51 ఏళ్ల వయసులో మూడో బిడ్డకు తండ్రైన పంజాబ్ సీఎం..!

Father is CM of Punjab: సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒకరు.

Father is CM of Punjab: సినీ ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఒకరు.

ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, పంజాబ్ రాష్ట్ర కన్వీనర్ గా పని చేసిన భగవంత్ మాన్ 2022 నుంచి పంజాబ్ 17వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. నటుడిగా వెండితెర, బుల్లితెరపై తన సత్తా చాటారు. కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన భగవంత్ మాన్ తర్వాత బుల్లితెరపై టీవీ షో జుగ్ను మస్త్ మస్త్, కామెడీ సో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు.నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ కూడా తన సత్తా చాటారు. ప్రస్తుతం పంజాబ్ సీఎంగా కొనసాగుతున్నారు. తాజాగా భగవంత్ మాన్ శుభవార్త తెలిపారు. వివరాల్లోకి వెళితే..

పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తాను తండ్రి అయినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయసు 51 ఏళ్లు. తన భార్య డాక్టర్ గురు ప్రీత్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని..  తాను పట్టరాని ఆనందంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా  ‘భగవంతుడు కూతురిని ప్రసాదించాడు..తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు’ అని ట్విట్టర్ వేధికగా తెలిపారు. డాక్టర్ గురు ప్రీత్ కౌర్ లూథియానాలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చారు. ఈ వార్త తెలుసుకున్న నెటిజర్లు, అభిమానులు సీఎం భగవంత్ మాన్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

భగవంత్ మాన్, డాక్టర్ గురు ప్రీత్ కౌర్ వివాహం 2022లో జరిగింది. ఆయనకు ఇది రెండో పెళ్లి.. అంతకు ముందు ఇంద్రప్రీత్ కౌర్ అనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరి మధ్య మనస్పర్ధల కారణంగా 2015 లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు రెండో భార్య ఓ పాపకు జన్మనివ్వడంతో ముగ్గురు పిల్లల తండ్రి అయ్యారు. కాగా, జనవరి 26న రిపబ్లిక్ డే వేడుకల్లో తన భార్య గర్భవతి అని ప్రకటించారు. 2022 పంజాబ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ విజయం సాధించడంతో 17వ సీఎంగా మార్చిలో బాధ్యతలు చేపట్టారు. పంజాబ్ సీఎం అయిన తర్వాత ఆయనపై పలు విమర్శలు వినిపించాయి.

Show comments