iDreamPost
android-app
ios-app

Ayodhya Temple:న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో రామ మందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం!

  • Published Jan 08, 2024 | 8:37 PM Updated Updated Jan 08, 2024 | 8:37 PM

యావత్తు దేశం మొత్తం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆలయనికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ పవిత్ర వేడుక కోసం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తాజాాగా ఈ కార్యక్రమాన్ని విదేశాల్లో కూడా ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకి అది ఎక్కడంటే..

యావత్తు దేశం మొత్తం అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆలయనికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ పవిత్ర వేడుక కోసం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తాజాాగా ఈ కార్యక్రమాన్ని విదేశాల్లో కూడా ప్రత్యేక్ష ప్రసారం చేయనున్నారు. ఇంతకి అది ఎక్కడంటే..

  • Published Jan 08, 2024 | 8:37 PMUpdated Jan 08, 2024 | 8:37 PM
Ayodhya Temple:న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో రామ మందిర ప్రారంభోత్సవ ప్రత్యక్ష ప్రసారం!

దేశవ్యాప్తంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ ఆలయనికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడూ ఈ ఆద్భుతమైన ఘట్టన్ని చూద్దమా అని కోట్లాది మంది ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఇక ఆ కొందాడ రాముని విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమ నిర్వహాణకు అయోధ్య రామ మందిరం ట్రస్ట్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఎంతో కన్నుల పండుగగా వేద మంత్రాల సాక్షిగా ఈ రామ మందిరం ప్రారంభోత్సవాన్ని ఈ నెల 22వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగానుంది. ఇక దీని కోసం దేశవ్యాప్తంగా 7000 మంది ముఖ్య అతిథులతో పాటు పలు సాధువులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు పరోక్షంగా వీక్షించనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని యునైటెడ్ స్టేట్స్ లో కూడా ప్రత్యేక్షప్రసారం చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే అయోధ్య శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం వారం రోజుల ముందు నుంచే అనగా జనవరి 16 నుంచే ఈ వేడుకలు ప్రారంభంకానున్నాయి. కాగా, ఈ పవిత్ర వేడుక కోసం భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోని కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అయితే తాజాగా జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని.. అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు సంబంధిత వర్గాలు నుంచి సమాచారం అందింది. ఇక రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట వేడుకను లైవ్ టెలికాస్ట్ ను విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల్లో  ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

అయోధ్య రాముని ప్రతిష్టాపన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కోసం బూత్ స్థాయిలో పెద్ద పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేయాలని బీజేపీ తమ కార్యకర్తలను ఆదేశించినట్లు సమాచారం. ఇక దీనిని సాధారణ ప్రజలు చూసేందుకు అనుగుణంగా పెద్ద స్క్రీన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు, వేడుకలను ప్రధాని మోడీ పర్యవేక్షిస్తున్నారు. రామమందిర నిర్మాణ సమితి అధినేత నృపేంద్ర మిశ్రా మాట్లాడుతూ.. రామ్‌లల్లా ప్రతిష్టపన సందర్భంగా అనుసరించాల్సిన అన్ని చర్యల గురించి చెప్పారు. దీనితో పాటు పాత రామ విగ్రహం, కొత్త రామ విగ్రహం రెండూ గర్భాలయంలో ప్రతిష్టించనున్నారు. ఇక పాత రామ విగ్రహాన్ని ఉత్సవ రాముడిగా పిలుస్తారని, ఈ రెండు విగ్రహాలను కొత్త రామమందిరంలో ఉంచుతామని నృపేంద్ర మిశ్రా తెలిపారు.

అలాగే ఈ కొందాడ రాముడి పట్టాభిషేకం సందర్భంగా ప్రధాన ఆచార వ్యవహారాలను వారణాసి పూజారి లక్ష్మీకాంత దీక్షిత్ నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా వేలాది మంది భక్తులకు అన్నదానం తో పాటు 1008 హుండీ మహాయజ్ఞాన్ని నిర్వహించనున్నారు. మహా సంప్రోక్షణకు వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అయోధ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరి, అయోధ్య ఉత్సవ వేడుకలను యునైటెడ్ స్టేట్స్ లో కూడా ప్రత్యేక్షప్రసారం చేయనున్నరనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.