iDreamPost
android-app
ios-app

రైలు ప్రమాదం.. గూడ్స్​ రైలును ఢీకొట్టిన సబర్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్

దేశంలో రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్​ రైలును సబర్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టింది.

దేశంలో రైలు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా మరో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్​ రైలును సబర్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ ఢీకొట్టింది.

రైలు ప్రమాదం.. గూడ్స్​ రైలును ఢీకొట్టిన సబర్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్

దేశంలో చోటుచేసుకుంటున్న రైలు ప్రమాదాలు ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్నాయి. రైలు ప్రయాణమంటేనే బయపడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మానవ తప్పిదాలు, టెక్నికల్ సమస్యలతో రైళ్లు ప్రమాదబారిన పడుతున్నాయి. ప్రమాదాల నివారణకు రైల్వే అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. తాజాగా రాజస్థాన్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును వెనక నుంచి ఢీకొన్నది. ఈ ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయని తెలుస్తోంది.

రాజస్థాన్ అజ్​మేర్​ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదార్​ స్టేషన్​ సమీపంలో ఉన్న గూడ్స్​ రైలును సబర్మతి సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్ వెనకు నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో సబర్మతి ఎక్స్​ప్రెస్​ ఇంజిన్​ సహా 4 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన అర్థరాత్రి జరిగినట్లు సమాచారం. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. పట్టాలు తప్పిన కోచ్‌లు, ఇంజిన్‌లను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకొచ్చేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు. కాగా ఈ ప్రమాదంలో మరణాలు చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.