iDreamPost
android-app
ios-app

స్కూల్ బస్సులో పేలుడు.. అందులో 50 మంది విద్యార్థులు!

  • Published Sep 18, 2024 | 2:00 PM Updated Updated Sep 18, 2024 | 2:00 PM

Fire Erupt In Private School Bus: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ స్కూల్ బస్ కి సంబంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

Fire Erupt In Private School Bus: ఇటీవల రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ స్కూల్ బస్ కి సంబంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

స్కూల్ బస్సులో పేలుడు.. అందులో 50 మంది విద్యార్థులు!

ఈ మధ్య కాలంలో ప్రమాదాలు ఏ రూపంలో ముంచుకు వస్తున్నాయో అర్థం కాని పరిస్థితి. సాధారణంగా కాలేజ్, స్కూల్స్ కి విద్యార్థులను తీసుకువెళ్లే బస్సులు, వ్యాన్లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని అవి ఫిట్ గా ఉంటేనే బయట నడపాలని ఆర్టీఏ అధికారులు సూచిస్తుంటారు. కానీ కొంతమంది విద్యా సంస్థల యాజమాన్యం ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం.. సిబ్బంది కూడా పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల తరుచూ స్కూల్, కాలేజ్ బస్సులు ప్రమాదాలకు గురవుతుంటాయి. విద్యార్థులతో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు‌లో పేలుడు జరగడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ కు చెందిన బస్సు రోజులాగే స్టూడెంట్స్ ని ఎక్కించుకొని బయలేదేరింది. ఆ సమయంలో బస్సులో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉన్నట్టుండి బస్సులో నుంచి పొగలు వ్యాపించాయి.. కొద్ది సెకండ్లలోనే మంటలు చెలరేగాయి. దీంతో అందులో ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అది గమనించిన డ్రైవర్ బస్సును వెంటనే ఆపేశాడు. లోపల  దట్టంగా పొగలు వ్యాపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. అరుపులు.. కేకలు వేస్తూ ఒక్కసారే బస్సులో నుంచి బయటకు పరుగులు తీశారు. కాసేపు బస్సులో ఏం జరుగుతుందో విద్యార్థులకు అర్థం కాని పరిస్థితి నెలకొంది. బస్సులో ఉన్న బ్యాటరీ పేలడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది.

డ్రైవర్ సమయానికి బస్సును ఆపడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. పొగ, మంటలు వ్యాపించడంతో విద్యార్థులు వెంటనే బస్సు దిగిపోవడం వల్ల అంతా క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని యాజమాన్యం, బస్సు డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా స్కూల్ యాజమాన్యం పేరెంట్స్ కి సమాచారం ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నించారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని.. బస్సును పరిశీలించి ఉంటే ఇలాంటి ప్రమాదం జరిగి ఉండేది కాదని అంటున్నారు.

దేవుడి దయవల్ల పిల్లలు అంతా క్షేమంగా ఉన్నారు.. ఏదైనా జరగరానికిది జరిగి ఉంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉండేది అని మండిపడ్డారు. ఇకముందైనా బస్సును పూర్తిగా పరీక్షించిన తర్వాత రోడ్డుపై నడపాలని డిమాండ్ చేశారు. గతంలో తెలుగు రాష్ట్రాలో స్కూల్ బస్సులు ఇలాంటి ప్రమాదాలుకు గురయ్యాయి.. కొందమంది విద్యార్థులు చనిపోయారు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతున్నా స్కూల్ యాజమాన్యం, డ్రైవర్లు నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.