iDreamPost
android-app
ios-app

ఏడాదిగా అత్తను గదిలో బంధించిన గయ్యాళి కోడలు!

అత్తాకోడలి మధ్య గొడవలు జరగడం అనేది చాలా సాధారణం. అయితే కొందరు కోడళ్లు మాత్రం వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ కోడలు...వృద్ధురాలైన తన అత్తగారికి నరకం చూపింది.

అత్తాకోడలి మధ్య గొడవలు జరగడం అనేది చాలా సాధారణం. అయితే కొందరు కోడళ్లు మాత్రం వృద్ధాప్యంలో ఉన్న అత్తగారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ కోడలు...వృద్ధురాలైన తన అత్తగారికి నరకం చూపింది.

ఏడాదిగా అత్తను గదిలో బంధించిన గయ్యాళి కోడలు!

అత్తాకోడళ్లకి మధ్య వైరం అనేది సర్వసాధారణం. చాలా తక్కువ మంది మాత్రమే తల్లీకూతుర్ల మాదిరిగా ఎంతో అన్యోన్యంగా ఉంటారు. ఎక్కువ మంది అత్తాకోడళ్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ గొడవ పడుతుంటారు. అయితే కొన్ని సార్లు మాత్రం దారుణమైన ఘటనలు అత్తాకోడళ్ల విషయంలో జరుగుతుంటాయి. అమ్మలాంటి అత్తను ఎంతో ప్రేమగా చూసుకునే కోడళ్లు  కొందరు ఉంటే.. హింసించి, వేధింపులకు గురిచేసే గయ్యాళి కోడళ్లు కూడా ఉన్నారు. గతంలో అత్తను  దారుణంగా కొట్టిన కోడళ్ల స్టోరీలు మనం చూశాం. తాజాగా వారందరికి మించిన కొరివి దెయ్యం లాంటి కోడళ్లు వార్తల్లో నిలిచింది. వృద్ధురాలైన అత్తగారిని ఏడాది పాటు గదిలో బంధించి వేధింపులకు గురి చేసింది. మరి..చివరకు ఏమైంది.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కర్నాటక రాష్ట్రం తుమకూరులోని శిరా గేట్ సమీపంలోని లేఔట్ లో 80 ఏళ్ల పంకజాక్షి అనే వృద్ధురాలు తన కుమారుడు, కోడలితో కలిసి నివాసం ఉంటుంది. చిన్నతనం నుంచి కొడును ఎంతో అల్లారు ముద్దుగా పెంచి.. పెళ్లి చేసింది. భర్త మరణంతో ఆమె కొడుకు వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. అయితే కుటుంబ కలహాల కారణంగా కొడుకు భార్య..ఈ వృద్ధురాలిని వేధింపులకు గురి చేసింది. అంతేకాక పంకజాక్షిని  గదిలో నిర్భందించింది. ఆమెకు అన్నం, నీరు గదిలోకి పంపేది. వృద్ధురాలిని బయటకు రాకుండా అడ్డుకునేది. అలా ఒక్కరోజు కాదూ రెండు రోజులు కాదు.. ఏకంగా ఏడాది పాటు అలానే ఉంచింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం వృద్ధురాలి కుమారుడు మద్యం తాగి వచ్చి భార్యతో గొడవకు దిగాడు. తన తల్లిని బయటకు రాకుండా చేశావని  మండిపడ్డాడు. ఇలా వీరి కుటుంబంలో జరిగిన గొడవతో ఆ వృద్ధురాలి విషయం బయటకు వచ్చింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక పోలీసులు పంకజాక్షి ఉండే ఇంటికి వెళ్లి తలుపులు తెరిచే ప్రయత్నం చేశారు. అయితే వారిని ఆ వృద్ధురాలి కోడలు అడ్డుకుంది. పోలీసులు గట్టి వార్నింగ్ ఇవ్వడంతో ఆ కోడలు వెనక్కి తగ్గింది. అనంతరం ఇంట్లోకి వెళ్లి గదిలో ఉన్న వృద్ధురాలిని బయటకు తీసుకువచ్చారు.

పంకజాక్షితో జిల్లా న్యాయమూర్తి నూరున్నీసా ఘటన స్థలాన్ని పరిశీలించి వృద్ధురాలితో మాట్లాడారు. అనంతరం వృద్ధురాలిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సలు అందించిన అనంతరం సాంత్వన కేంద్రానికి తరలించారు.  ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు అందరి మనస్సు కలచి వేశాయి. తాను..తన కోడలు ఉండే ఇంటికి వెళ్లనని, ఎక్కడైనా ఆశ్రయం కల్పించాలని వేడుకుంది. ఆమెను ఎంతో వేధింపులకు గురి చేస్తోనో అలాంటి బాధకరమైన మాటలు వస్తాయి. చాలా రోజుల పాటు ఆ వృద్ధురాలు నరకం చూసింది. ఇలా వృద్ధారాలైన అత్తగారిని వేధింపులకు గురిచేసేవారికి ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.