nagidream
Pulses & Vegetable Rates Will Reduced: నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యులకు ఆర్ధిక భారం ఎక్కువవుతుంది. పప్పులు,కూరగాయల ధరలు సామాన్యులకు ఆర్థిక గాయం చేస్తున్నాయి. అయితే తాజాగా భారతప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. పప్పులు, కూరగాయల ధరలు తగ్గుతాయని వెల్లడించింది.
Pulses & Vegetable Rates Will Reduced: నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతుండడంతో సామాన్యులకు ఆర్ధిక భారం ఎక్కువవుతుంది. పప్పులు,కూరగాయల ధరలు సామాన్యులకు ఆర్థిక గాయం చేస్తున్నాయి. అయితే తాజాగా భారతప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. పప్పులు, కూరగాయల ధరలు తగ్గుతాయని వెల్లడించింది.
nagidream
ఒకవైపు తగినంత వర్షపాతం ఉంటుందన్న అంచనాలు, మరోవైపు దిగుమతులు పెరుగుతుండడం.. ఈ రెండు కారణాల వల్ల కంది పప్పు, శనగ పప్పు, మినప వంటి పప్పుల ధరలు తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఇక నుంచి పప్పుల ధరల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి నిధి ఖరే వెల్లడించారు. వచ్చే నెల నుంచి ఈ మూడు పప్పుల దిగుమతులు పెరుగుతాయని.. దేశీయ సరఫరా పెరుగుతుందని అన్నారు. గత ఆరు నెలల్లో కంది, శనగ, మినప పప్పుల ధరలు స్థిరంగా ఉన్నాయని. కానీ అధిక స్థాయిలో నిల్వలు ఉన్నాయని అన్నారు. పెసర పప్పు, ఎర్రకంది పప్పుల ధరలు ఎక్కువగా పెరగలేదని అన్నారు.
ఈ నెల 13న కిలో శనగపప్పు రూ. 87.74 ఉండగా, కిలో కందిపప్పు రూ. 160.75, కిలో మినప్పప్పు రూ. 126.67, కిలో పెసర పప్పు రూ. 118.9, కిలో ఎర్ర కందిపప్పు రూ. 94.34గా ఉన్నాయి. 550 ప్రధాన వినియోగ కేంద్రాల నుంచి వినియోగదారుల వ్యవహారాల విభాగం రిటైల్ ధరలను సేకరిస్తుంది. ఈసారి వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసిందని నిధి ఖరే వెల్లడించారు. దీని వల్ల పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెరుగుతుందని భావిస్తున్నామని అన్నారు. అధిక మార్కెట్ ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పంటలు వేస్తారని.. మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడుతుందని అన్నారు. అయితే దేశీయ లభ్యతను పెంచడానికి.. అలానే రిటైల్ ధరలను నియంత్రణలో ఉంచడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.
రూ. 87.74 ఉన్న కిలో శనగపప్పుని రూ. 60కి విక్రయించాలన్న ప్రభుత్వ పథకం సామాన్యులకు ఊరటనిస్తోందని అన్నారు. గత ఆర్థిక ఏడాదిలో మన దేశం దాదాపు 8 లక్షల టన్నుల పచ్చిమిర్చి, 6 లక్షల టన్నుల మినప్పప్పు దిగుమతి చేసుకుందని.. మయన్మార్, ఆఫ్రికన్ దేశాల నుంచే మన దేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటుందని అన్నారు. అక్రమ నిల్వలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని నిధి ఖరే వెల్లడించారు. పప్పుల దిగుమతుల కోసం దేశీయ రిటైలర్లు, హోల్ సేలర్లు, పెద్ద రిటైల్ చైన్ లు, గ్లోబల్ సరఫరాదారులతో తమ విభాగం నిరంతరం మాట్లాడుతుందని అన్నారు.
2023 జూలై-24 జూన్ వరకూ కందిపప్పు ఉత్పత్తి 33.85 లక్షల టన్నులు కాగా.. వినియోగ అంచనా మాత్రం 44 లక్షల టన్నుల నుంచి 45 లక్షల టన్నులుగా ఉంది. ఇక శనగపప్పు ఉత్పత్తి 115.76 లక్షల టన్నులు ఉంటే.. డిమాండ్ మాత్రం 119 లక్షల టన్నులు ఉంది. 23 లక్షల టన్నుల మినప్పప్పు ఉత్పత్తి అవ్వగా.. డిమాండ్ మాత్రం 33 లక్షల టన్నులుగా ఉంది. ప్రజలకు కావాల్సిన నిల్వలు లేకపోవడంతో ధరలు అనేవి పెరుగుతాయి. అయితే ఈ డిమాండ్, సరఫరా మధ్య వ్యత్యాసాన్ని దిగుమతుల ద్వారా పూడ్చుతామని కేంద్ర వినియోగదారుల వ్యవహార కార్యదర్శి నిధి ఖరే అన్నారు. వర్షాల కారణంగా పప్పుల ధరలతో పాటు కూరగాయల ధరలు కూడా తగ్గుతాయని ఆమె అన్నారు.