iDreamPost
android-app
ios-app

వీడియో: నడి రోడ్డుపై యువతి యోగాసనాలు.. చివరకు ఏమైందంటే?

వీడియో: నడి రోడ్డుపై యువతి యోగాసనాలు.. చివరకు ఏమైందంటే?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్స్ రకరకాల వీడియోలు చేస్తూ వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేస్తూ లక్షల్లో వ్యూస్ పొందుతూ ఫేమస్ అయిపోతున్నారు. డ్యాన్స్, సాంగ్స్, కామెడీ వంటి రకరకాల వినూత్న వీడియోలు చేస్తూ లక్షల మంది ఫాలోవర్స్ ను సంపాదించుకుంటున్నారు. అయితే ఇది పరిమితికి లోబడి చేస్తే ఏ ఇబ్బందులు తలెత్తవు. కానీ హద్దులు దాటి రూల్స్ అతిక్రమిస్తే దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే రీతిలో ఓ యువతి నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై యోగా చేసి షాక్ తిన్నది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అందరిలా వీడియోలు చేస్తే కిక్కేముంటుందని కొందరు వెరైటీగా ఆలోచించి పబ్లిక్ ప్లేస్ లలో, మెట్రో స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, ఆఖరికి రోడ్లపై కూడా వీడియోలు చేసి తమలో ఉన్న టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకుంటారు. కానీ పబ్లిక్ కు పఇబ్బంది కలిగేలా చేస్తే చిక్కుల్లో పడతామని వారి దాకా వచ్చే వరకు ఊహించి ఉండరు. అటువంటి ప్రదేశాల్లో వీడియోలు చేసిన వాళ్లకు పోలీసులు జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గుజరాత్ లో ఓ యువతి నడి రోడ్డుపై యోగాసనాలు వేసి జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది.

రాజ్ కోట్ లో దినా పర్మార్ అనే యువతి ఇన్ స్టా రీల్ కోసం నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుపై యోగాసనాలు వేసింది. ఓ పక్క వర్షం పడుతుంది.. మరో వైపు వాహనాలు వెళ్తున్నాయి. అయినా ఆ యువతి అలాగే తన విన్యాసాలను కొనసాగించింది. అలా న‌డిరోడ్డుపై యోగా చేస్తుండ‌గా వాహ‌నాల రాక‌పోక‌ల‌కు అవాతంరం ఏర్ప‌డింది. కాగా దినా పర్మార్ యోగాస‌నాలు వేస్తుండ‌గా పోలీసులు వీడియో తీశారు. ఈ వీడియోను గుజ‌రాత్ పోలీసులు ట్విట్ట‌ర్‌లో షేర్ చేయ‌గా అది కాస్తా వైర‌ల్‌గా మారింది. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆమెకు పోలీసులు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన తర్వాత దినా పర్మార్ తను ఇతరులకు ఇబ్బంది కలిగేలా వ్యవహరించినందుకు క్షమాపణలు కోరింది.

 

View this post on Instagram

 

A post shared by Gujarat Police (@gujaratpolice_)