Swetha
అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబు అయింది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన భక్తులకు పంచే ప్రసాదాలలో.. అందరికి అంత్యంత ప్రీతి పాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు కూడా ఉండబోతుంది.
అయోధ్య నగరం అంగరంగ వైభవంగా ముస్తాబు అయింది. ఈ క్రమంలో అక్కడకు వచ్చిన భక్తులకు పంచే ప్రసాదాలలో.. అందరికి అంత్యంత ప్రీతి పాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు కూడా ఉండబోతుంది.
Swetha
ఏడు కొండల పైన వెలసిన ఆ శ్రీవారి ప్రసాదం ఇప్పుడు అయోధ్యకు చేరుకోనుంది. ప్రస్తుతం అయోధ్య నగర ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన ఒకటే మాటా.. ఒకటే బాటా. అందరి చూపు అయోధ్యలో కొలువుతీరబోతున్న ఆ రామయ్య మీదే ఉంది. వందల సంవత్సరాల వైర్యానికి ప్రతీకగా విస్తృతంగా ఆవిర్భవించిన రామ మందిరం.. ప్రస్తుతం భక్త జనులతో కిక్కిరిసిపోయింది. మరో రెండు రోజులలో ఆ రామయ్య తండ్రి.. తన స్థానంలో స్థిరంగా కూర్చుని భక్తులను దీవించనున్నారు . ఈ క్రమంలో రామ మందిర ట్రస్ట్ సభ్యులు.. అక్కడకు విచ్చేయనున్న భక్తులకు అన్ని వసతులు సిద్ధం చేశారు. అలాగే, అయోధ్యలో రామ ప్రాణ ప్రతిష్టాపన సందర్బంగా.. అక్కడికి విచ్చేసే భక్తులకు ప్రసాదంగా పంచి పెట్టేందుకు.. తిరుమల నుంచి లక్ష లడ్డులు అయోధ్యకు చేరనున్నాయి.
జనవరి 22వ తేదీన అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్బంగా.. భక్తులకు 25 గ్రాముల బరువు గల తిరుమల లడ్డు ప్రసాదం భక్తులకు ఇచ్చేందుకు.. తిరుమల తిరుపతి దేవస్థానం సర్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లక్ష చిన్న లడ్డూలను భక్తులకు ప్రసాదంగా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-1లో శ్రీవారి సేవకులు..ఒక్కో కవర్‌లో రెండు చిన్న లడ్డూలను ప్యాకింగ్ చేశారు. ఈ విధంగా మొత్తం 350 బాక్సులను సిద్ధం చేశారు. 350 మంది శ్రీవారి సేవకులు భక్తి శ్రద్దలతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. మొత్తంగా దాదాపు 3 వేల కేజీల బరువు ఉన్న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రేపు విమానంలో అయోధ్యకు పంపేందుకు.. టీటీడీ ఉన్నత అధికారాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం అయోధ్యలోని భక్తులకు ఉచితంగా అందచేయనున్న లడ్డూలను.. టిటిడి అయోధ్యకు చేర్చే పనిలో నిమగ్నం అయ్యింది. లడ్డూ ప్రసాదాలను అక్కడ ఆలయ నిర్మాణ ట్రస్ట్ కు అందించనున్నారు. శ్రీవారి లడ్డూ ప్యాకింగ్ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో జనరల్ శివప్రసాద్ తోపాటు.. ఏఈవో శ్రీనివాసులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా, అయోధ్య అంతటా పండుగ వాతావరణం కనిపిస్తోంది. ప్రముఖ సెలెబ్రిటీలతో పాటు దేశం నలుమూలల నుంచి.. సాధారణ భక్తులు, ఎంతో మంది సాధువులు సాదరంగ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరి, అయోధ్య రామయ్యదగ్గరకు వెళ్లే భక్తులకు శ్రీవారి లడ్డులను ప్రసాదంగా అందచేసే.. విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.