P Krishna
Rajasthan Deputy CM Premchand Bairwa: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు పోలీసు ఎస్కార్ట్ వాహనాలు వెనుక వస్తుండగా ఓపెన్ టాప్ జీపును నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
Rajasthan Deputy CM Premchand Bairwa: రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు పోలీసు ఎస్కార్ట్ వాహనాలు వెనుక వస్తుండగా ఓపెన్ టాప్ జీపును నడుపుతూ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది.. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
P Krishna
రాజస్థాన్ ఉపముఖ్యమంత్రి ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడు మరో ముగ్గురు కుర్రాళ్లతో కలిసి ఓపెన్ జీపుపై వెళుతూ.. స్టీరింగ్‌ని రెండు చేతులతో పట్టుకొని అటూ ఇటూ తిప్పుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. ఆ సమయంలో పోలీస్ ఎస్కాట్స్ ముందూ వెనుక ఉన్నాయి. దీనికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్రైవర్ సీటులో ఉన్న ప్రేమ్ చంద్ బైర్వా కుమారుడికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉందని, ఇది ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించడమేనని నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఓపెన్ జీపు నడుపుతున్న బాలుడు తన కుమారుడేనని డిప్యూటీ సీఎం ధ్రువీకరించారు. తాజాగా బైర్వా కుమారుడికి రవాణా శాఖ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
చట్టం ఎవరి చుట్టం కాదని మరోసారి నిరూపితమైంది. రూల్స్ అతిక్రమిస్తే ఎలాంటి వారికైనా జరిమానా తప్పదని రాజస్థాన్ ప్రభుత్వం చేసి చూపించింది. రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైర్యవా కుమారుడికి రాజస్థాన్ రవాణా శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఇటీవల ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా డిప్యూటీ సీఎం కుమారుడికి రూ.7000 భారీ జరిమానా విధించింది. ఇతరులకు హాని కలిగించేలా డ్రైవింగ్ చేయడం, సీటు బెల్ట్ ధరించకపోవడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ ఉపయోగించడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ప్రభుత్వ వాహనాలను దుర్వినియోగం చేయడం వంటివి వెలుగులోకి రావడంతో రవాణా శాఖ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది.
అసలేం జరిగిందంటే.. గత నెల రాజస్థాన్ డిప్యూటీ సీఎం ప్రేమ్ చంద్ బైర్యవా కుమారుడు, కాంగ్రెస్ నాయకుడు పుష్పందర్ భరద్వాజ్ తనయుడు మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఓపెట్ టాప్ జీప్ లో చక్కర్లు కొట్టారు. ఆ సమయంలో వారి జీప్ వెంట రాజస్థాన్ ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనాలు పోలీస్ లైట్లతో ఉన్నాయి. జైపూర్‌లోని అంబర్ రోడ్ లో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది. తండ్రి రాజకీయ అండ చూసుకొని కొడుకు పోలీసు ఎస్కార్ట్ వాహనాలను దుర్వినియోగం చేస్తూ తన సోషల్ మీడియా రీల్స్ కొరకు వాడుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. అ అ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం తనయుడికి భారీ జరిమానా విధించడం గమనార్హం. ప్రస్తుతం ప్రేమ్ చంద్ బైర్వా రాజస్థాన్‌లో రవాణా మరియు రహదారి భద్రత మంత్రిగా కొనసాగుతున్నారు. కాగా, తన కొడుకు చేసిన తప్పిదానికి పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, అలాంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తానని తెలిపారు.