P Krishna
P Krishna
ఇటీవల దేశంలో పలు చోట్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. సాంకేతిక లోపాల వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతుంటే.. మానవ తప్పిదాల వల్ల కొన్ని జరుగుతున్నాయి. కొంతమంది దుండగులు పట్టాలు తొలగించడం, పట్టాలపై రాళ్లు వేయడం లాంటివి చేస్తూ ప్రమాదాలకు కారణం అవుతున్నారు. రైలు పట్టాలపై ఉన్న బండరాళ్లను రైల్వే సిబ్బంది సకాలంలో గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన పూణె-ముంబై రైలు మార్గంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
పుణే-ముంబై రైలు మార్గంలో రైలు పట్టాలపై ఐదు వేర్వేరు చోట్ల కొంతమంది గుర్తు తెలియని దుండగులు బండరాళ్ళు పెట్టారు. రైలు వస్తున్న సమయంలో దాని వైబ్రేషన్ కి కొన్ని రాళ్ళు కిందపడిపోయాయి. నిన్న మధ్యాహ్నాం 3.40 గంటల సమయంలో పుణే-ముంబై ఆప్ లైన్ లో రైల్వే అధికారులు సకాలంలో గుర్తించి వాటిని తొలగించారు. దీంతో పెను ప్రమాదం తప్పిపోయింది. కాగా, ఈ ఘాతుకానికి పాల్పపడింది సంఘవిద్రోహక శక్తుల పనే అని సెంట్రల్ రైల్వే సీపీఆర్‌ఓ శివాజీ మానాస్ పూర్ తెలిపారు.
పూణే వెళ్లే సబర్బన్ రైలు ట్రాప్ పై బండరాళ్లను గుర్తించిన గార్డు వెంటనే అప్రమత్తమైన చించ్వాడ్ స్టేషన్ మాస్టర్ కు సమాచారం అందించారు. వెంటనే ముంబైకి వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్ కి సమాచారం అందించడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. పట్టాలపై బండరాళ్లను తొలగించే వరకు ఇరు రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇక పట్టాలపై రాళ్లు పెట్టిన అగంతకులను గుర్తించేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు సుకొని దర్యాప్తు చేస్తున్నారు. గత నాలుగు రోజుల క్రితం నార్త్ వెస్ట్రన్ రైల్వే అధికారులు ఉదయ్ పూర్ – జైపూర్ ట్రాక్ పై బండరాళ్లను గుర్తించి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు డ్రైవర్ కి సమాచారం అందించడంతో ప్రమాదం తప్పిపోయింది.
#WATCH | Maharashtra: Boulders were spotted on the Pune-Mumbai Railway track.
(Source: Central Railway PRO) pic.twitter.com/DkKHSmW5pj
— ANI (@ANI) October 6, 2023