iDreamPost
android-app
ios-app

వీడియో: చిరుత‌తో గ్రామ‌స్థులు ఆటలు! వీళ్ళేం మనుషులు రా బాబు?

  • Author Soma Sekhar Published - 04:06 PM, Wed - 30 August 23
  • Author Soma Sekhar Published - 04:06 PM, Wed - 30 August 23
వీడియో: చిరుత‌తో గ్రామ‌స్థులు ఆటలు! వీళ్ళేం మనుషులు రా బాబు?

ప్రస్తుతం చిరుత పులులు జనావాసాల్లోకి సంచరిస్తున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తిరుమలలో ఇప్పటికే నాలుగు చిరుత పులులను పట్టుకున్న సంగతి తెసిందే. అదీకాక ఇటీవలే హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ లో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఇక చిరుతను దూరం నుంచి చూస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలాంటి చిరుతతో ఆటలడితే.. ఇంకేమైనా ఉందా? కానీ ఈ గ్రామస్థులు మాత్రం చిరుతతో ఆటలు ఆడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ లోని దేవాస్ జిల్లా ఇక్లేరా సమీపంలోని అడవిలో చిరుత సంచరిస్తూ కనిపించింది. ఆ చిరుతను చూసిన గ్రామస్థులు భయంతో వణికిపోయారు. పారిపోయేందుకు అటూ ఇటూ పరుగులు తీశారు. కానీ కొద్దిసేపు ఆ చిరుతను పరీక్షించి చూడగా.. దుకుడుగా లేకుండా నీరసంగా కనిపించింది. దీంతో గ్రామస్థులు ఆ చిరుతకు ఏదో అయ్యిందని గ్రహించారు. అందరు కలిసి ఆ చిరుత పులి దగ్గరకు వెళ్లి.. దానితో ఆడుకోవడం మెుదలు పెట్టారు. అనారోగ్యంతో ఉన్న చిరుత చుట్టూ చేరి దాని పైకి ఎక్కి రైడింగ్ చేయడానికి ప్రయత్నించారు. ఓ పెంపుడు జంతువులా దానితో ఆడుకుంటూ.. సెల్పీలు తీసుకున్నారు.

ఇక ఈ విషయాన్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అటవీశాఖ అధికారులకు చేరవేశాడు. దాంతో వెంటనే రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని ఆ చిరుతను సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు. రెండేళ్ల వయసున్న ఈ చిరుతను భోపాల్ లోని వాన్ విహార్ కు తీసుకెళ్లినట్లు అటవీ అధికారి తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న చిరుతను గ్రామస్థులు ఇబ్బంది పెట్టారని ఆయన పేర్కొన్నారు. కాగా.. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందింస్తున్నారు. ఇలా అనారోగ్యంతో ఉన్న జంతువును ఇబ్బంది పెట్టినందుకు సిగ్గు పడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.