మందు కొట్టి స్కూల్ బస్సులు నడుపుతున్న డ్రైవర్లు.. తాట తీసిన ట్రాఫిక్ అధికారులు!

School Bus Drivers: ఇటీవల దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతో మంది అమాయకుల జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి.

School Bus Drivers: ఇటీవల దేశంలో ప్రతిరోజు పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు చేస్తున్న నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఎంతో మంది అమాయకుల జీవితాలు గాల్లో కలిసిపోతున్నాయి.

మద్యం సేవించి వాహనాలు నడపరాదని ప్రభుత్వాలు ఎన్ని కఠిన నిబంధనలు తీసుకువస్తున్నా.. కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం నిండు ప్రాణాలు బలి అవుతున్నాయి. అతి వేగం, నిర్లక్ష్యం, అవగాహన లేమి, నిద్రలేమి, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల నిత్యం ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయని అధికారలు అంటున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఎంత కఠినతరం చేసినా, నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, భారీగా చలాన్లు విధిస్తున్నా కొంతమంది డ్రైవర్లు తీరు మారడం లేదని అంటున్నారు అధికారులు. పిల్లలను ఎంతో జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిన స్కూల్ బస్ డ్రైవర్లు పొద్దునే మందు సేవించి రావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటర బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విద్యార్థులతో బయలుదేరే స్కూల్ బస్సు విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. స్కూల్ బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది పొద్దున్నే మందు సేవించి బస్సులు నడపడం తీవ్ర కలకలం రేపింది. బెంగుళూరు సిటీలో వెలుగు చూసిన ఓ సంఘటన పోలీసులు షాక్ కి గురి చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 23 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు పట్టుబడ్డారు. బెంగుళూరు ట్రాఫిక్ పోలీసులు జులై 9 మంగళవారం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు.

మొత్తం 3016 పాఠశాల వాహనాలు తనిఖీ చేయగా 23 మంది డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పాజిటీవ్ వచ్చింది. వీరిపై మోటరు వాహనాల చట్టం సెక్షన్ 185 కింద కేసు నమోదు చేసినట్లు బెంగుళూరు ట్రాఫిక్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంఎన్ అనుచేత్ తెలిపారు. అలాగే స్పెషల్ డ్రైవ్ లో ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేని 11 వాహనాలను గుర్తించామని ఆయన తెలిపారు. తదుపరి చర్య్లకు డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్ ను ఆర్టీవో ఆఫీసులకు పంపించామని అన్నారు. తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో స్కూల్ బస్సుల్లో పిల్లలను పంపుతారు.. కానీ ఇలాంటి ట్రైవర్ల వద్ద వారి ప్రాణాలకు ప్రమాదం ఉందని తెలిస్తే తల్లిదండ్రులు ఆందోళన చెందుతారని అన్నారు.

Show comments