iDreamPost
android-app
ios-app

ఒక్క వేటుతో పులిని చంపిన వీరనారి క్యాన్సర్ తో పోరాడుతూ మృతి!

Shaurya Chakra Award Winner Mizoram Zadingi Passed Away: ఆడది అంటే అబల కాదు.. ఆది పరాశక్తి అని ఈ మహిళ ఎప్పుడో నిరూపించింది. పులి తనపై దాడికి దిగితే.. ఒక్క వేటుతో పులిని చంపి శౌర్య చక్ర అవార్డును సైతం అందుకుంది.

Shaurya Chakra Award Winner Mizoram Zadingi Passed Away: ఆడది అంటే అబల కాదు.. ఆది పరాశక్తి అని ఈ మహిళ ఎప్పుడో నిరూపించింది. పులి తనపై దాడికి దిగితే.. ఒక్క వేటుతో పులిని చంపి శౌర్య చక్ర అవార్డును సైతం అందుకుంది.

ఒక్క వేటుతో పులిని చంపిన వీరనారి క్యాన్సర్ తో పోరాడుతూ మృతి!

మహిళలు అంటే కేవలం వంటింటికి మాత్రమే పరిమితం కాదు. ఆడదంటే అబల కాదు.. ఆది పరాశక్తి అని ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో చూశాం. అలాగే దేశంలో వివిధ రంగాలు, స్ట్రీమ్స్ లో తమ సత్తా చాటుతున్నారు. అంతేకాకుండా తెగువోల కూడా ఆడవాళ్లు ఏ మాత్రం తీసిపోరు అని నిరూపించిన ఓ మహిళ ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు. మహిళల్లో ఉండే తెగువకు ఆమె నిలువెత్తు సాక్ష్యం. భారతదేశంలో ఉండే మహిళల శౌర్య చరిత్రలో ఆమె తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఆమె గొడ్డలితో పులిని చంపి వార్తల్లో నిలిచింది. తాజాగా ఆమె మృతి చెందింది. స్థానికుల నుంచే కాకుండా.. ఎంతో మంది ప్రముఖల నుంచి కూడా ఆమె ఘన నివాళి అందుకుంది.

ఈ మహిళ మరెవరో కాదు.. బంగ్లాదేశ్ సరిహద్దులోని లుంగ్ లేయీ జిల్లా బువార్ పుయీకి చెందిన జెడింగీ(72). ఆమె సరిగ్గా 46 ఏళ్ల క్రితం వార్లల్లో నిలిచారు. గొడ్డలితో ఏకంగా పులిని హతమార్చి ఆమె ప్రాచుర్యాన్ని సంతరించుకున్నారు. సుధీర్ఘ కాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న జెడింగీ శుక్రవారం తన స్వగ్రామంలో తుదిశ్వాస విడిచారు. పులితో పోరాడి గెలిచిన ఆ మహిళ.. క్యాన్సర్ ముందు మాత్రం ఓడిపోయింది అంటూ పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. జెడింగీ కుటుంబానికి మిజోరాం రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దుహోమా సంతాపం తెలియజేశారు. తన పోస్ట్ లో జెడింగీ గురించి గొప్పగా రాసుకొచ్చారు. ఆమె సాహసికురాలు అయిన మిజో మహిళ. శౌర్యచక్ర అవార్డు గ్రహీత అంటూ ప్రస్తావించారు.

జెడింగీ కథ గురించి అక్కడి వారికి అందరికీ తెలుసు. 1978లో ఆమె పుయిలో కట్టె పుల్లల కోసం అడవికి వెళ్లింది. అయితే ఆ సమయంలో ఆమెపై ఒక పులి దాడికి ప్రయత్నించింది. సాధారణంగా పులిని చూడగానే ఎవరికైనా పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది జెడింగీ మాత్రం ఆ పులితో పోరాడేందుకు సిద్ధమైంది. తన దగ్గర ఉన్న గొడ్డలితో పులి తల మీద ఒక్క వేటు వేసింది. ఇంకేముంది జెడింగీ వేసిన ఆ వేటుకు ఆ పులి అక్కడే చనిపోయింది. ఆ పులి కళేబరాన్ని మమ్మీగా మార్చారు. అది ఇప్పటికీ మిజోరం రాష్ట్ర మ్యూజియంలో భద్రంగా ఉంది. ఆమె వీర పరాక్రమానికి 1980లో భారత ప్రభుత్వం ఆమెను ‘శౌర్యచక్ర’ అవార్డుతో సత్కరించింది. అలాగే ఆమె శౌర్య పరాక్రమ గాథను రాష్ట్ర విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి