iDreamPost
android-app
ios-app

ట్రైనీ IASకి షాకిచ్చిన కేంద్రం.. మరిన్ని చిక్కుల్లో పూజా ఖేద్కర్‌‌..

Probationary IAS Pooja Khedkar: ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ఆమె శిక్షణను రద్దు చేశారు.

Probationary IAS Pooja Khedkar: ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేక్ సర్టిఫికేట్ వివాదం నేపథ్యంలో ఆమె శిక్షణను రద్దు చేశారు.

ట్రైనీ IASకి షాకిచ్చిన కేంద్రం.. మరిన్ని చిక్కుల్లో పూజా ఖేద్కర్‌‌..

గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా మారిన ట్రైని ఐఏఎస్ పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికేట్ వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సర్వీసుల కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో పాసయ్యేందుకు పూజా ఖేద్కర్ ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించారని ఆరోపణలు గుప్పుమన్నాయి. నకిలీ అంగవైకల్య, ఓబీసీ సర్టిఫికేట్లను సమర్పించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ శిక్షణ విషయంలో ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రీ నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె శిక్షణను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం పూజా ఖేద్కర్‌కు సమాచారం అందించింది.

వివాదం నేపథ్యంలో సర్టిఫికేట్స్ ను పరిశీలించాల్సి ఉందని, అందుకే తాత్కాలికంగా శిక్షణను రద్దు చేస్తున్నట్టు ఆమెకు లేఖ రాసింది. అధికార దుర్వినియోగంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలతో పూజా ఖేద్కర్ వార్తల్లోకి ఎక్కింది. ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించి ఎంబీబీఎస్ లో చేరినట్లు, సివిల్స్ పరీక్షకు ఆమె వేర్వేరు పేర్లతో హాజరైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూజా ఖేద్కర్‌ వివాదంపై దర్యాప్తునకు కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.

కాగా ట్రైనీ ఐఏఎస్ అయిన పూజా ఖేద్కర్‌పై మరిన్ని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆగష్టు 2022లో పూణే జిల్లా పింప్రిలోని ఔంద్ ప్రభుత్వ ఆస్పత్రి నుంచి తీసుకున్నట్టుగా ఆమె సమర్పించిన పాక్షిక ‘లోకోమోటర్ వైకల్యం’ సర్టిఫికేట్‌ ఫేక్ అని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన 2023-బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన పూజా ఖేద్కర్ పూణే కలెక్టర్ కార్యాలయంలో తనకు ప్రత్యేక అధికారాలు కావాలంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి.