పెళ్ళిలో అతిథుల కోసం ఫాల్కన్-2000 జెట్స్, ప్రైవేట్ విమానాలు! ఇది అంబానీ రేంజ్!

Anant ambani and Radhika Merchant Wedding: భారత దేశంలో అత్యంత సంపన్న వ్యాపారే వేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబాని తనయుడు అనంత్ అంబాని - రాధిక మర్చంట్ పెళ్లి శుక్రవారం 12న ముంబాయి జియో వరల్డ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

Anant ambani and Radhika Merchant Wedding: భారత దేశంలో అత్యంత సంపన్న వ్యాపారే వేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబాని తనయుడు అనంత్ అంబాని - రాధిక మర్చంట్ పెళ్లి శుక్రవారం 12న ముంబాయి జియో వరల్డ్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.

ఆసియాలోనే అత్యంత కుభేరుడైన ముఖేష్ అంబానీ గురించి ప్రత్యక పరిచయం అక్కరలేదు. వీరి ఇంట ఏ చిన్న శుభకార్యం జరిగినా దేశమంతా చర్చించుకునేలా గ్రాండ్ గా చేస్తుంటారు. చిన్ననాటి నుంచి మూడో తనయుడు అనంత్ అంబానీ అంటే ముఖేష్ అంబానీ దంపతులకు ఎమోషనల్ బాండింగ్ కాస్త ఎక్కువగానే ఉంది. అందుకే అనంత్ అంబానీ పెళ్లి ప్రతి ఒక్కరికీ జీవితాంతం గుర్తుండిపోయేలా చేయబోతున్నారు. ఈ పెళ్లికి మన దేశం నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా వీవీఐపీ అతిథులు, ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వారిని తీసుకురావడానికి కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో ఒకరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముఖేష్ అంబానీ, నీతా అంబాని తనయుడు అనంత్ అంబాని- రాధిక మర్చంట్ వివాహం అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి కోసం వస్తున్న  ప్రత్యేక అతిథులను తీసుకు వచ్చేందుకు అంబానీ భారీగా ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతిథుల కోసం ఏకంగా  మూడు ఫాల్కన్ – 2000 జెట్లను అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే పెళ్లికి సంబంధించిన ఈవెంట్ల కోసం 100 కు పైగా ప్రైవేట్ విమానాలు వావాలని అనుకుంటున్నట్లు ఎయిర్ చార్టర్ కంపెనీ క్లబ్ వన్ ఎయిర్ సీఈవో రాజన్ మెహ్ర తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నులైన అతిథులు వస్తున్నారు.. ఆయా విమానాలు దేశంలోని అనేక ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తాయని రాజన్ మెహ్ర తెలిపారు. ముంబై లోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో పెళ్లి జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు మూడు రోజుల పాటు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.  మూడు రోజుల పాటు గ్రాండ్ గా జరిగే వివాహమహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జులై 12న శుభ్ వివాహ తో వేడుకలు మొదలవుతాయి. జులై 13న శుభ్ అశీర్వాద్, జులై 14 న మంగళ్ ఉత్సవ్ తో వివాహ వేడుకలు తంతు ముగుస్తుంది. ఇక పెళ్లి భోజనాల కోసం ఏకంగా 3 వేల రకాల వంటలు వడ్డించేందుకు రెడీ అవుతున్నారట.

Show comments