iDreamPost
android-app
ios-app

ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. 600 కి.మీ కాలి నడకతో

చిన్న దూరం నడవాలంటే ఆపసోపాలు పడుతుంటారు నేటి యువత. కానీ ఓ వృద్దుడు ఏకంగా 600 కిలోమీటర్ల మేర నడిచాడు. తన కాళ్లను నమ్ముకుని, రేయింబవళ్లు నడిచి గమ్య స్థానానికి చేరుకున్నాడు. ఎందుకంటే..?

చిన్న దూరం నడవాలంటే ఆపసోపాలు పడుతుంటారు నేటి యువత. కానీ ఓ వృద్దుడు ఏకంగా 600 కిలోమీటర్ల మేర నడిచాడు. తన కాళ్లను నమ్ముకుని, రేయింబవళ్లు నడిచి గమ్య స్థానానికి చేరుకున్నాడు. ఎందుకంటే..?

ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. 600 కి.మీ కాలి నడకతో

కరోనా సమయంలో వలస కార్మికుల వెతలు గురించి విన్నాం. రైలు, బస్సు వంటి సదుపాయాలు నిలిచిపోవడంతో చాలా మంది కాళ్లను నమ్ముకున్నారు. పిల్ల పాపలతో రోడ్డు మార్గంలో స్వగ్రామాలకు చేరుకున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక తినడానికి తిండి లేక ఇబ్బంది పడ్డారు. కానీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసుకోలేక ఓ వలస కార్మికుడు వందల కిలోమీటర్ల మేరకు నడిచి వార్తల్లో నిలిచాడు. చేతిలో చిల్లిగవ్వ లేదు, ఊరెళ్లడానికి డబ్బులు లేవు. ఇటు చూస్తే పని లేదు. దీంతో ఎవరినీ అడగలేక.. సెల్ఫ్ రెస్పెక్ట్ పొగొట్టుకోలేక, తన కాళ్లను నమ్ముకుంటూ తన సొంత ఊరికి పయనం అయ్యాడు. అలాగే 600 కిలోమీటర్ల దూరం నడిచి గమ్యస్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ఈ రోజుల్లో కాస్తంత దూరానికే కుయ్యో మొర్రో అంటున్నారు. ఇక యూత్ గురించి చెప్పనక్కర్లేదు. ఖర్చు పెట్టి ఖరీదైన క్యాబ్‌లో పోతారేమో కానీ గంట కూడా గట్టిగా నడవలేరు. కానీ ఈ తాత ఏకంగా ఆరువందల కిలోమీటర్లు నడిచి వార్తల్లో నిలిచాడు. వివరాల్లోకి వెళితే.. ఒడిశాలోని డుమరబెడకు చెందిన సోను బోత్ర అనే వ్యక్తి కూలి పనుల కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. అయితే ఆయనకు 65 ఏళ్లు కావడంతో ఎవరు పనిలో పెట్టుకోలేదు. పని కోసం వచ్చిన వృద్ధునికి ఎక్కడా పని దొరకలేదు. దీంతో తాను తెచ్చుకున్న డబ్బులు అయిపోయాయి. ఊరెళ్లేందుకు తన దగ్గర డబ్బులు లేవు. ఎవరిని అడగాలంటే ఆత్మాభిమానం అడ్డొచ్చింది.

దీంతో పొట్ట చేతబట్టుకుని, తన కాళ్లను నమ్ముకుని హైదరాబాద్ నుండి ఒడిశాకు పయనం అయ్యాడు. అలా సుమారు 14 రోజుల పాటు నడుచుకుంటూ తన స్వగ్రామానికి చేరుకున్నాడు. మధ్యలో ఎవరైనా భోజనం పెడితే తింటూ అలసిన చోట విశ్రాంతి తీసుకున్నాడు. అలా రేయి, పగలు తేడా లేకుండా నడుస్తూ .. కడుపు చేత పట్టుకుని మహా నగరం నుండి తన ఇంటికి చేరుకున్నాడు. ఆత్మాభిమానం కన్నా ఆకలిదప్పికలు గొప్పవి కాదని భావించిన అతడు.. ఎవరిని చిల్లి గవ్వ కూడా అడగకుండా, ఈ వయస్సులో కూడా తన కాళ్లను నమ్ముకుని గమ్యస్థానానికి చేరుకుని వార్తల్లో నిలిచాడు. కాస్తంత దూరానికే ఆపసోపాలు పడే ఈ రోజుల్లో ఈ వయస్సులో, ఇంత దూరం నడిచాడంటే ఆ తాతను గ్రేట్ అనకుండా ఉండలేం.