ్యాధి.. దీనికి చికిత్స లేదని అంటారు. హెచ్ఐవీ అపరిచితులతో శృOగారంలో పాల్గొనడం, కలుషిత రక్తం ఎక్కించడం, వాడేసిన సిరంజీలు మళ్లీ వాడటం, గుర్భధారణ లేదా డెలివరి సమయంలో, తల్లిపాల ద్వారా హెచ్ఐవీ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఎయిడ్స్ కంట్రోల్ పై ప్రజలకు ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు వైద్యాధికారులు. కానీ కొంతమంది నిర్లక్ష్యం వల్ల మరికొంతమంది స్వయంకృపరాధం వల్ల హెచ్ఐవీ సోకుతున్న విషయం తెలిసిందే. తాజాగా హెచ్ఐవీ కారణంగా 47 మంది విద్యార్థులు చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

త్రిపురలో దారుణ సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఎయిడ్స్ కారణంగా 47 మంది విద్యార్థులు కన్నుమూయడం తీవ్ర కలకలం రేపింది.ఇప్పటి వరకు 828 మంది విద్యార్థులను హెచ్ఐవీ పాజిటీవ్ గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి తెలిపారు.828 మంది హెచ్ఐవీ పాజిటీవ్ విద్యార్థుల్లో 572 మంది బతికే ఉన్నారని తెలిపారు. మరోవైపు ఉన్నత విద్య కోసం చాలా మంది విద్యార్థులు త్రిపుర నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి 220 పాఠశాలలు, 24 కళాశాలలు, విశ్వ విద్యాలయాల నుంచి డ్రగ్స్ ఇంజెక్షన్లు తీసుకున్న విద్యార్థులను గుర్తించింది. దీని కారణంగానే ప్రతిరోజూ 5 నుంచి ఏడు కొత్త హెచ్ఐవీ కేసులు నమోదు అవుతున్నట్లు ఇటీవల గణాంకాలు చెబుతున్నాయని టీఎస్ఎ‌సీఎస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

త్రిపుర జర్నలిస్ట్స్ యూనియన్, వెబ్ మీడియా ఫారమ్, త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన మీడియా వర్క్ షాపులో టీఎస్ఏ‌సీఎస్ జాయింట్ డైరెక్టర్ కీలక విషయాలు వెల్లడించారు. పలు యూనిర్సిటీ విద్యార్థులు డ్రగ్స్ కి బానిసలుగా ఉన్నట్లు గుర్తించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 164 ఆరోగ్య కేంద్రాల నుంచి డేటా సేకరించామని అందులో విస్తుతపోయే విషయాలు బయటపడ్డాయని తెలిపారు. త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారి మాట్లాడుతూ.. 2024 మే నాటికి యాంటిరెట్రో వైరల్ థెరపీ కేంద్రాల్లలో 8,729 మందిని గుర్తించామని అన్నారు.మొత్తం ఎయిడ్స్ తో బాధపడుతున్న వారి సంఖ్య 5,674 గా గుర్తించినట్లు తెలిపారు. వీరిలో 4,570 మంది పురుషులు, 1,103 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు.