iDreamPost
android-app
ios-app

అయోధ్య ప్రాణ ప్రతిష్టకు అద్వానీ ఎందుకు రాలేదంటే?

LK Advani- Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఎందుకు రాలేదంటే?

LK Advani- Ayodhya Ram Mandir: అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ట వేడుకకు బీజేపీ కురువృద్ధుడు అద్వానీ ఎందుకు రాలేదంటే?

అయోధ్య ప్రాణ ప్రతిష్టకు అద్వానీ ఎందుకు రాలేదంటే?

కోట్ల మంది భారతీయుల కల సాకారమైంది. బాలరాముడు అయోధ్య రామ మందిరంలో అంగరంగ వైభవంగా కొలువుదీరాడు. వేదపండితులు, అథిరథ మహారధులు, ప్రముఖులు సమక్షంలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. దేశ విదేశాల నుంచి కూడా ఈ వేడుకకు అతిథులు విచ్చేశారు. అయితే ఈ రామ మందిరం కల సాకారం అయ్యేందుకు కృషి చేసిన ఒక వ్యక్తి మాత్రం ఈ అయోధ్య వేడుకకు దూరంగా ఉండిపోయారు. ఆయన మరెవరో కాదు ఎల్కే అద్వానీ. ఆయన ఈ వేడుకకు రాకపోవడంపై పలు కారణాలు, ఊహాగానాలు వచ్చాయి. మరి.. ఎందుకు అద్వానీ అయోధ్యకు రాలేదో, అందుకు గల కారణం ఏంటో చూద్దాం.

అయోధ్య రామయ్య మందిర నిర్మాణం ఒకటి రెండు సంవత్సరాల్లో సాకారమైంది కాదు. 500 ఏళ్లుగా కొన్ని కోట్ల మంది కృషి చేశారు. కోట్లాది మంది రామ భక్తులు ఈ ఆలయ నిర్మాణం కోసం కృషి చేశారు. కొందరు ప్రాణత్యాగం కూడా చేశారు. వారి కలలను సాకారం చేస్తూ జనవరి 22న బాలరాముడు అయోధ్యలో కొలువుదీరాడు. అయితే ఈ బృహత్కర కార్యంలో తనవంతు కృషి చేసిన బీజీపీ సీనియర్ నాయకుడు, కురు వృద్ధుడు ఎల్ కే అద్వానీ మాత్రం ఈ వేడుకకు హాజరు కాలేదు. ఆయనకు అసలు ఆహ్వానమే అందలేదు అంటూ వార్తలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఎంతో మందిని ప్రత్యేకంగా ఆహ్వనించిన రామజన్మ భూమి తీర్థ ట్రస్టు సభ్యులు అద్వానీకి ఆహ్వానం ఇవ్వలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అవన్నీ అవాస్తవం అంటూ ట్రస్టు సభ్యులు ఖండించారు. తాము అద్వానీని కలిసి ఆహ్వానించిన విషయాన్ని వెల్లడించారు.

Why did Advani not come to Ayodhya

అయితే ఆయన ఎందుకు రాలేదు అంటూ అంతా పెద్దఎత్తున ఆలోచన చేస్తున్నారు. ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోవడానికి ప్రధాన కారణం వయోభారంగా చెబుతున్నారు. వయసు మీద పడటం వల్లే అద్వానీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. అంతేకాకుండా అయోధ్యలో ఉండే విపరీతమైన చలి కూడా అద్వానీ రాకపోవడానికి మరో ప్రధాన కారణంగా చెబుతున్నారు. అంతేగానీ.. అద్వానీకి ఆహ్వానం అందకపోవడం, ఆయనను కావలనే పిలవలేదు అనడంలో ఎలాంటి వాస్తవం లేదు. అసలు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎందుకు అద్వానీ రాక కోసం ఎదురుచూస్తున్నారో తెలుసా? అందుకు చాలా పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే అయోధ్యలో రామాలయం నిర్మించాలని గతంలోనే అద్వానీ దేశవ్యాప్తంగా రథయాత్రం చేశారు.

నేడు బీజేపీకి దేశవ్యాప్తంగా కార్యకర్తలు, అభిమానులు ఉన్నారంటే ఆరోజు అద్వానీ చేసిన ఈ రథయాత్రం కూడా ఒక కారణంగా చెప్పచ్చు. అప్పట్లే బీజేపీలో వాజ్ పేయీ, అద్వానీ మాత్రమే పెద్ద నేతలు. రెండంటే రెండే లోక్ సభ స్థానాలు ఉన్న భారతీయ జనతాపార్టీ 2014లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగిందంటే అందుకు అద్వానీ, వాజ్ పేయీ చేసిన కృషే కారణంగా చెప్పచ్చు. అందుకే అలాంటి ఒక నేత ఈ రోజు అయోధ్యలో వేడుకకు దూరమయ్యారని చాలామంది దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన రాకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిజానికి వయసురీత్యా ఆయన అయోధ్య వేడుకకు దూరంగా ఉన్నారన్న విషయాన్ని తెలుసుకుని కాస్త కుదుటపడ్డారు. మరి.. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.