Arjun Suravaram
Delhi IAS Coaching Center: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి వరదనీరు పోటెత్తి.. సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు మృతి చెందిన సంగతి తెలిసింది. తాజాగా ఆ విద్యార్థుల కుటుంబాలకు రావూస్ కోచింగ్ సెంటర్ కీలక హామీ ఇచ్చింది.
Delhi IAS Coaching Center: ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి వరదనీరు పోటెత్తి.. సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు మృతి చెందిన సంగతి తెలిసింది. తాజాగా ఆ విద్యార్థుల కుటుంబాలకు రావూస్ కోచింగ్ సెంటర్ కీలక హామీ ఇచ్చింది.
Arjun Suravaram
ఢిల్లీలో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో సివిల్స్ విద్యార్థులు చనిపోయిన సంగతి తెలిసింది. గత శనివారం సాయంత్రం ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోకి వరదనీరు పోటెత్తి.. సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న అభ్యర్థులు మృతి చెందారు. ఈ విషాద ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఈ ఘటనలో తెలంగాణలోని మంచిర్యాలకు చెందిన తాన్యా సోని (25), ఉత్తర్ ప్రదేశ్‌కు చెంది శ్రేయా యాదవ్ (25), కేరళకు చెందిన నవీన్ డాల్విన్ (24) మృతిచెందారు. ఇక తాజాగా మృతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఆర్థిక సాయాన్ని రావుస్ కోచింగ్ సెంటర్ ప్రకటించింది. ఇదే సమయంలో కొన్ని ఈ కీలక అంశాలను ప్రస్తావించింది.
ఢిల్లీలో రావూస్ కోచింగ్ సెంటర్ లో మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ఆ సంస్థ ప్రకటించింది. ఈ కోచింగ్ సెంటర్ తరపు న్యాయవాది ఈ ప్రకటన చేశారు. అంతేకాక పలు అంశాలను ఆయన ప్రస్తావించారు. ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతితో బాధలో ఉన్న వారి కుటుంబానికి తమ వంతుగా ఆదుకునేందు ఆర్థిక సాయం ప్రకటించింది. రావూస్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ తరపు లాయర్ మోహిత్ సరాఫ్ ఈ ప్రకటన చేశారు.
తొలుత మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల సాయం వెంటనే చేస్తామని తెలిపారు. అలానే మిగిలిన రూ.25 లక్ష్యలు రావూస్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అభిషేక్ జైలు నుంచి విడులైన తరువాత ఇస్తామని తెలిపారు. అయితే అందుకు గల కారణాలను కూడా సరాఫ్ వివరించారు. ప్రస్తుతం ఇనిస్టిట్యూట్ లో పూర్తి స్థాయిలో నగదు లేదని, మిగిలిన నిధులు రావాలంటే.. అభిషేక్ బయటకు రావడమే కీలకమని తెలిపారు. అయితే మిగిలిన ఆర్థిక సాయాన్ని వచ్చే ఆరు నెల్లలోగా అందజేస్తామని తెలిపారు. వరద కారణంగా పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యుల బాధలను, ఆవేదను అర్థం చేసుకున్నట్లు, తాము కూడా తీవ్రంగా చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలానే విద్యార్థుల నిరసనలు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ కార్యకలాపాలకు తీవ్ర ప్రభావం చూపాయని ఆయన హైలైట్ చేశారు. సీఈవో అభిషేక్ జైలులో ఉండడం, ఇన్‌స్టిట్యూట్ పనులు నిలిచిపోవడంతో ఉద్యోగులకు కూడా జీతాలు అందడం లేదని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉంటే.. రావు ఐఏఎస్‌తో పాటు వాజిరామ్ మరియు నెక్స్ట్ ఐఏఎస్ వంటి కోచింగ్ సెంటర్లు కూడా మరణించిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రకటించారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సదరు సంస్థలు ప్రకటించాయి.
#WATCH | Old Rajinder Nagar Coaching Centre incident | Delhi: Rau IAS’ Advocate Mohit Saraf says, “What we are offering is a Rs. 50 lakh compensation to each one of the students who has lost his life. Rs. 25 lakhs right away and Rs. 25 lakhs once Abhishek, CEO of the… pic.twitter.com/pr7tW4nDXv
— ANI (@ANI) August 1, 2024