iDreamPost
android-app
ios-app

కష్టాల్లో ఐటీ ఉద్యోగులు.. రోజుకు 500 మంది రోడ్డున పడుతున్న వైనం!

  • Published Jun 22, 2024 | 9:25 PM Updated Updated Jun 22, 2024 | 9:25 PM

Daily 500 IT Employees Lost Their Job: ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏ మాత్రం బాలేదు. ఐటీ కంపెనీలు లేఆఫ్స్ పేరుతో భారీగా ఉద్యోగులను తొలగిస్తుండడంతో అనేక మంది రోడ్డున పడుతున్నారు. నివేదికల ప్రకారం.. రోజుకు 500 మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.

Daily 500 IT Employees Lost Their Job: ప్రస్తుతం ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఏ మాత్రం బాలేదు. ఐటీ కంపెనీలు లేఆఫ్స్ పేరుతో భారీగా ఉద్యోగులను తొలగిస్తుండడంతో అనేక మంది రోడ్డున పడుతున్నారు. నివేదికల ప్రకారం.. రోజుకు 500 మంది ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.

కష్టాల్లో ఐటీ ఉద్యోగులు.. రోజుకు 500 మంది రోడ్డున పడుతున్న వైనం!

ఆర్థిక సంక్షోభం వల్లనో.. కొత్త ప్రాజెక్టులు రాకనో.. లేక ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావమో.. కొత్త టెక్నాలజీ రాకపోవడం ఇలా కారణాలు ఏమై ఉంటాయో తెలియదు కానీ ఐటీ పరిశ్రమలో భారీగా లేఆఫ్స్ మాట వినిపిస్తుంది. ప్రముఖ కంపెనీలతో సహా చిన్న చితకా కంపెనీలన్నీ భారీగా ఐటీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దీంతో చాలా మంది రోడ్డున పడుతున్నారు. దీంతో ఐటీ జాబ్ అంత సేఫ్ కాదేమో అన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. 2024 జనవరి 1 నుంచి జూన్ 21 వరకూ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 98,834 మంది ఐటీ ఉద్యోగులను కంపెనీలు తొలగించాయి. ఈ లెక్కలు కేవలం ఐటీ రంగంలో మాత్రమే. ఇంకా మిగతా రంగాలను కలిపితే ఈ లెక్క ఎంత ఉంటుందో ఊహిస్తేనే భయమేస్తుంది.

ఐటీ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది. రోజుకు ఏకంగా 500 మంది తమ ఉద్యోగాన్ని కోల్పోతున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఆలిండియా ఐటీ అండ్ ఐటీఈఎస్ ఎంప్లాయిస్ యూనియన్ డేటా ప్రకారం.. 2023లో సైలెంట్ లేఆఫ్స్ కింద 20 వేల మంది ఐటీ ఉద్యోగులు జాబ్స్ ని కోల్పోయారు. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2024లో మొదటి 5 నెలల్లో భారత్ లోని సైలెంట్ లేఆఫ్స్ కారణంగా ప్రముఖ ఐటీ కంపెనీలకు చెందిన సుమారు 2 వేల నుంచి 3 వేల మంది ఐటీ ఉద్యోగులు రోడ్డున పడ్డట్లు తెలుస్తోంది.

నేరుగా ఆ ఉద్యోగిని తీసేయకుండా.. ముప్పై రోజులు గడువు ఇచ్చి వేరే ఉద్యోగం చూసుకోమని కంపెనీలు చెప్తాయి. దీన్నే సైలెంట్ లేఆఫ్స్ అంటారు. 30 రోజుల్లో ఆ ఉద్యోగి వేరే కంపెనీలో ఉద్యోగం దొరికినా దొరక్కున్నా తాను చేసే కంపెనీ నుంచి వెళ్లిపోవాల్సిందే. లేదంటే కంపెనీ నేరుగా ఆ ఉద్యోగిని టర్మినేట్ చేస్తుంది. రిలీవింగ్ లెటర్ లో టర్మినేటెడ్ అని పడితే వేరే కంపెనీలో ఉద్యోగం దొరకడం కష్టం. దీంతో బయట కంపెనీలకు వెళ్లలేక.. చేసే కంపెనీలో కొనసాగలేక రోజూ ఐటీ ఉద్యోగులు నరకం చూస్తున్నారు. కత్తి మీద సాములా ఉంది వీరి పరిస్థితి.