వీడియో: భారీ గ్లాస్ డోర్ మీద పడి మూడేళ్ల చిన్నారి మృతి

చిన్నారుల విషయంలో ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దారుణాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ విషాదకర సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

చిన్నారుల విషయంలో ఇంట్లోనే కాదు బయటకు వెళ్లినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే దారుణాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఓ విషాదకర సంఘటన వెలుగు చూసింది. ఆ వివరాలు..

చిన్నారులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం తెలియని పసివాళ్లు.. వాళ్లకి ప్రమాదాల గురించి ఏం తెలుస్తుంది. కనుక తల్లిదండ్రులే జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్తున్నప్పుడు చిన్నారులను తీసుకెళ్లకపోవడమే మంచిది. తప్పక తీసుకెళ్లాల్సి వచ్చినా.. వారిని ఓ కంట కనపెడితూ… జాగ్రత్తగా చూసుకోవాలి. గతంలో ఓ షాపింగ్ మాల్లో చిన్నారి ఐస్ క్రీమ్ కోసం ఫ్రిజ్ ఒపెన్ చేయడంతో.. షాక్ కొట్టి చనిపోయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ కోవకు చెందిన దారుణం మరొకటి వెలుగు చూసింది. గాజు డోర్ మీద పడటంతో.. మూడేళ్ల చిన్నారి చనిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన పంజాబ్, లుథియానాలో చోటు చేసుకుంది. భారీ గాజు తలుపు మీద పడటంతో.. మూడేళ్ల చిన్నారి మరణించింది. ఘుమర్ మండి మార్కెట్లో ఉన్న ఓ షాపింగ్ మాల్లో ఈ సంఘటన వెలుగు చూసింది. కుటుంబంతో కలిసి షోరూమ్ కి వచ్చిన మూడెళ్ల చిన్నారి.. తల్లిదండ్రులకు దూరంగా వచ్చింది. ఎంట్రెన్స్ వద్ద ఉన్న భారీ గాజు తలుపు హ్యాండిల్ పట్టుకుని.. దాన్ని అటూ, ఇటూ ఊపుతూ ఆడుకోసాగింది.

బాలిక అలా ఆడుకుంటుండగానే.. ఆ భారీ గాజు గ్లాస్ తలుపు మొత్తం ఊడిపోయి.. చిన్నారిపై పడిపోయింది. షాప్ లో ఉన్న వారు ప్రమాదాన్ని గుర్తించి.. వెంటనే అక్కడకు వచ్చి.. బాలికను డోర్ కింద నుంచి పైకి లేపారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎక్కడా, ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదని తెలిపారు. ఇక  ఈ దారుణంపై నెటిజనులు మండి పడుతున్నారు. అంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారు.. షాప్ నిర్వహాకులు సరే.. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు.. జాగ్రత్తగా చూసుకోలేరా.. మీ నిర్లక్ష్యం వల్లే చిన్నారి జీవితం బలయ్యింది అని కామెంట్స్ పెడుతున్నారు.

Show comments