iDreamPost
android-app
ios-app

School Holidays: విద్యార్థులకు పండగే పండగ.. జూలై 1 వరకు స్కూల్స్‌ బంద్‌.. కారణం ఇదే

  • Published Jun 19, 2024 | 9:12 AM Updated Updated Jun 19, 2024 | 9:12 AM

విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. జూలై 1 వరకు వేసవి సెలవులు పొడగించారు. ఎందకంటే..

విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. జూలై 1 వరకు వేసవి సెలవులు పొడగించారు. ఎందకంటే..

  • Published Jun 19, 2024 | 9:12 AMUpdated Jun 19, 2024 | 9:12 AM
School Holidays: విద్యార్థులకు పండగే పండగ.. జూలై 1 వరకు స్కూల్స్‌ బంద్‌.. కారణం ఇదే

విద్యార్థులకు పండగలాంటి వార్త అని చెప్పవచ్చు. అదేంటి అంటే.. వేసవి సెలవులు పొడగించారు. సాధారణంగా ఏప్రిల్‌ మధ్య నుంచి జూన్‌ నెల మధ్య వరకు 50-60 రోజుల పాటు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తారు. ఆ తర్వాత స్కూల్స్‌ తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు వేసవి సెలవులను పొడగిస్తూ నిర్ణయం తీసుకుంటాయి. తాజాగా ఛత్తీసగఢ్‌లో వేసవి సెలవులను ఈ నెల అనగా జూన్‌ 25 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. మరో 12 రోజుల పాటు స్కూల్స్‌కు సెలవులు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే జూలై 1 వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఎక్కడ.. ఎందుకంటే..

మన దగ్గర అంటే జూన్‌ నెల ఆరంభం నుంచే వర్షాలు పడటంతో.. వాతావరణ చల్లబడింది. కానీ ఉత్తరాదిలో మాత్రం ఇంకా భానుడి భగభగలు కొనసాగుతూనే ఉన్నాయి. తీవ్రమైన ఎండలు కాస్తుండటంతో జనాలు వేడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణ శాఖ పలు ఉత్తరాది రాష్ట్రాలకు ఇప్పటికి కూడా హీట్‌వేవ్‌ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. యూపీ, బీహార్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ సహా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ప్రతి రోజు 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతోంది. ఎండ వేడిమికి, వడదెబ్బకు చిన్న పిల్లల ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంది.

Schools closed till July 1

ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో వేసవి సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ క్రమంలోనే యూపీ సర్కార్‌ కూడా వేసవి సెలవులు పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. హీట్‌ వేవ్‌ నేపథ్యంలో జూలై 1 వరకు వేసవి సెలవులను పొడగించారు. ఇప్పటికే యూపీలోని మున్సిపల్‌ పాఠశాలలకు 8వ తరగతి వరకు విద్యార్థులకు వేసవి సెలవులను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

యూపీ సహా మొత్తం ఆరు రాష్ట్రాల్లో జూలై 1 వరకు వేసవి సెలవులు పొడగిస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణాలో జూలై 1 వరకు వేసవి సెలవులు పొడగించగా.. ఢిల్లీలో జూన్‌ 30 వరకు పొడగించారు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో జూన్‌ 25 వరకు సమ్మర్‌ హాలీడేస్‌ పెంచారు.