iDreamPost
android-app
ios-app

ఎలక్ట్రిక్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి!

Volvo C40: తరచూ ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్నిప్రమాదం అంటూ వార్తలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఈ వాహనాలను కొనేందుకు ప్రజలు భయపడుతుంటారు. తాజాగా రూ.63 లక్షల విలువ చేసి ఎలక్ట్రిక్ కారు కాలి బూడిదైంది.

Volvo C40: తరచూ ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్నిప్రమాదం అంటూ వార్తలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో ఈ వాహనాలను కొనేందుకు ప్రజలు భయపడుతుంటారు. తాజాగా రూ.63 లక్షల విలువ చేసి ఎలక్ట్రిక్ కారు కాలి బూడిదైంది.

ఎలక్ట్రిక్ కారు కొనాలి అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి!

నేటికాలంలో ఎలక్ట్రిక్  వాహనాలను వినియోగించేందుకు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా పెరగుతున్న ఇంధన ధరలు దృష్టిలో ఉంచుకుని, అలానే పర్యావరణం కోసం ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కొంతకాలం క్రితం ఈవీ వాహనాల విక్రయాలు ఎక్కువగా జరిగేవి. అయితే ఇటీవల కాలంలో ఈ వెహికల్స్ కొనేందుకు జనం భయపడుతున్నారు. అందుకు కారణం..ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోవడం, అగ్నికి ఆహుతి కావడం. ఇప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా రూ. 63 లక్షల విలువైన ఎలక్ట్రిక్ కారు.. మంటల్లో కాలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎలక్ట్రిక్ వాహనాల్లో ముఖ్యంగా స్కూటర్ల విషయానికి వస్తే.. మంటలకు ఆహుతైన ఎలక్ట్రిక్ బైకులు కోకోల్లలుగానే ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైకుల్లో షార్ట్ సర్క్యూట్‌లు, అధిక ఛార్జింగ్ వంటి సమస్యల కారణంగానే ఎక్కువగా మంటలు చెలరేగుతుంటాయి. ఈ ప్రమాదాలకు సంబంధించిన విషయాలు 2022లో చాలా వెలుగులోకి వచ్చాయి. అనంతరం ఈ ఘటనలు కొంత తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ అక్కడక్కడా ఒక్కో సంఘటన అప్పుడప్పుడూ వెలుగులోకి వస్తూనే ఉంది. తాజాగా రూ.63 లక్షల విలువ చేసే ఎలక్ట్రిక్ కారు కాలిపోయింది.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన స్వీడన్ కార్ల తయారీ సంస్థ ‘వోల్వో’కు చెందిన ఈ కారు మంటల్లో చిక్కుకుంది. ఇక అగ్నికి ఆహుతి అవుతోన్న కారు వోల్వో సీ 40 మోడల్ కి చెందిన రీఛార్జ్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ అని తెలుస్తోంది. అలానే ఈ ఘటన ఛత్తీస్ గడ్ లో జరిగినట్లు సమాచారం. స్థానిక మీడియా సమాచారం ప్రకారం.. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ కు చెందిన సౌరబ్ రాథోడ్ అనే వ్యక్తి తన ముగ్గురుస్నేహితులతో కలిసి ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఎన్ హెచ్ 53 జాతీయ రహదారిపై జర్ని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే కారు నుంచి బయటకు దిగేశారు. కాసేపటికే వారు చూస్తుండగానే ఆ కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

ఈ ఘటనలో సౌరబ్ కళ్ల ముందే రూ.63 లక్షల విలువైన కారు కాలి బూడిదైపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను టెస్లా క్లబ్ ఇండియా ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఘటనపై  వోల్వో సంస్థకు చెందిన అధికారులు ఇంకా స్పందించలేదు. అలానే కారులో మంటలు చెలరేగడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. వోల్వో సీ-40  ఎలక్ట్రిక్ కారు మంటల్లో కాలిపోవడానికి గల కారణాలు ఖచ్చితంగా చెప్పలేం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..వోల్వో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే తొలిసారి.

కాబట్టి  కారు కాలిపోవడానికి గల కారణాలకు సదరు కంపెనీ తప్పకుండా వెల్లడించే అవకాశం ఉంది. మన దేశంలో విద్యుత్ కార్లు మంటల్లో కాలిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో దేశీయ దిగ్గజం టాటా మోటార్ కంపెనీకి చెందిన నెక్సాన్ ఈవీ కూడా మంటలు చిక్కుకుని కాలిపోయింది. ఇలా వరుస ప్రమాదాల నేపథ్యంలో ఈవీ వాహనాలను కొనేందుకు జనాలు వెనుకడుగు వేస్తున్నారు. మరి..ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.