వీడియో: ప్రచార ర్యాలీలో సొంత పార్టీ కార్యకర్తల్ని నెట్టేసిన మాజీ CM

రాజకీయాల్లో ఒక పార్టీకి, ఇంకో పార్టీకి మధ్య ఘర్షణలు సర్వసాధారణం. ఇందులో భాగంగా నెట్టేయడాలు కూడా కామనే. అయితే ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం అయి ఉండి సొంత కార్యకర్తల్ని నెట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల్లో ఒక పార్టీకి, ఇంకో పార్టీకి మధ్య ఘర్షణలు సర్వసాధారణం. ఇందులో భాగంగా నెట్టేయడాలు కూడా కామనే. అయితే ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం అయి ఉండి సొంత కార్యకర్తల్ని నెట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల్లో ఒక పార్టీకి, ఇంకో పార్టీకి మధ్య ఘర్షణలు సర్వసాధారణం. ఒక పార్టీ, ఇంకో పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇందులో భాగంగా నెట్టేయడాలు కూడా కామనే. ఇలాంటి ఫైట్లలో కార్యకర్తలు గాయపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఇది వేర్వేరు పార్టీల మధ్య జరిగితే ఏదో అనుకోవచ్చు. కానీ సొంత పార్టీ నేతే తమ కార్యకర్తల్ని నెట్టేస్తే ఏమనాలి? అందులోనూ స్వయంగా పార్టీ చీఫ్​, మాజీ ముఖ్యమంత్రి ఈ పని చేస్తారని ఊహించగలమా? కానీ ఇది జరిగింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో చోటుచేసుకుంది.

యూపీ మాజీ సీఎం, సమాజ్​వాదీ పార్టీ చీఫ్​ అఖిలేష్ యాదవ్ సొంత పార్టీ కార్యకర్తల్ని నెట్టేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. లోక్​సభ ఎన్నికల నేపథ్యంలో కన్నౌజ్ నియోజకవర్గానికి ఆయన వచ్చారు. అక్కడే తన నామినేషన్ దాఖలు చేశారు. రామ్ గోపాల్ యాదవ్​తో పాటు పార్టీలోని ఇతర ప్రముఖుల సమక్షంలో నామినేషన్ పత్రాలను అఖిలేష్ సమర్పించారు. తొలుత ఈ నియోజకవర్గం నుంచి తన మేనల్లుడు తేజ్ ప్రతాప్​కు అఖిలేష్​ టికెట్ ఇచ్చారు. అయితే లోకల్ లీడర్స్ నుంచి వ్యతిరేకత రావడంతో మళ్లీ తానే పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా గురువారం కన్నౌజ్​కు వచ్చి నామినేషన్ వేశారు. ఇంతవరకు బాగానే ఉంది గానీ అక్కడ నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలో ఎస్పీ కార్యకర్తల్ని అఖిలేష్ నెట్టేయడం హాట్ టాపిక్​గా మారింది.

అఖిలేష్ సభకు భారీగా జనం తరలివచ్చారు. సమాజ్​వాదీ కార్యకర్తలు, నేతలతో పాటు మాజీ సీఎంను చూసేందుకు సాధారణ జనం కూడా వేలాదిగా తరలివచ్చారు. దీంతో కన్నౌజ్ సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అఖిలేష్​ను కలిసేందుకు ఒకేసారి భారీగా జనాలు వేదిక మీదకు వచ్చేశారు. వాళ్లను సముదాయించేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన అఖిలేష్ కార్యకర్తల్ని నెట్టేశారు. ఆయన నెట్టేసిన వేగానికి ఆరేడుగురు కార్యకర్తలు కిందపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్స్ ఒక పార్టీ అధినేత, మాజీ సీఎం అయి ఉండి సొంత కార్యకర్తల్ని నెట్టేయడం ఏంటని సీరియస్ అవుతున్నారు. మరి.. అఖిలేష్ కార్యకర్తల్ని నెట్టేసిన ఈ ఘటనపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments