చిన్నారికి రూ.17.5 కోట్ల ఇంజెక్షన్ తో ప్రాణం పోసిన వైద్యులు…!

వైద్య చరిత్రలోనే కొన్ని ఘటనలు నిల్చిపోయే విధంగా ఉంటాయి. అలానే తాజాగా 22 నెలల చిన్నారి విషయంలో కూడా అదే జరిగింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు చికిత్స చేసి జీవం పోశారు.

వైద్య చరిత్రలోనే కొన్ని ఘటనలు నిల్చిపోయే విధంగా ఉంటాయి. అలానే తాజాగా 22 నెలల చిన్నారి విషయంలో కూడా అదే జరిగింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు చికిత్స చేసి జీవం పోశారు.

వైద్య చరిత్రలో అనేక వింత వింత అరుదైన ఘటనలు చోటుచేసుకుంటాయి. ముఖ్యగా పలు రకాల వ్యాధుల విషయంలో అందరికి ఆశ్చర్యాన్ని కలిగించే పరిణామాలు జరుగుతాయి. వైద్య చరిత్రలోనే కొన్ని ఘటనలు నిల్చిపోయే విధంగా ఉంటాయి. అలానే తాజాగా 22 నెలల చిన్నారి విషయంలో కూడా అదే జరిగింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు చికిత్స చేసి జీవం  పోశారు. 17 కోట్ల రూపాయల విలువ చేసే ఇంజెన్క్షతో ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టారు. మరి..ఈ స్టోరీకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే…

రాజస్థాన్ లో హృదయాంశ్ అనే 22నెలల చిన్నారి అరుదైన వ్యాధితో బాధ పడుతున్నారు. నాలుగునెలల నుంచి వెన్నెముక కండరాల క్షీణత టైప్-1 వ్యాధితో ఈ చిన్నారి బాధపడుతున్నాడు. చిన్నతనంలో ఆ బాబుకు  ఉన్న వ్యాధి గురించి ఎవరు అంత గమనించలేదు. ఆ తరువాత పెరిగే క్రమంలో ఈ అరుదైన వ్యాధి బయటపడింది. ఈ వ్యాధి నయంకావాలంటే.రూ. 17.5 కోట్లు విలువైన జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి వచ్చింది.

అయితే బాధితుడి తల్లిదండ్రులు నిరుపేద కుటుంబానికి చెందిన వారు. కూలీ చేసుకుని వచ్చిన సంపాదనతో జీవనం సాగిస్తున్నారు. దీంతో అంతటి ఆర్థిక భారాన్ని భరించే స్థితిలో ఆ చిన్నారి తల్లిదండ్రులు లేరు. కానీ మానవత్వం బతికే ఉందని సమాజం నిరూపిస్తూ.. ఈ చిన్నారికి అవసరమైన రూ.17.5 కోట్లు విరాళ రూపంలో ఇచ్చారు. ప్రజల సహాయంతో, హృదయాంశ్ కి ఇంజెక్షన్ వేసి.. అతడి ప్రాణాలు నిలబెట్టారు. రోడ్డుపై  కూరగాయలు అమ్ముకునే వారి నుంచి దేశంలోని పలువురు ప్రముఖుల వరకు అందరూ సాయం చేశారు.

హృదయాంశ్ అనే 22 నెలల ఈ చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే అరుదైన, వింత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య చరిత్రలోనే ఇది  అంతుచిక్కని అతిపెద్ద వ్యాధి. ప్రపంచంలో చాలా తక్కువ మందిక మాత్రమే ఇలాంటి వ్యాది వస్తోంది. ఇక ఆ వ్యాధి నయం కావాలంటే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్లలో ఒకటైన  జోల్జెన్స్మా ఇంజెక్షన్‌ కావాలి. ఇది జన్యు ఆధారిత చికిత్సకు ఉపయోగిస్తారు. దీని కోసం క్రౌడ్ ఫండింగ్ సాయంతో డబ్బులను పోగు చేశారు. మొత్తంగా అమెరికా నుంచి రూ.17.50 కోట్ల ఇంజక్షన్ తెప్పించి.. జైపూర్‌లోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారికి ఆ ఇంజెక్షన్ ఇచ్చారు.

ఇంజెక్షన్ ఇచ్చిన అనంతరం ఆ చిన్నారికి చికిత్స ప్రారంభించారు. జేకే లోన్ హాస్పిటల్‌లోని డాక్టర్ ప్రియాంషు మాథుర్, అతని బృందం ఈ అరుదైన ఇంజెక్షన్ ను దిగమతి చేశారు.  ఇంజెక్షన్ ఇచ్చిన తరువాత హృదయాంశ్ ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. రాజస్థాన్‌లో గతంలో ఇద్దరు ఈ ఇంజక్షన్ తీసుకున్నారు.  ఈ ఇంజక్షన్‌ తీసుకున్న మూడో బిడ్డ హృదయాంశ్‌. అతని తండ్రి చాలా సంతోషంగా ఉన్నాడు. క్రౌడ్ ఫండింగ్ సహాయంతో ఇంజక్షన్ తయారీ కంపెనీకి 3 విడతలుగా డబ్బులు అందజేస్తామని చెబుతున్నారు.

Show comments