iDreamPost

Ram Mandir: అయోధ్యలో కొలువుదీరే రాముడి విగ్రహం ఇదే.. శిల్పి మరెవరో కాదు..!

  • Published Jan 02, 2024 | 12:09 PMUpdated Jan 02, 2024 | 12:09 PM

అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? ఏ రాళ్లతో రూపొందించారు? తదితర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో ఆ విగ్రహాన్ని ఎవరు తయారు చేశారు? ఏ రాళ్లతో రూపొందించారు? తదితర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Jan 02, 2024 | 12:09 PMUpdated Jan 02, 2024 | 12:09 PM
Ram Mandir: అయోధ్యలో కొలువుదీరే రాముడి విగ్రహం ఇదే.. శిల్పి మరెవరో కాదు..!

శ్రీరాముడి భక్తులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. అయోధ్యలో నిర్మాణం పూర్తి చేసుకుంటున్న భవ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఈ నెల 22వ తేదీన అయోధ్య రామమందిర గర్భగుడిలో రామ్ లల్లాకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించనున్నారు. గర్భగుడిలో ప్రతిష్టించేందుకు మొత్తం 3 విగ్రహాలను తయారు చేయించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర. ఇందులో నుంచి ఒక విగ్రహాన్ని ఎంపిక చేశారు. నూతన రామాలయంలో కొలువుదీరనున్న రాముడి విగ్రహం ఖరారైంది. కర్ణాటకకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్​ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని సెలక్ట్ చేశారు. రాముడి విగ్రహం ఖరారైన విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

‘రాముడు ఎక్కడ ఉంటాడో, హనుమంతుడూ అక్కడే ఉంటాడు. యోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ట కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముడి విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్టించనున్నారు. రాముడు, హనుమంతుడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధానికి ఇది మరో ఎగ్జాంపుల్. ఆంజనేయుడి జన్మభూమి అయిన కర్ణాటక నుంచే రాముడి సేవా కార్యం జరిగింది’ అని ప్రహ్లాద్ జోషి ఆ ట్వీట్​లో రాసుకొచ్చారు. ఇక, రాముడి విగ్రహ తయారీ కోసం నేపాల్​లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా నుంచి మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

ayodhya sri ram idol

సేకరించిన రాళ్లన్నింటినీ పరిశీలించి అందులో నుంచి రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు. రాజస్థాన్​లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్​తో పాటు కర్ణాటకలో లభించిన శ్యామ శిలను ఎంపిక చేశారు. రాజస్థాన్​లో లభించే మక్రానా రాయి ఎంతో విశిష్టమైనదిగా పేరు గాంచింది. కర్నాటకలో దొరికే శ్యామ శిల కూడా శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రెండు రకాల రాళ్లు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. లాంగ్ లైఫ్ టైమ్ ఉండటం కూడా వీటి స్పెషాలిటీ. ఈ రాళ్లతో రాముడి విగ్రహాన్ని రూపొందించిన శిల్పి అరుణ్ యోగిరాజ్ (37) మరెవరో కాదు ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ కుమారుడు కావడం గమనార్హం. ఎంబీఏ పూర్తి చేసిన ఆయన యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి కావడం విశేషం.

2008లో ఉద్యోగం మానేసిన అరుణ్ యోగిరాజ్.. ఆ తర్వాత పూర్తిస్థాయి శిల్పకారుడిగా మారారు. మహారాజా జయచామరాజేంద్ర వడయార్​తో పాటు అనేక ప్రముఖుల విగ్రహాలను ఆయన తయారు చేశారు. కేదార్​నాథ్​లో స్థాపించిన జగద్గురు ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించింది కూడా ఆయనే. మైసూర్​లోని మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-4, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహాలను అరుణే తీర్చిదిద్దారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ దగ్గర కనిపించే స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ కూడా ఆయన తయారు చేసినదే. మరి.. అయోధ్యలో కొలువుదీరనున్న శ్రీరాముడి విగ్రహం మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: UPI కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి