ఇల్లు కట్టిన కాంట్రక్టర్‌కి ఫిదా.. ఏకంగా కోటి విలువైన గిఫ్ట్‌ ఇచ్చిన యజమాని!

Punjab: కాంట్రాక్టర్ పని తీరుకి పిచ్చ ఫిదా అయ్యాడు యజమాని. తనకు అందమైన ఇల్లు కట్టినందుకు అతనికి కోటి విలువైన గిఫ్ట్ ఇచ్చాడు.

Punjab: కాంట్రాక్టర్ పని తీరుకి పిచ్చ ఫిదా అయ్యాడు యజమాని. తనకు అందమైన ఇల్లు కట్టినందుకు అతనికి కోటి విలువైన గిఫ్ట్ ఇచ్చాడు.

ఒక కాంట్రాక్టర్ ఇల్లు బాగా కడితే అతనికి ఎంత ఇస్తారు? మహా అంటే 1 లక్ష డబ్బు ఇస్తారు. కానీ ఏకంగా కోటి రూపాయల విలువైన గిఫ్ట్ ఇవ్వడం గురించి విన్నారా? అదే ఇక్కడ జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్‌కి చెందిన ఫేమస్ బిజినెస్ మ్యాన్ తన డ్రీమ్‌ హౌస్‌ను అద్భుతంగా నిర్మించిన కాంట్రాక్టర్‌కు ఎంత ఇచ్చిన తక్కువే అనుకున్నాడేమో… ఎందుకంటే అంతా అద్భుతంగా తనకు నచ్చిన విధంగా ఇల్లుని కట్టాడు ఆ కాంట్రాక్టర్. దాంతో అతనికి విలువైన బహుమతి ఇవ్వకపోతే ఎలా అనుకున్నాడు ఆ యజమాని. ఏకంగా కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను గిఫ్ట్ గా ఇచ్చి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. జిరాక్‌పూర్ దగ్గరలోని తన ఇంటిని చూసిన బిజినెస్ మ్యాన్ గుర్దీప్ దేవ్ బాత్ ఎంతగానో ఫిదా అయ్యాడు.. ఆ బిల్డింగ్‌ కాంట్రాక్టర్ అయిన రాజిందర్ సింగ్ రూపా అంకిత భావానికి సలాం కొట్టాడు. ఎంతో క్వాలిటీతో, అంకితభావంతో అనుకన్న టైంకి ప్రాజెక్ట్ డెలివరీ చేసినందుకు చాలా ఆనందపడ్డారు. దాంతో తన ఆనందానికి కారణమైన ఆ కాంట్రాక్టర్ కు ఏమైనా చేయాలి అనుకున్నాడు. దాంతో విలువైన బహుమతి ఇచ్చి అతడి నిజాయితీని సత్కరించాలని నిర్ణయించుకున్నాడు. అలా 18-క్యారెట్స్ గోల్డ్ తో తయారు చేసిన రోలెక్స్ వాచ్‌ను బిల్డింగ్‌ కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూపాకు గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ ఇంటిని ఆధునిక హంగులతో చాలా అద్భుతంగా నిర్మించారు. దీన్ని కేవలం 2 సంవత్సరాలలో నిర్మించేందుకు పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రాజిందర్ సింగ్ రూపా ముందుకు వచ్చాడు. ఆ లక్ష్యంతో నిర్మాణ బాధ్యతలు తీసుకున్నాడు. ఒప్పుకున్న షెడ్యూల్‌లో దీనిని పూర్తి చేయడానికి చాలా కష్టపడ్డారు రూపా. ఏకంగా 200 మంది వర్కర్లతో పని చేయడం స్టార్ట్ చేశారు. ఎన్నో ఆధునిక సదుపాయాలతో ఈ ఎస్టేట్ ని ఏకంగా 9 ఎకరాల స్థలంలో నిర్మించారు. రూపా కట్టిన ఎస్టేట్‌లో విశాలమైన హాళ్లు, ల్యాండ్‌స్కేప్ చేసిన గార్డెన్‌లు, స్టైల్ – ప్రాక్టికాలిటీ రెండూ ఉట్టిపడేలా ప్రత్యేకమైన నిర్మాణాలు ఉన్నాయి.

ఇక ఈ భవనం యజమాని గుర్దీప్‌ మాట్లాడుతూ..ప్రాజెక్ట్‌ పూర్తి చేయడంలో టైమ్‌లైన్‌ పట్ల రూపాకి ఉన్న నిబద్ధత గురించి మాటల్లో చెప్పలేం అన్నారు. తాను అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా ఇల్లు నిర్మిచాడని అన్నారు. ఆర్కిటెక్చర్‌ రంజోద్ సింగ్ తయారు చేసిన డిజైన్‌తో ఎస్టేట్‌ను, దాని చుట్టు కాంపౌండ్ వాల్ ని చాలా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడి బిల్డింగ్ ప్రైవేట్ ఫోర్ట్ గా మారింది. అందుకే ఇంత అద్భుతంగా దీన్ని నిర్మించిన కాంట్రాక్టర్‌ రూపాకు ఫిదా అయ్యి కృతజ్ఞతగా రోలెక్స్ వాచ్‌ గిఫ్ట్ గా ఇచ్చినట్లు బిజినెస్ మ్యాన్ గుర్దీప్ తెలిపారు.

ఇక కాంట్రాక్టర్‌ రూపా మాట్లాడుతూ..ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో పని చేయడం నిజంగా ఓ సవాలని అన్నారు. అందమైన ఊహకు జీవం పోయడంలో శ్రామిక శక్తి, సంఘటిత కృషి తోడయ్యాయని అన్నారు. అందుకే అనుకున్న టైమ్ కి దీన్ని విజయవంతంగా పూర్తి చేయగలిగామని అన్నారు. ఇలాంటి క్యాలిబర్ బంగ్లా నిర్మించడం అంత తేలికైన పని కాదని, ముఖ్యంగా రాజస్థానీ కోటలని గుర్తు చేసేలా నిర్మించడం చిన్న విషయం కాదని కాంట్రాక్టర్ రూపా అన్నారు. ఇలా తన ఇంటిని అద్భుతంగా కట్టినందుకు కాంట్రాక్టర్ కి కోటి రూపాయల వాచ్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు బిజినెస్ మ్యాన్ గుర్దీప్. కష్టాన్ని గుర్తించి నిజంగా ఇంత విలువైన గిఫ్ట్ ఇవ్వడం గ్రేట్ కదూ..ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments