సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ కి ప్రమాదం.. అసలేం జరిగిందంటే!

Accident to Sabarmati Express: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్, భీమ్ సేన్ స్టేషన్‌ల మధ్య సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలులోని 22 కోచ్ లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.

Accident to Sabarmati Express: ఉత్తర్ ప్రదేశ్‌లోని కాన్పూర్, భీమ్ సేన్ స్టేషన్‌ల మధ్య సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలులోని 22 కోచ్ లు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.

ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటి భారత రైల్వే.  ప్రతి రోజు ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారస్థులు ఇలా లక్షల సంఖ్యల్లో ప్రయాణికులు రైల్ ప్రయాణాలు చేస్తుంటారు. ఇతర ప్రైవేట్ వాహనాలతో పోల్చితే రైలు ప్రయాణాలు ఎంతో సురక్షితం అంటారు. అంతేకాదు సుదూర ప్రయాణాలు చేయాలంటే రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.. ఇక్కడ అన్ని వసతులు ఉంటాయి. టీ, టిఫిన్, మీల్స్ అన్ని అందుబాటులో ఉంటాయి. పర్యాటక ప్రదేశాలకు ఫ్యామిలీతో వెళ్లేవారు ఎక్కువగా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఎంతో సురక్షితంగా భావించే రైలు ప్రయాణం ఇటీవల ప్రాణసంకటంగా మారుతున్నాయి. తాజాగా సబర్మతి ఎక్స్ ప్రెస్ కి ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల భారత దేశంలో రైలు ప్రమాదాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. తాజాగా వారణాసి నుంచి అహ్మదాబాద్ (19168) వెళ్లే సబర్మతి ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ లోని 22 కోచ్ లో శనివారం ఉదయం ఉత్తర్ ప్రదేవ్ లోని కాన్పూర్-భీమ్ సేన్ స్టేషన్ ల మధ్య పట్టాలు తప్పినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు వచ్చారు. ప్రయాణికులను పలు బస్సుల్లో కాన్పూర్ కి తరలించారు.   ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు.

ఇంజన్‌ను ఢీ కొట్టిన వస్తువు ఆనవాళ్లు 16వ బోగీ వద్ద గమనించామని.. ఆ ఆనవాళ్లను భద్రపరిచినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో వారణాసి జంక్షన్ – అహ్మదాబాద్ మార్గంలో పలు రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటనపై రైల్వే మంత్రి ట్విట్టర్ (ఎక్స్) లో స్పందించారు. ‘కాన్పూర్ సమీపంలో ట్రాక్ పై ఉన్న ఓ వస్తవును ఇంజన్ ఢీ కొట్టడంతో సబర్మతి ఎక్స్ ప్రెస్ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ట్రాప్ పై పదునైన గుర్తులు కనిపించాయి. ఆధారాలు సేఫ్టీగా ఉంచాం. ఈ ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు, ఇంటెలీజెన్స్ బ్యూరో అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నారు. సిబ్బంది, ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు’ అని పోస్ట్ చేశారు.

Show comments