ప్రతి ఒక్కరిలో టాలెంట్ అనేది కచ్చితంగా ఉంటాది. అయితే ఆ ప్రతిభ అనేది సమయాన్ని బట్టి బయటకు వస్తుంది. అలానే కొందరు స్వయం కృషితో.. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటు ప్రతిభావంతులుగా మారుతుంటారు. ఇక ప్రతిభ అనేది కేవలం ఫలాన వయసు వారిలోనే ఉంటాది అనే ఏమి ఉండదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వారి వరకు ప్రతి ఒక్కరిలో ఏదో రూపంలో టాలెంట్ అనేది ఉంటుంది. తాజాగా ఓ విద్యార్థి.. తన టీచర్ పాటపాడుతుంటే.. బల్లపై చేయితో డ్రమ్ము వాయించాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఆ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కేరళ రాష్ట్రం వయనాడ్ కు చెందిన ఓ ప్రభుత్వ పాఠశాలలో అంజనా అనే యువతి.. ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోన్నారు. ఆమెకు జానపద పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అందుకే పాఠాలతో పాటు వీలు కుదిరినప్పుడల్లా పాటలు పాడుతూ.. విద్యార్థులను ఉత్సాహా పరిచేవారు. అయితే ఆ టీచర్ పాడుతున్న పాటలకు చాలా మంది పిల్లలు ఫిదా అయ్యారు. అలానే ఓ రోజు అంజనా టీచర్ తరగతి గదిలో ఓ జానపద గీతాన్ని క్లాస్ రూంలో ఆలపించారు. ఆమె పాట రిథమ్ కు తగ్గట్లుగా స్కూల్ బెంచ్ మీద అభిజిత్ అనే విద్యార్థి అద్భుతంగా డ్రమ్ము వాయించాడు. టీచర్ పాట పాడుతుంటే.. బెంచ్ పై తన చేతితో దరవు వేస్తూ ఆ పాటకు మరింత అందాన్ని ఇచ్చాడు. ఈ వీడియోను సదరు టీచర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా 24 గంటల్లోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.
టీచర్ పాటకు అభిజిత్ అద్భుతంగా దరువు వేశాడంటూ నెటిజన్లు తెగ మురిసిపోతున్నారు. ఈ చిన్నారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన సదరు టీచర్ పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖలను,గొప్ప వారిని తయారు చేసేది గురువులే కదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఈ విద్యార్థి భవిష్యత్ లో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇక అభిజీత్ ప్రతిభకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు సినీ ప్రముఖల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ బుడతడి వీడియోను మీరు వీక్షించి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
This video that has gone viral in Kerala landed in my inbox as I woke up today in Araku.
It is a Wayanad folk song sung by a music teacher who had spotted the drumming talent of this student and joined him in an impromptu session in school.
It is teachers that create stars. pic.twitter.com/OzvUIiUDvR
— Manoj Kumar (@manoj_naandi) July 5, 2023