P Krishna
Puri Jagannath Temple: ఇటీవల ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. పూరీ జగన్నాథుడి ఆలయ రత్న బండారం మూడో గది తెరిచి అందులోని సంపదలను లెక్కించి రాష్ట్ర ప్రయోజనాలకు వాడతామని బీజేపీ హామీ ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం జులై 14 తెరిచారు.
Puri Jagannath Temple: ఇటీవల ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే.. పూరీ జగన్నాథుడి ఆలయ రత్న బండారం మూడో గది తెరిచి అందులోని సంపదలను లెక్కించి రాష్ట్ర ప్రయోజనాలకు వాడతామని బీజేపీ హామీ ఇచ్చింది.. ఇచ్చిన మాట ప్రకారం జులై 14 తెరిచారు.
P Krishna
దేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి పూరీ జగన్నాథుడి ఆలయం. జగన్నాథ రధయాత్రకు లక్షల మంది భక్తులు తరలి వస్తుంటారు. జగన్నాథుడి ఆలయంలో కొన్నేళ్లుగా రత్న భాంగాగారంపై చర్చలు సాగుతున్నాయి. గతంలో పలుమార్లు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బంఢాగారాన్ని తెరిచే ప్రయత్నం చేసినా కుదరలేదు. ఇటీవల దేశంలో ఎన్నికలు జరిగాయి.. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూరీ జగన్నాథుడి ఆలయ రత్న బండారం మూడో గది తెరుస్తామని బీజేపీ హామీ ఇచ్చింది.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ నిలబెట్టుకుంది. నిన్నతో (జులై 14) ఉత్కంఠకు తెర దించారు. వివరాల్లోకి వెళితే..
1978 లో పూరీ జగన్నాథుడి ఆలయంలోని చివరిసారిగా రహస్య గదులు తెరిచి సంపదను లెక్కించారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత మళ్లీ మూడో గది తెరిచారు. జులై 14 న (ఆదివారం) ఉదయం శుభ ఘడియల్లో రహస్య గది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో తెరిచారు. ఆలయంలో రహస్యంగా ఉండే ఈ గది భక్తులకు కనిపించదు. శతాబ్దాల కింద నిర్మించిన ఈ ఆలయంలో ఎంతోమంది రాజులు విలువైన ఆభరణాలు, మణి, మాణిక్యలు కానుకగా అంజేసినట్లు సమాచారం. యుద్దాలు చేసి శ్రతు రాజుల వద్ద సంపద స్వామి వారికి సమర్పించుకున్నట్లు చెబుతుంటారు. పూరి జగన్నాథుడి గర్భాలయం వెనుక ఎడమవైపు రత్న భండారాలు ఉన్నాయి. మూడు గదుల్లో తొలి గది స్వామి వారి సేవకు అవసరమైన ఆభరణాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో గది తెరిచారు.. ఇందులో సంపద కర్రపెట్టల్లో దాచినట్లు సమాచారం.
గదిలో ఏముంది అన్న విషయాన్ని లోక్ నాథ్ స్వామి పర్యవేక్షిస్తుంటారు. అయితే శ్రీ క్షేత్రానికి శక్తి స్వరూపిణి విమలాదేవి, మహాలక్ష్మలు రత్న భండాగారానికి రక్షణగా ఉంటారు. ప్రస్తుతం సంపదలను లెక్కింపు కోసం ఒక గదిని స్ట్రాంగ్ రూమ్ గా ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం గదిలో పెద్ద సంఖ్యల్లో గబ్బిలాలు వెలుపలకు వచ్చాయని.. చుట్టూ చీకట్లు ఉండటం వల్ల హైమాస్ట్ సెర్చ్ దీపాలతో ప్రతినిధి బృందం లోపలికి వెళ్లిందని అధికారులు తెలిపారు. రత్న భాండారం తెరిచి 24 గంటలు దాటుతుంది..రహస్య గదిలో ఏం ఉంది? అనే వివరాలు ఇంకా తెలియరాలేదు. దీంతో ఆ గదిలో ఏంత సంపద ఉంది.. ఏలా ఉండబోతున్నాయి అన్న వివరాల కోసం యావత్ దేశం ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తుంది.