Venkateswarlu
పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెరుగుతున్న గ్యాస్ ధరలు నెత్తి మీద బండలా తయారు అయ్యాయి. దీంతో ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో తక్కువ ధరకే గ్యాస్ హామీలను ఇస్తున్నాయి.
పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెరుగుతున్న గ్యాస్ ధరలు నెత్తి మీద బండలా తయారు అయ్యాయి. దీంతో ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో తక్కువ ధరకే గ్యాస్ హామీలను ఇస్తున్నాయి.
Venkateswarlu
నిత్యావసరాల్లో గ్యాస్‌కు ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడంటే కట్టెల పొయ్యిలు ఉండేవి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కడో కొండ ప్రాంతాల్లో తప్పితే.. కట్టెల పొయ్యిలు కనిపించటం లేదు. మారు మూల గ్రామాల నుంచి పెద్ద పెద్ద నగరాల్లోని నివసించే వారంతా వంట చేయడానికి గ్యాస్‌నే ఎక్కువగా వాడుతున్నారు. అయితే, గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. దీంతో గ్యాస్ వాడకం ప్రియంగా మారిపోయింది. డబ్బున్న వారి సంగతి పక్కన పెడితే..
పేద, మధ్య తరగతి కుటుంబాలకు గ్యాస్ వాడకం కొంత ఇబ్బందిగానే ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో 14 కేజీల గ్యాస్ సిలిండర్ ధర దాదాపు 1000కిపైనే ఉంది. గతంలోలాగా సబ్సీడీ పడటం లేదు. గ్యాస్ ధరలు పెరిగిన ప్రతీసారి జనాలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో గ్యాస్‌కు సంబంధించిన హామీలను గుప్పిస్తున్నాయి. తక్కువ ధరలకే గ్యాస్‌ను ఇస్తామని ప్రకటిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ ధరకే గ్యాస్ హామీని ఇచ్చింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు హామీని అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. కేవలం తెలంగాణలోనే కాదు.. మొన్న ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆయా పార్టీలు తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ హామీని ఇచ్చాయి. రాజస్తాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా గ్యాస్ హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే.. 450 రూపాయలకే గ్యాస్‌ను ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మేరకు హామీని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసింది.
2024 జనవరి 1వ తేదీనుంచి 450 రూపాయలకే గ్యాస్ అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ఓ ప్రకటన చేశారు. రాజస్తాన్‌లో అమలులో ఉన్న ఉజ్వల పథకం కింద జనవరి నుంచి కొత్త గ్యాస్‌లు ఇస్తామన్నారు. కాగా, అశోక్ గెహ్లాట అధికారంలో ఉన్నపుడు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌ను అందించారు. ఇప్పుడు భజన్ లాల్ అంతకంటే 50 రూపాయలు తక్కువకే గ్యాస్‌ను అందిస్తున్నారు. ఇక, తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకు గ్యాస్‌ను అందించనున్నారు. అతి త్వరలో 500 గ్యాస్ పథకం అమల్లోకి రానుంది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఈ పథకం వర్తించే అవకాశం ఉంది. అంతేకాదు.. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి కూడా పథకం వర్తించే అవకాశం ఉంది. మరి, రాజస్తాన్‌లో 450 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.