Nagendra Kumar
వందల సంవత్సరాల నాటి అయోధ్య కల నెరవేరబోయే వేళా.. వందల సంవత్సరాల నాటి పుట్టు పూర్వత్రాల.. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు అన్ని.. ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
వందల సంవత్సరాల నాటి అయోధ్య కల నెరవేరబోయే వేళా.. వందల సంవత్సరాల నాటి పుట్టు పూర్వత్రాల.. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలు అన్ని.. ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి.
Nagendra Kumar
పుక్కిటి పురాణాలు కావు. పరమ పునీతమైన పురాణాలు. మహిమాన్విత వాస్తవిక చిత్రణలు. యుగాలు గడిచిపోతున్నా, లక్షలాది తరాలు మారిపోతున్నా వేదభూమి భారతదేశంలో ఏదీ కల్పన కాదేమోననిపిస్తుంది. ద్వారకానగరం సముద్ర గర్భంలోనే ఉందని నాసా నిర్ధారించింది. అక్కడ నాగరికమైన ఓ మహానగరం ఉండేది అని చెప్పింది. భగవాన్ వేణుగోపాలుడి అస్థిత్వాన్ని కాదనగలమా? రామసేతు మానవనిర్మితమేనని, దాని నిర్మాణంలో అత్యంత నైపుణ్యవంతమైన ఇంజనీరింగ్ అందులో ఇమిడిఉందని వెస్టరన్ దేశాలే ఒప్పుకున్నాయి. శ్రీరాముడి పాదముద్రలు ఇప్పుడు కొత్తగా నిజమేనన్న నిజనిర్ధారణలు వెలికి వస్తున్నాయి. రాములవారి ప్రాభవం నిజం కాదని చెప్పగలరా? ఇవీ మన పురాణ శాస్త్ర ఇతిహాసాలు. మహాగొప్పవి. నిజమైనవి. నిర్ణీతమైనవి.
వాటితో సమానమైనవి మన కళ్ళ ముందే ఇప్పుడు జరుగుతున్నాయి. దిగ్భ్రాంతికి గురి కావాల్సిందే. ఎక్కడో ఏపి రాష్ట్రంలో పంది గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిచేసి సొమ్మసిల్లి పడిపోయిందని వార్త వచ్చింది. టీవీల్లో కూడా విరివిగా ప్రసారం చేశారు ఆ వరాహం భక్తిప్రపత్తులను. ఇప్పుడు రామమందిరంలో రాములవారి ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతుంటే పాముల గుంపు, ఎలుగుబంట్లు, కోతులు మూకలుమూకలుగా వస్తున్నాయి అని కథనాలు చదువుతున్నాం. చూస్తున్నాం. వచ్చే ఈ మూగజీవాలన్నీ రామాయణంతో ప్రత్యక్షంగా సంబంధబాంధవ్యాలు ఉన్నవే. ఎవ్వరూ నో చెప్పలేని రామచరిత్రకు సాక్ష్యాలు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన సంఘటన కొత్తగా వెలుగులోకి వచ్చింది. జాతీయమీడియా వీటిని సరికొత్తగా మళ్ళీ స్ఫురణలోకి తెస్తోంది. ఒక మర్కటం.. ఉదంతం. వింటే అంతరాంతరాలలో అణువణువూ పులకించే సంఘటన.
అది అక్టోబర్ 30, 1990, 29000 మంది పోలీసు బందోబస్త్ ఫైరింగ్ ఆర్డర్స్ తో అమానుషంగా చెలరేగిపోతుంటే.. వేలాది కరసేవకులు కాషాయ జెండాలు పట్టుకుని బాబ్రీ మసీదు లోపలికి దూసుకుపోవడానికి కొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకుని తెగబడుతుంటే.. మసీదు పైన కాషాయి జెండాని పాతడానికి బ్రహ్మ ప్రయత్నం జరుగుతూ.. ఆ విశ్వప్రయత్నాన్ని పోలీసు బలగాలు తిప్పికొడుతుంటే.. ఒక మర్కటమహారాజు మాత్రం పోలీసు జుల్మ్ ని ఖాతరు చేయకుండా, వారి దుష్టశక్తికి అతీతంగా మసీదు చిగురున కూర్చుని, పాతిన కాషాయ జెండా ఎవరూ పెకిలించకుండా కాపలాగా అక్కడే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఇది ఎవరికైనా గుర్తుందా? అసలు ఎవరైనా కన్నారా.. విన్నారా? ఇది పచ్చి నిజం. లక్షలాది మంది ముందు, లైవ్ మీడియా ముందు చోటు చేసుకున్న చోద్యం. ఇదే ఆ అపురూప చిత్రం.. వీక్షించి, తరించండి.
భారతదేశ చరిత్ర ఎప్పటికీ మరచిపోలేని రోజు.. అక్టోబర్ 30, 1990. విశ్వహిందూ పరిషత్ కి చెందిన వేలాది కరసేవకులు.. వారిని అడ్డుకోవడానికి, మసీదు ప్రవేశానికి వ్యతిరేకంగా అప్పటి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నియమించిన 28 వేల పోలీసు కానిస్టేబుల్ గణం. బాబ్రీ మసీదుకి వెళ్ళే రోడ్డు పూర్తిగా బారికేడ్స్ తో నిండి పోయింది. దారి పొడుగునా సాయుథ పోలీసుల హూంకరింతలు.. కరసేవకులకు, పోలీసు మహాశయులకు మధ్యన ఒక యుద్ధమే జరుగుతుంటే, ఒక సాధువు పోలీసు వ్యానులో డ్రైవర్ సీటులోకే నేరుగా దూకి లోపలికి దూసుకువెళ్ళిపోతుంటే .. అదొక ఉద్విగ్నభరితమైన సన్నివేశం. ఆ సాధువు గేట్లను బద్దలు కొట్టుకుని, లోపలికి వాయువేగంతో దూసుకుపోయి, వేలాది కరసేవకులు బాబ్రీ మసీదు ఆవరణలోకి జొరబడడానికి ఆస్కారం కల్పించిన సంఘటనని చరిత్ర పుటలు ఎప్పటికీ మరచిపోలేవు.
తక్షణమే.. సాయుథ పోలీసుల లాఠీ చార్జ్ ఊపందుకుంది. ఫైరింగ్ ఆర్డర్స్..కొందరి ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. అయినా వెనుదిరగకుండా కరసేవకులు ఆత్మాహుతిదళాలు రీతిలో వీరావేశంతో బాబ్రీ మసీదుపైన కాషాయ జెండాలు పాతడానికి రక్తం చిమ్ముకుంటూ మసీదు పైకప్పు పైకి ఎక్కడానికి ప్రయత్నించారు. కానీ పోలీసుల అరాచకం ఆగలేదు. చివరికి సాయంత్రానికల్లా కరసేవకులు వెనుదిరగక తప్పలేదు. పోలీసు సిబ్బంది డూమ్ మీద నుంచి కాషాయి జెండాలు పీకి పారేయడానికి ఉద్యుక్తులవుతుంటే..అదిగో అప్పుడే..ఆ క్షణమే..ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అందరూ నివ్వెరపోయారు. నిర్ఘాంతపోయారు. పోలీసులకైతే దిమ్మ తిరిగిపోయింది. పై ఫోటోలో కనిపిస్తున్న ఆ మర్కటమే జెండాని పట్టుకుని, పరిస్థితిని అదుపులోకి తీసుకుని, అక్కడే అలాగే కూర్చుండిపోయింది. గంటల తరబడి అక్కడే అలాగే.. చలనం లేకుండా బొమ్మలా ఉండిపోయింది. దాదాపు అర్ధరాత్రి వరకూ మర్కటం జాగరణ చేసింది. మర్కటం వెళ్ళిపోయాకనే కొందరు పోలీసులు డోమ్ పైకి ఎక్కి జెండాని పీకేశారు. మర్కటమంటే సాక్షాత్తూ హనుమంతులవారి రూపమే కదా.
అక్టోబర్ 30, `1990 నాడు జరిగినది ఇదైతే..జూలై 23, 1992నాడు మరో అద్భుత ఘట్టానికి తెర లేచింది. అక్టోబర్ 30వ తేదీన జరిగిన సంఘర్షణలో కేవలం 20మంది మాత్రమే ఫ్రాణాలు కోల్పోయారని అనాటి ప్రభుత్వం చెప్పినా, అంతకు మించే చనిపోయారన్నది ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పిన మాట. అంతమంది మరణించిన నేపధ్యంలో మందిర్ కరసేవ కార్యకలాపాలకు కొన్నాళ్ళపాటు బ్రేక్ పడింది. మళ్ళీ జూలై 23, 1992 నాడే కరసేవను పున:ప్రారంభించారు విశ్వ హిందూ పరిషత్ వారు. ఆరోజున కూడా పోలీసు బలగాలు కరసేవకులను వివాదస్పద స్థలంగా గుర్తించిన బాబ్రీ మసీదు ప్రదేశానికి చేరుకోకుండా కరసేవకులను ఉద్రిక్తకరమైన పరిస్థితుల నడుమ అడ్డుకుంటుంటే.. ఒక మర్కటం మాత్రం అమాంతంగా బారకేడ్లపైనంచీ గెంతుకుంటూ, తనదైన ఒరవడిలో ఎగురుకుంటూ వెళ్ళి బాబ్రీ మసీదు డోమ్ పైన కూర్చుంది. అదే ఆ ఫోటో. ప్రమోద్ పుష్కర్ణ అనే ఆనాటి యంగ్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫోటో ఇది. ఆయనకిప్పుడు 76 సంవత్సరాలు. ‘’ ఆ మర్కటం మరెవరో కాదు.. అక్షరాల భగవాన్ హనుమాన్లువారే.’’ అని ఈ వయసుపైబడ్డ ప్రమోద్ గుర్తు చేసుకుని పులకించిపోయాడు. ఈ ఫోటోగ్రాఫర్ ప్రమోదే అప్పటి విశ్వహిందూ పరిషత్ వర్కింగ్ ప్రెసిడెంట్ అశోక్ సింఘాల్ కి తోపులాటల్లో దెబ్బలు తగిలి, రక్తం కారుతుంటే హాస్పిటల్ కు తీసుకెళ్ళి, వైద్యసేవలనందించాడు. అదీ రామజన్మ భూమికి మర్కట మహారాజుకి మధ్యన మమతానురాగబంధం. యుగయుగాల అనుసంధానం.