Arjun Suravaram
ఉత్తరకాశీలో టన్నెల్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది ఎప్పుడు బయటకి వస్తారా? అని దేశ ప్రజలందరూ ఎదురు చూశారు. నిన్న ఆ 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ రెస్య్కూ ఆపరేషన్ లో ఓ విదేశియుడు కీలక పాత్ర పోషించారు. ఆ 41 మంది పాలిట దేవుడయ్యారు.
ఉత్తరకాశీలో టన్నెల్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అందులో చిక్కుకున్న 41 మంది ఎప్పుడు బయటకి వస్తారా? అని దేశ ప్రజలందరూ ఎదురు చూశారు. నిన్న ఆ 41 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. ఈ రెస్య్కూ ఆపరేషన్ లో ఓ విదేశియుడు కీలక పాత్ర పోషించారు. ఆ 41 మంది పాలిట దేవుడయ్యారు.
Arjun Suravaram
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా సొరంగంలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. దాదాపు 17 రోజుల తరువాత ఆ 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ 17 రోజుల పాటు వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా కృషి చేసింది. అదే విధంగా విదేశాల నుంచి సాంకేతిక, భూగర్భశాస్త్ర నిపుణులను కూడా తీసుకొచ్చారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. ఆ ప్రాంతంలో ఎవరి నోటి నుంచి వచ్చిన ఆయన పేరే. మన ఊరు కాదు, మన భాష కాదు అయినా అందరితో మమేకమవుతూ కార్మికలు కోసం తీవ్రంగా కష్టపడ్డారు. మరి.. ఆయన స్టోరీ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
నవంబర్ 12 ఉత్తర్ ఖండ్ లోని సిల్క్యారా సొరంగం మధ్యలో 150 మీటర్ల మేర కూలిపోయింది. ఈ ప్రమాదంలో 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఇక ఆరోజు నుంచి సహాయ బృందాలు కృషి చేశాయి. మరికొద్ది రోజులు గడిచిన తరువాత మన రెస్క్యూ టీమ్ తో ఇతర దేశాలకు చెందిన నిపుణులు జాయిన్ అయ్యారు. అలాంటి వారిలో ఒకరు ఇంటర్నేషనల్ టన్నెలింగ్ ఎక్స్ ఫర్డ్ ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్.
ఈయన ఆస్ట్రేలియాకు చెందిన స్వతంత్ర విపత్తు పరిశోధకుడు. ఈ సొరంగ ప్రమాదాన్ని ఆయన సవాల్ గా తీసుకున్నారు. నవంబర్ 20 నుంచి రెస్క్యూ ఆపరేషన్ లో దిగిపోయారు. ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా భావించారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు నిరంతరం కృషి చేశారు. అటు సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడుతూ.. వారికి భరోసా ఇస్తూనే కాపాడే చర్యల్ని కొనసాగించారు.
డిక్స్.. తన జీవితంలో ఇలాంటి సంఘటనలు అనేకం చూశారు. భూగర్భ సొరంగంలో ప్రపంచంలోని ప్రముఖ నిపుణుడిగా ప్రొఫెసర్ ఆర్నాల్డ్ డిక్స్ కి పేరుంది. భూగర్భ , రవాణా రంగంలో ప్రత్యేకత ఆయన సొంతం. భూగర్బ సొరంగ ప్రమాదాలు, సెక్యూరిటీ చర్యలు, వాస్తవ భద్రతా పనితీరు మొదలు, ఇతర టెక్నాలజీ సమస్యల పరిష్కారంలో ఆయనకు ఆయనే సాటి. ఆర్నాల్డ్ .. ఉత్తర కాశీ టన్నెల్ సైట్ లో తనిఖీ నిర్వహించి, సహాయక చర్యల్లో పాల్గొన్న ఏజెన్సీలతో చర్చించిన తరువాత ఆ 41 మంది కార్మికులను రక్షించడంపై భరోసా ఇచ్చారు.
తొలుత అత్యవసరంగా కార్మికులకు ఆహారం, నీళ్లు అందించారు. వాళ్లతో నిరంతరం ఫోన్లతో మాట్లాడటం చేశారు. ఆ వీడియోలను బాధితుల కుటుంబ సభ్యులకు కూడా చేరడంతో వారు కూడా కాస్త ఊరట చెందారు. 17 రోజుల పాటు శ్రమించి చివరికి కార్మికులను రక్షించారు. కార్మికులు సురక్షితంగా బయటకి రావడంలో కీలక పాత్ర పోషించిన ఆర్నాల్డ్ పై దేశం నలుమూలల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆనంద్ మహీంద్రా కూడా ఆర్నాల్డ్ పై ప్రశంసలు కురిపించారు. ఆర్నాల్డ్ కి ఇప్పటి వరకు అనేక అవార్డులు వచ్చాయి.
2011లో టన్నెల్ ఫైర్ సేఫ్టీ లో అత్యత్తుమ ప్రతిభ కనబర్చినందుకు నేలాండ్ ఆస్ట్రలేసియన్ టన్నెలింగ్ అవార్డును అందుకున్నారు. ఆయన లాయర్ కూడా కావడంతో లీగల్ అంశాలతో పాటు, నిపుణుడిగా క్లిష్ట పరిస్థితి అంచనా వేయడంలో సమర్థుడు. 2022లో అమెరికా నేషనల్ ఫైర్ ప్రొటెక్షన్ అసోసియోషన్ ద్వారా కమిటీ సర్వీస్ అవార్డు అందుకున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు. మన ఊరు, మన భాష కానీ వ్యక్తి.. మన వారి కోసం ఇలా శ్రమించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
The art of communication is essentially the art of storytelling. Our ancient culture has its roots in storytelling. But we need to revive & refine those skills. In the meantime, here’s an Australian giving us a master class…👏🏽👏🏽👏🏽 pic.twitter.com/QP4huuS78u
— anand mahindra (@anandmahindra) November 28, 2023