iDreamPost
android-app
ios-app

అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ముస్లింకు తొలి ఆహ్వానం.. ఆయన ఎవరంటే?

అయోధ్యలో శ్రీరామ చంద్రుడు కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా రామ్ మందిర్ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే తొలిసారిగా శ్రీ రామ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఓ ముస్లిం వ్యక్తిని రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించింది.

అయోధ్యలో శ్రీరామ చంద్రుడు కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 22న అంగరంగ వైభవంగా రామ్ మందిర్ ప్రారంభోత్సవం జరుగనున్నది. అయితే తొలిసారిగా శ్రీ రామ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఓ ముస్లిం వ్యక్తిని రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించింది.

అయోధ్య రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ముస్లింకు తొలి ఆహ్వానం.. ఆయన ఎవరంటే?

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామ మందిర్ ప్రారంభోత్సావానికి సర్వం సిద్ధమైంది. జనవరి 22న అంగరంగ వైభవంగా మందిరాన్ని ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముని దర్శన భాగ్యం కోసం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రామ్ మందిర్ ప్రారంభోత్సవ వేడుకను తిలకించేందుకు సిద్దమైపోయారు. ఇప్పటికే దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు ఆలయ ట్రస్ట్ వారు. అయితే తొలిసారిగా శ్రీ రామ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ ఓ ముస్లిం వ్యక్తిని రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించింది. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?

హిందువులు పవిత్రంగా భావించే రామ్ మందిర్ ఆలయ ప్రారంభోత్సవం కన్నుల పండగగా జరుగనుంది. వేద పండితుల మంత్రోఛ్ఛారణల మధ్య అయోధ్యలో కోదండ రాముడు కొలువుదీరనున్నాడు. అయోధ్యలో ఆధ్యాత్మికత వెల్లువిరియనుంది. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న రామ్ మందిర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముస్లిం వ్యక్తిని ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. అయోధ్యకు చెందిన ఇక్బాల్ అన్సారీని రామ్ మందిర ప్రారంభోత్సవానికి రావాలని శ్రీ రామ క్షేత్ర తీర్థ్ ట్రస్ట్ కోరింది. అయితే భగవంతుడికి హిందూ ముస్లిం అనే తేడా ఏమీలేదని రామాలయ ట్రస్ట్ వెల్లడించింది. దేవుడికి మనుషులంతా ఒక్కటే.. కులమతాలు, వర్గబేధాలు ఏమీ ఉండవని తెలిపారు.

ఆయన ఎవరంటే:

రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూ వివాదం కేసు సుప్రీం కోర్టులో విచారణ సాగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సమయంలో ఇక్బాల్ అన్సారీ అనే ముస్లిం న్యాయవాది బాబ్రీ మసీదుకు మద్దతుగా వ్యవహరించారు. అంతకు ముందు ఆయన తండ్రి హషీమ్ అన్సారీ ఈ కేసులో న్యాయవాదిగా ఉన్నారు. అయితే 2016లో హషీమ్ మృతి చెందడంతో ఈ కేసును ఇక్బాల్ అన్సారీ కోర్టుకు తీసుకెళ్లారు. బాబ్రీ మసీదు విషయంలో కూడా న్యాయం జరగాలని వాదనలు వినిపించారు. ఇక గత నెల 30న మోడీ అయోధ్యలో పర్యటించగా ఇక్బాల్ అన్సారీ ఆయనను పూలవర్షంతో ఘనంగా స్వాగతించారు. ఈ నేపథ్యంలో ఇక్బాల్ ను రామమందిర ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

అయోధ్య రామలయంలో గర్భగుడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు మకర సంక్రాంతి తర్వాత రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే జనవరి 16న సరయూ నది నీటితో రామ మందిర శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆ తర్వాత 22 వ తేదీ మధ్యాహ్నం బాల రామ విగ్రహ ప్రతిష్టను నిర్వహించనున్నారు. కాగా, ఈ కార్యక్రమం కోసం దాదాపు 6,000 ఆహ్వాన కార్డులను ప్రముఖ వ్యక్తులకు పంపించారు. ఇక ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ,కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు హాజరుకానున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి