Dharani
అధిక కట్నం కోసం భార్యను వేధించే భర్తలున్న మన సమాజంలో.. అప్పుడప్పుడు ఇదుగో ఇప్పుడు చెప్పుకోబోయే లాంటి మంచి వారు కూడా తారసపడుతుంటారు. పెళ్లికి ముందే చాలా గొప్ప నిర్ణయం తీసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ వ్యక్తి. ఆ వివరాలు..
అధిక కట్నం కోసం భార్యను వేధించే భర్తలున్న మన సమాజంలో.. అప్పుడప్పుడు ఇదుగో ఇప్పుడు చెప్పుకోబోయే లాంటి మంచి వారు కూడా తారసపడుతుంటారు. పెళ్లికి ముందే చాలా గొప్ప నిర్ణయం తీసుకుని ఎందరికో ఆదర్శంగా నిలిచాడు ఈ వ్యక్తి. ఆ వివరాలు..
Dharani
అంతరిక్షంలోకి దూసుకుపోతున్నామని చంకలు గుద్దుకుంటున్నాం కానీ.. కొన్ని అంశాల్లో మనం ఎంతో అనాగరికంగాగా ప్రవర్తిసాము అనేది కూడా అంతే వాస్తవం. మరీ ముఖ్యంగా ఆడవారితో ప్రవర్తించే విధానంలో మన సమాజం కొన్ని ఆటవిక జాతుల కన్నా దారుణంగా ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వారిపై లైంగిక వేధింపులకు గురి చేయడం, మహిళలపై అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయి. ఇవి చాలవన్నట్లు.. ఆడపిల్ల పెళ్లి.. కన్నవారికి ఎంతో భారంగా మారింది. కారణం వరకట్నం. చాలా మంది తల్లిదండ్రులు ఈ వరకట్న పిశాచికి భయపడే ఆడపిల్లలను వద్దనుకుంటున్నారు. ఈ దురాచారం నిషేధానికి మన దేశంలో వందల ఏళ్ల క్రితమే చట్టాలు వచ్చాయి. కానీ జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు.
20 శతాబ్దంలో కూడా అధిక కట్నం కోసం ఆడవారిని హతమారుస్తున్న దారుణాలు చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇందుకు భిన్నమైన వ్యక్తిని ఒకరిని ఇప్పుడు చూడబోతున్నాం. ఆ వ్యక్తి తన భార్య నుంచి రూపాయి కట్నం అవసరం లేదు.. పైగా ఆమె జీతం డబ్బులు కూడా ఆమె తల్లిదండ్రులకే ఇచ్చుకోమని చెప్పాడు. ఇంతకు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే..
రాజస్తాన్‌కు చెందిన ఓ యువకుడు ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుని వార్తల్లో నిలిచాడు. రాజస్తాన్, సికార్ జిల్లా, దంత రామ్‌గఢ్ ప్రాంతానికి చెందిన జై నారాయణ్ జఖార్ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పబ్లిక్ వెల్ఫర్ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న జై నారాయణ్‌కు పెళ్లికి సంబంధించి కొన్ని ఆదర్శాలు పెట్టుకున్నాడు. వివాహం సందర్భంగా వాటిని కచ్చితంగా అమలు చేశాడు. జైనారాయణ్‌కు అదే ప్రాంతానికి చెందిన అనిత అనే యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లి చూపుల సందర్భంలోనే తన నిర్ణయాన్ని వధువు కుటుంబానికి చెప్పాడు జై నారాయణ్.
తనకు రూపాయి కట్నం వద్దని.. పెళ్లి తర్వాత తన భార్య జాబ్ చేస్తే ఆ డబ్బును ఆమె తల్లిదండ్రలకే ఇవ్వొచ్చు అని.. అందుకు తనకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించాడు. చెప్పడమే కాక పెళ్లి సందర్భంగా కేవలం రూపాయి, ఒక కొబ్బరి కాయ మాత్రమే వధువు కుటుంబం నుంచి తీసుకున్నాడు. ఈ సందర్భంగా జైనారాయణ్ మాట్లాడుతూ.. ‘‘నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం మా తాతయ్య, నాన్న. వరకట్నం తీసుకోవడానికి నా మనసు అంగీకరించలేదు. ఇదే విషయం నా కుటుంబ సభ్యులకు చెబితే వారు అందుకు సంతోషంగా ఒప్పుకున్నారు’’ అని చెప్పుకొచ్చాడు. జై నారాయణ్ నిర్ణయంపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అతడిని చూసి కనీసం కొందరైనా మారితే బాగుటుంది అంటున్నారు.
ఇక నవ వధువు అనిత మాట్లాడుతూ.. ‘‘నేను పీజీ పూర్తి చేశాను. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నాను. పెళ్లి తర్వాత కూడా నన్ను చదివిస్తామని.. వరుడి కుటుంబం మాట ఇచ్చింది. అంతేకాక నాకు ఉద్యోగం వస్తే.. జీతం డబ్బులను నా కన్నవారికి ఇవ్వడంలో.. నా అత్తింటి వారికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదవించారు. అందుకోసం ఎంతో ఖర్చు చేశారు. పెళ్లయ్యాక జాబ్ వస్తే.. వారికి మద్దతివ్వడం కష్టమవుతుంది అని భావించాను. కానీ నా భర్త, అత్తింటి వారి వల్ల అలాంటి భయం లేదిక. ఈ విషయంలో నా భర్త, అత్తింటి వారికి ఎన్ని సార్లు థాంక్స్ చెప్పినా తక్కువే’’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.
జై నారాయణ్ ఆదర్శ వివాహం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైరల్ అయ్యింది. దాంతో సామాన్యులే కాక.. ఆ ప్రాంత ఎమ్మెల్యే సైతం జై నారాయణ్, అతడి కుటుంబ సభ్యులను ప్రశంసించారు. ప్రతి యువకుడు జై నారాయణ్‌ను ఆదర్శంగా తీసుకున్నప్పుడే వరకట్న దురాచారం మన సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించగలుగుతాం అన్నారు.