మరోసారి తెరుచుకోనున్న రత్న భండార్.. ఆభరణాల తరలింపు

46 సంవత్సరాల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ తలుపులు తెరచుకున్నాయి. ఇదిలా ఉంటే.. మరోసారి ఈ రత్న భండార్ తెరవనున్నారు అధికారులు. ఆలయంలో ఉన్న ఆభరణాలను తరలించనున్నారట.

46 సంవత్సరాల తర్వాత పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్ తలుపులు తెరచుకున్నాయి. ఇదిలా ఉంటే.. మరోసారి ఈ రత్న భండార్ తెరవనున్నారు అధికారులు. ఆలయంలో ఉన్న ఆభరణాలను తరలించనున్నారట.

ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో ఉన్న రత్న భండార్ గురించి కొన్ని రోజులుగా తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఎన్నికల ముందే తాము అధికారంలోకి వస్తే రత్న భండార్ తెరుస్తామని అధికారంలోకి వచ్చిన బీజెపీ సర్కార్ చెప్పినట్లు చేస్తుంది. రత్న భండార్ తెరవడంపై ఒడిశా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రాథ్ అధ్యక్షతన 16 మంది సభ్యులతో ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 46 ఏళ్ల తర్వాత ఈ ఆదివారం అనగా 14వ తేదీన సుబా బేల (మంచి సమయం)లో మధ్యాహ్నం 1.28 గంటలకు తెరిచారు. 11 మంది కూడిన సిబ్బంది రత్న భండార్‌లోకి ప్రవేశించారు. ఈసారి రత్న భాండాగారంలోని వస్తువులు చెక్క పెట్టెల్లో భద్రపర్చి.. ఆ ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు.

ఇదిలా ఉంటే.. మరోసారి రత్నభండార్ తెరిచేందుకు మళ్లీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై 18వ తేదీన మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్నట్లు శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. గురువారం ఉదయం 9.51 గంటల నుండి 12.15 గంటల మధ్య మంచి గడియలు ఉన్న నేపథ్యంలో మరోసారి గది తలుపులు తెరవాలని శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేట‌ర్ అర‌బింద ప‌దే, జ‌స్టిస్ విశ్వంత్ రాథ్‌, పూరీ క‌లెక్టర్ సిద్ధార్థ శంక‌ర్ స్వెయిన్‌తో పాటు ఇత‌ర అధికారులు నిర్వహించిన స‌మావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాలను తాత్కాలికంగా వేరే గదికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాన్ని వీడియో తీస్తామని చెప్పారు.

విలువైన వస్తువులను తరలిస్తున్నందున భారీ బందోబస్తు ఏర్పాట్లు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో సీసీ టీవీ ఏర్పాట్లతో పాటు ఫైర్ యాక్సిడెంట్స్ జరగకుండా అన్ని రకాల అగ్నిమాపక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా పూరీ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని సూచనలు చేసింది.  మరోసారి రత్న భండార్ తెరుస్తున్న నేపథ్యంలో భక్తులకు కొన్ని నియమ నిబంధనలు విధించింది.  దేవాలయ  కమిటీ నిబంధనల ప్రకారం.. భక్తులు నడుచుకోవాలని చెబుతుంది. లోప‌లి గ‌దికి చెందిన తాళం చెవుల‌ను ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఇవ్వబోమ‌ని.. నిబంధనల ప్రకారమే తాళాలు తీయ‌నున్నట్లు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పదే తెలిపారు. లోప‌లి గ‌దిలో బాక్సులు, అల్మారాల‌ను తమ బృందం చూసిందని.. అయితే బ‌హుదా యాత్ర, సునా బేషా ఈవెంట్ల నేప‌థ్యంలో బంగారు ఆభ‌ర‌ణాల‌ను స్ట్రాంగ్‌రూమ్‌కు త‌ర‌లించేందుకు నిరాక‌రించిన‌ట్లు జ‌స్టిస్ బిశ్వంత్ రాథ్ స్పష్టం చేశారు. ఇక బ‌యటి గ‌దిలో ఉన్న విలువైన వ‌స్తువుల‌ను చాంగ్‌డా మేక‌ప్ స్ట్రాంగ్‌రూమ్‌కు త‌ర‌లించిన‌ట్లు ఆయన వెల్లడించారు.

Show comments