Dream11లో SI క్రికెట్ బెట్టింగ్! ఒక్క మ్యాచ్ తో కోటీశ్వరుడయ్యాడు!

ఎంత కష్టపడి సంపాదించినా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉంటే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోతుంటారు. లాటరీలో జాక్ పాట్ కొట్టి.. కలలో కూడా ఊహించనంత డబ్బులు చూసిన వ్యక్తుల గురించి అనేక సార్లు కథలు కథలుగా విన్నాం. కానీ ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా కోట్ల రూపాయలను సంపాదించడం గురించి ఎక్కడైనా చూశారా.. ఆ ఆన్ లైన్‌లో డబ్బులు పోగొట్టుకోవడమే కానీ.. తిరిగి రావడం కల్లా అని సమాధానమే వస్తుంది కచ్చితంగా. ఇలా అనుకుంటే ఇతడ్ని లక్కీ మ్యాన్ అనకకుండా ఉండలేరు. ఎందుకంటే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా మనోడు కోటీ రూపాయలకు పైగా కొల్లగొట్టాడు. ఇంత డబ్బు వస్తుందని బహుశా అతడూ కూడా ఊహించి ఉండడు. దసరా పండుగ వేళ ధనలక్ష్మి పలకరిస్తుండటంతో పరవశించిపోతున్నాడు.

ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ యాప్ ‘డ్రీమ్ 11’ ఓ పోలీసు అధికారిని కోటీశ్వరుడ్ని చేసింది. ఇంతకు ఆ లక్కీ పర్సన్‌ది ఏ ఊరు అంటే.. మహారాష్ట్రలోని పింప్రిచించ్ వాడ్. అక్కడి పోలీస్ క మీషనరేట్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు సోమ్ నాథ్ జెండే. క్రికెట్ మీద ఆసక్తి, బెట్టింగ్ అంటే పిచ్చితో క్రికెట్ బెట్టింగ్ ఫ్లాట్ ఫామ్ డ్రీమ్ 11లో మూడు నెలలుగా పందెం కాస్తూ వస్తున్నారు. తాజాగా భారత్ వేదికగా ప్రపంచ కప్ జరుగుతుండగా.. తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బెట్టింగ్‌లు కడుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్-బంగ్లా దేశ్ మ్యాచ్ పై బెట్టింగ్ వేశారు సోమ్ నాథ్. మ్యాచ్‌లో ది బెస్ట్‌గా ఆడిన ప్లేయర్స్‌ను ఎంపిక చేసుకోగా.. తన అంచనాలు నిజమయ్యాయి. దీంతో పాయింట్ల పట్టికలో టాప్ స్థానానికి చేరుకున్నాడు. దీంతో అతడిపై కోట్ల వర్షం కురిసింది.

తాను ప్రిడిస్కన్ చేసి బెట్టింగ్ చేయగా.. అతను ఊహించని విధంగా రూ. 1.5 కోట్లు గెలుచుకున్నాడు. గంటల వ్యవధిలోనే కోటీశ్వరుడు అవ్వడంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు సోమ్ నాథ్.. అతడి కుటుంబ సభ్యులు. ఇంత మొత్తంలో డబ్బులు గెలవడంతో పండుగకు ముందే.. వారింట సంబరాలు అంబరాన్ని తాకాయి. మిఠాయిలు పంచుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఎప్పటి నుండో తాను బెట్టింగ్స్ కడుతుండగా.. ఇప్పటి వరకు సక్సెస్ కాలేకపోయానని, అయితే మంగళవారం తాను ఊహించిన విధంగా టీమ్ 11ను ఎంచుకోగా.. తన టీమ్ టాప్‌లోకి వచ్చిందన్నారు ఎస్సై. టాప్ లోకి రాగానే రూ. 1.5 కోట్లు గెలుచుకున్నానని మేసేజ్ వచ్చిందని, తన సంతోషానికి అవధుల్లేవంటూ ఆనంద వ్యక్తం చేశారు.

Show comments