Keerthi
ఎట్టకేలకు ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల నడుమ ఆ కొందాండ రాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు. నేడు అయోధ్యలో బాల రాముడిని ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతటి ఆద్భుతమైన వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా నిర్వహించారు. ఐదేళ్ల వయసు ఉన్న బాల రాముడి విగ్రహం పై ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకి ఆ విశేషాలు ఏమిటంటే..
ఎట్టకేలకు ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల నడుమ ఆ కొందాండ రాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు. నేడు అయోధ్యలో బాల రాముడిని ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతటి ఆద్భుతమైన వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా నిర్వహించారు. ఐదేళ్ల వయసు ఉన్న బాల రాముడి విగ్రహం పై ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకి ఆ విశేషాలు ఏమిటంటే..
Keerthi
ఇది కేవలం ఒక ఆలయమో, శిల నిర్మాణం అయితే ఇంతటి సంబరం, ఇన్నీ చర్చలు అవసరం లేదు.ఇది ఒక రాజు దశాబ్ధాల పాటు కాపాడుకుంటున్న తన రాజ్య సింహాసాన్ని తిరిగి అధిరోహించడం. కొన్ని వందల కోట్ల మంది చిత్త శుద్ధితో సాకారం చేసిన పుణ్య కార్యక్రమం. ఎట్టకేలకు ఎన్నో వివాదాలు, మరెన్నో ఆందోళనల నడుమ ఆ కొందాండ రాముడు తన జన్మస్థానంలో కొలువుదీరాడు. నేడు అయోధ్యలో బాల రాముడిని ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతటి ఆద్భుతమైన వేడుకను ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదగా నిర్వహించారు. మధ్యాహ్నం 12.20 నుంచి ఒంటి గంటల మధ్య అభిజిత్ లగ్నంలో.. పండితుల సమక్షంలో వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ ఆ జగదభిరాముడిని 51 అంగుళాల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే ఐదేళ్ల వయసు ఉన్న బాల రాముడి దివ్య సౌందర్యం భక్తులందరినీ మంత్ర ముగ్ధులని చేస్తుంది. అంతేకాకుండా ఈ విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ విశేషాలు ఏమిటంటే..
విగ్రహం దివ్య సౌందర్యం ప్రత్యేకతలు
అయోధ్యలో ఎంతో కన్నుల పండుగగా.. భక్తకోటి ఆర్తి తీరేలా ఆ బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. కనులారా ఆ కొదాండ రాముని దివ్య తేజస్సుని చూసిన రామ భక్తులు ఈ జన్మకు ఇది చాలు అంటూ మురిసిపోయారు. ఇక ఈ విగ్రహంలో రాంలాలా తలపై కీరిటం, చేతిలో బంగారు బాణం, బంగారు విల్లుతో ఎంతో ఆకర్షణీయంగా విశిష్టంగా ఉంది. అంతేకాకుండా.. చూడగానే ఆకట్టుకున్న దివ్యమైన రూపంతో శ్రీరాముని నుదుటి పై పూసిన తిలకం సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తుంది.
విగ్రహం చుట్టూ దశావతారాలు
ఎంతో ఆద్భుతమైన తేజస్సుతో దర్శనమిస్తున్న ఆ రామ్ లల్లా విగ్రహం అంచుల మీద 10 దశావతారాలను చెక్కారు. అందులో 1.మత్స్యావతారం, 2.కూర్మావతారం, 3.వరాహావతారం, 4.నరసింహావతారం, 5.వామనావతారం, 6.పరశురాముడి అవతారం, 7.రామ అవతారం, 8.కృష్ణ అవతారం, 9.బుద్ధవతారం,10. కల్కి అవతారాలు చిన్న చిన్న శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి. వీటితోపాటు సూర్య భగవానుడు, శంఖం, సుదర్శన చక్రం, గధ, స్వస్తిక్, ఓంకారం, వంటివి రాముడి విగ్రహ కిరీటం వైపు కనిపిస్తాయి. కాగా, ఒక వైపు హనుమంతుడు, మరొక వైపు గరుడ దేవుడు ఉన్నారు. అలాగే పద్మ పీఠంపై బాల రాముడు నిలబడి ఉన్నాడు. ఇంతటి ఆద్భుతమైన రూపంతో చేసిన కళా ఖండాలు చూస్తే ఔరా అనిపిస్తుంది. ఇక 200 కిలోల బరువు, 51 అంగుళాల ఎత్తు ఉన్న ఈ బాల రాముడి విగ్రహాన్ని కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించారు.ఈ విగ్రహం తయారీకి ఏక శిలను మాత్రమే ఉపయోగించారు. వెయ్యేళ్ల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. నీరు, ఇతర వస్తువుల వల్ల ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు. ఇంతటి రమణీయమైన బాల రాముని రూపం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.