iDreamPost
android-app
ios-app

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి మృతి!

  • Published Nov 15, 2023 | 1:34 PM Updated Updated Nov 15, 2023 | 1:34 PM

ప్రస్తుతం తెలంగాణ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల సందడి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణ,మధ్యప్రదేశ్, రాజస్థాన్ లో ఎన్నికల సందడి కనిపిస్తుంది. అధికార, ప్రతిపక్ష నేతలు ప్రచారాలతో హూరెత్తిస్తున్నారు.

కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. మాజీ మంత్రి మృతి!

గత నెల తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గఢ్, మిజోరాం ఐదు రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల సంఘం. మిజోరాంలో ఒకే విడత ఎన్నికల దశ పూర్తయ్యింది. చత్తీస్ గఢ్ లో మొదటి దశ ఎన్నిక పూర్తయ్యింది. ప్రస్తుతం రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణలో ఎన్నికల వేడి కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్షాల పార్టీ నేతలు విజయం తమదంటే తమదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచారాల్లో మునిగిపోతున్నారు. ఎన్నికల వేళ కొన్ని అపశృతులు జరుగుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది. అచ్చంపేటలో ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజుపై రాళ్లతో దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ‌కి బిగ్ షాక్ తగిలింది. వివరాల్లోకి వెళితే..

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. ఈసారి అధికార పార్టీని ఎలాగైనా గద్దె దింపి తాము అధికారంలోకి రావడానికి ప్రతిక్ష పార్టీలు విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్య ప్రదేశ్ లో ఈ నెల 17 న, రాజస్థాన్ ఈ నెల 25వ తేదీ, తెలంగాణ ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష నేతలు ముమ్మర ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ కి పెద్ద షాక్ తగిలింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిల్చున్న కాంగ్రెస్ పార్టీ సీనియన్ నేత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. మరో పదిరోజుల్లో ఎన్నికల జరగబోతున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి పోటీలు ఉన్న అభ్యర్థి గుర్మిత్ సింగ్ కునార్ (75) కన్నుమూశారు. నవంబర్ 4న ఆయన కరణ్ పూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ తరుపు నుంచి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత గుర్మిత్ ప్రచారంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతున్నారు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. డెత్ సర్టిఫికెట్ లో ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధి, సెప్టిక్ షాక్, హైపర్ టెన్షన్ తో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన మరణంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు ఒక్కసారే విషాదంలో మునిగిపోయారు. కరణ్‌పూర్ నియోజకవర్గం నుంచి గుర్మిత్ సింగ్ ప్రస్తుతం కాంగ్రెస్ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018లో ఆయన మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ సీనియన్ నేతలు ఆయనకు నివాళులర్పించారు.