P Krishna
నేరం చేసిన వాళ్లు ఎంతటి వారైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అంటుంటారు. కొన్నిసందర్భాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు అవినీతికి పాల్పపడితే ఈడీ వాళ్లను అరెస్టు చేస్తుంది.
నేరం చేసిన వాళ్లు ఎంతటి వారైనా సరే చట్టం ముందు అందరూ సమానమే అంటుంటారు. కొన్నిసందర్భాల్లో ఉన్నత పదవుల్లో ఉన్నవారు అవినీతికి పాల్పపడితే ఈడీ వాళ్లను అరెస్టు చేస్తుంది.
P Krishna
ఇటీవల దేశంలో నేరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే నేరం చేసింది ఎంతటి వారైనా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని పలు సంఘటనలు రుజువు చేశాయి. అది అధికాంలో ఉన్న పెద్దస్థాయి నేతలైనా.. చిన్న నేరస్థులైనా చట్టం ఎవరికీ చుట్టం కాదు. కొన్ని సినిమాల్లో ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో ఉన్నవాళ్లు నేరం చేస్తే.. బహిరంగ సభలో అరెస్టు చేసిన సీన్లు గుర్తున్నాయా..? అచ్చం అలాంటి సీన్ పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే.. కానీ అతనిపై మనీలాండరింగ్ కేసు నమోదు అయ్యింది. ప్రతిపక్ష నేతల ఈ విషయంలో గగ్గోలు పెడుతున్నారు. ఇక చట్టం తన పని తాను చేసుకుంటూ పోయింది.. ఓ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తుండగానే అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
నీతి.. నిజాయితీ, సమధర్మ పాలనే తమ లక్ష్యం అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేరం చేసింది తన పార్టీ నేతలైనా అరెస్టు చేసి విచారించాల్సిందే అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్ట్ చేశారు. జస్వంత్ సింగ్ పంజాబ్ మలేర్ కోట్లా జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ భారీ బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతుండగానే ఈడీ అధికారులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. జస్వంత్ సింగ్ ఒక బ్యాంక్ ని మోసగించడమే కాకుండా.. మనీ లాండరింగ్ కి పాల్పపడ్డారన్న ఆరోపణలపై ఆయనను అదుపులో తీసుకున్నట్లు సమాచారం. ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఈడీ అధికారులు మొహాలీ కోర్టులో హాజరు పర్చనున్నారు.
గత ఏడాది లూథియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఒక ఫిర్యాదు చేసింది. ఆ కంపెనీ తమ బ్యాంకు నుంచి ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ రూ.41 కోట్లు తీసుకొని మోసం చేసినట్లు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. గత ఏడాది అక్టోబర్ లో ఎమ్మెల్యే జస్వంత్ సింగ్ ఇంటిపై సీబీఐ దాడులు కూడా నిర్వహంచారు. అలాగే ఆయన నిర్వహిస్తున్న స్కూళ్లు, ఆఫీసులు, ఒక ఫ్యాక్టీరలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్వంత్ సింగ్ లెక్కలో చూపించని రూ.16.57 లక్షల నగదు, విదేశీ కరెన్సీ తో పాటు పలు కీలక పత్రాలు, మొబైల్స్, హార్డ్ డిస్క్ లు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే.. అధికార పార్టీ ఎమ్మెల్యేని అలా బహిరంగా సభలో అరెస్టు చేయడం పై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజా ప్రతినిధి కి విలువు ఇచ్చేది ఉండదా? ఆయన అరెస్ట్ చేసిన విధానం చూస్తుంటే బీజేపీ తమ పరువు తీయడానికి కంకణం కట్టుకున్నారా అన్న అనుమానాలు వస్తున్నాయని… ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అంటున్నారు.