iDreamPost
android-app
ios-app

గజదొంగ మాత్రమే కాదు.. అమ్మాయిల మనస్సు కూడా దోచేస్తాడు.. కానీ ఆ డబ్బులతో

  • Published Oct 17, 2024 | 12:33 PM Updated Updated Oct 17, 2024 | 12:33 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మోసిన దొంగ. లగ్జరీ లైఫ్ స్టైల్ అతడిది. అంతేనా లవర్ బాయ్ కూడా. ఏ ఊరిలో దోచుకోవడానికి వెళితే.. అక్కడ అమ్మాయిల మనస్సు దోచేస్తుంటాడు. అలా ఏకంగా..

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మోసిన దొంగ. లగ్జరీ లైఫ్ స్టైల్ అతడిది. అంతేనా లవర్ బాయ్ కూడా. ఏ ఊరిలో దోచుకోవడానికి వెళితే.. అక్కడ అమ్మాయిల మనస్సు దోచేస్తుంటాడు. అలా ఏకంగా..

  • Published Oct 17, 2024 | 12:33 PMUpdated Oct 17, 2024 | 12:33 PM
గజదొంగ మాత్రమే కాదు.. అమ్మాయిల మనస్సు కూడా దోచేస్తాడు.. కానీ ఆ డబ్బులతో

ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి.. పేరు మోసిన దొంగ. విలాసంవతమైన జీవితం గడపడమంటే భలే సరదా. లగర్జీ కార్లు, విమానాల్లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటల్స్‌లోనే బస.. ఇది అతడి లైఫ్ స్టైల్. ఓ రిచ్ బిజినెస్ మ్యాన్ లైఫ్‌కు ఏ మాత్రం తక్కువ తీసిపోదు ఇతడి జీవన విధానం. పక్కా స్కెచ్ వేసి పోలీసులకు కూడా చిక్కకుండా చోరీలకు పాల్పడుతుంటాడు. వస్తువులను కొట్టేయడంలోనే కాదు.. అమ్మాయిల మనస్సు దోచేయడంలో పిహెచ్‌డీ చేశాడు. ఎక్కడ చోరీ పాల్పడాలనుకుంటే.. అక్కడ అమ్మాయిల్ని, మహిళల్ని ఆకర్షిస్తుంటాడు. నచ్చితే వివాహం లేకుంటే గర్ల్ ఫ్రెండ్‌గా మెయిన్ టైన్ చేస్తుంటాడు.  పేరుకు దొంగే కాదు.. అతడి చూపు ఏ అమ్మాయిపైనా లేదా మహిళపైనా పడిందా అంతే తన కౌగిట్లో చేరాల్సిందే.  పేరుకు దొంగే కానీ అతడు మన్మధుడు. ఇంతకు ఈ దొంగ లవర్ బాయ్ ఎవరంటే..?

బీహార్‍లోని సీతామర్హిలో పేరు మోసిన గజదొంగ మమ్మద్ ఇర్ఫాన్.. అలియాస్ ఉజాల్..  జీవన శైలి చూస్తే మతి పోవాల్సిందే.  రాయల్‌గా బతకాలన్నది కోరిక. అందుకు తగ్గట్టుగానే పడవల్లాంటి కార్లలో, ఫైవ్ స్టార్ హోటళ్లలో, విమానాల్లో ప్రయాణం సాగిస్తుంటాడు. అతడు కేవలం గజదొంగ కాదు.. రసిక రాజా కూడా.  రెండేళ్ల క్రితం ఘజియాబాద్‌లోని కవినగర్ కొత్వాలి పోలీసులు ఇర్ఫాన్‌ను అరెస్టు చేయడంతో అతడి విచిత్ర లైఫ్ స్టైల్ తెలిసింది.  అమ్మాయిల్ని, మహిళల్ని వలపు వల వేసి.. తన కామ వాంఛ తీర్చుకుంటాడు. ఇప్పటి వరకు అతడి జాబితాలో 10 మంది భార్యలు, ఆరుగురు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు.  ప్రియురాళ్లను మార్చి మార్చి ఎంజాయ్ చేయడం అతడికి హాబీ. వయస్సుతో సంబంధం లేకుండా మహిళతో శృంగారం జరిపేవాడు.  అమ్మాయిలకు డబ్బు వల వేసి సర్వస్వం దోచుకుంటాడు.

ఇర్ఫాన్ ఏ నగరంపై కన్నేస్తే ఆ నగరంలో అమ్మాయిని పటాయించేవాడు. ఆ మహిళలను లేదా అమ్మాయిని తన మాయమాటలతో బురిడీ కొట్టించేవాడు. అమ్మాయి ఫ్లాట్ అయితే.. మూడు ముళ్లు వేసి తన జీవిత భాగస్వామిని చేసుకునే వాడు. లేదంటే గర్ల్ ఫ్రెండ్‌గా కొనసాగించేవాడు. వీరిని కూడా మళ్లీ మళ్లీ కలవడానికి ఇష్టపడడు. అలాగో అతడికి లాంగ్ డ్రైవ్ అంటే ఇష్టం. అలా బీహార్ నుండి ఢిల్లీ వెళ్లిపోతుంటాడు. అలా వెళుతున్నప్పుడు తన కంటికి కనిపించిన విలాసవంతమైన బంగ్లాలపై కన్నేస్తాడు. వారం పది రోజుల పాటు స్కెచ్ వేస్తాడు. లక్షల, కోట్ల రూపాయల విలువ చేసే వస్తువులను దొంగిలించి.. పోలీసులకు సవాలు విసిరేవాడు. అతడి లైఫ్ స్టైల్ చూసి అమ్మాయిలు ఇట్టే పడిపోయేవారు. ఇక పోలీసుల దృష్టిలో, పెద్దోళ్ల దృష్టిలో ఇర్ఫాన్ గజదొంగ కానీ.. అతడి గ్రామంలో దేవుడు. దోచుకున్న సొమ్ముతో ఎక్కువ భాగాన్ని గ్రామ అభివృద్ధికి ఖర్చు చేశాడు. గ్రామంలో రోడ్డు, విద్యుత్ దీపాలు వంటివి ఏర్పాటు చేశాడు. ఆయన మొదటి భార్య  ఇటీవల జరిగిన జిల్లా పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించింది.  మరీ ఈ దొంగ లవర్ బాయ్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişİmajbetultrabetjojobetjojobetcasibomcasibomcasibomşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetjojobetgrandpashabetgrandpashabetgrandpashabetganobetcasibom girişbetciojojobetcasibom