వీడియో: ఉగ్రరూపం ఎత్తిన స్కూలు బాలికలు!

ప్రభుత్వ స్కూలులో సరైన సౌకర్యాలు కల్పించలేదన్న కారణంతో కొంతమంది బాలికలు ఉగ్రరూపం దాల్చారు. ఓ ప్రభుత్వ అధికారి వాహనంపై విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లు ఇతర వస్తువులతో కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. బిహార్‌లో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. బిహార్‌లోని వైశాలి ప్రాంతంలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో సరైన సౌకార్యలు లేవు.

సరిగా లేని పాఠశాల గదులు, వాష్‌ రూములు, నీరు, తిండి ఇలా అన్ని విషయాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బాలికల సంగతి అయితే, చెప్పనక్కర్లేదు. వాష్‌రూములు లేని కారణంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలా సార్లు తమ స్కూల్లోని సమస్యల గురించి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి లాభం లేకపోయింది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచినా స్కూలు పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు రాలేదు.

దీంతో బాలికలు ఆగ్రహానికి గురయ్యారు. ఆందోళనకు దిగారు. అప్పుడు దిగి వచ్చిన అధికారులు సమస్యలు తెలుసుకోవటానికి స్కూలు దగ్గరకు వచ్చారు. వారి రాకతో బాలిక ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అధికారి కారుపై విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లు ఇతర వస్తువులతో కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. అధికారులు, మిగిలిన వారు బాలికలనుంచి తప్పించుకుని పారిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Show comments