Arjun Suravaram
సమాజంలో పోలీసులు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. చాలా మంది పోలీసులు నిజాయితీగా విధులు నిర్వహిస్తూ మంచి పేరు సంపాదిస్తారు. కానీ కొందరు ఖాకీలు మాత్రం కక్కుర్తి పడి..పోలీస్ వ్యవస్థకే అపకీర్తి తెస్తుంటారు.
సమాజంలో పోలీసులు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. చాలా మంది పోలీసులు నిజాయితీగా విధులు నిర్వహిస్తూ మంచి పేరు సంపాదిస్తారు. కానీ కొందరు ఖాకీలు మాత్రం కక్కుర్తి పడి..పోలీస్ వ్యవస్థకే అపకీర్తి తెస్తుంటారు.
Arjun Suravaram
పోలీస్.. ఇది మూడు అక్షరల పదం కాదు.. ఎంతో మంది ప్రజలకు భరోసా, ధైర్యం, రక్షణ. అందుకే సమాజంలో పోలీసులు అంటే ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. చాలా మంది పోలీసులు నిజాయితీగా విధులు నిర్వహిస్తూ మంచి పేరు సంపాదిస్తారు. అంతేకాక ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం అర్పిస్తుంటారు. కానీ కొందరు ఖాకీలు మాత్రం అవినీతి సొమ్ము కోసం కక్కుర్తి పడుతుంటారు. కొందరు లైంగిక వేధింపుల ఇష్యుల్లో ఇరుక్కుంటే..మరికొందరు అవినీతికి పాల్పడి..పోలీసు శాఖకే అపకీర్తి తెస్తున్నారు. తాజాగా ఓ పోలీసులు రూ.10 పల్లీల కోసం కక్కుర్తిపడి..చివరకు జీవితాన్నే ఇబ్బందుల పాలు చేసుకున్నాడు. మరి.. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం…
తమిళనాడు రాష్ట్రంలో తిరుచ్చి జిల్లాలోని శ్రీరంగంలో రాధాకృష్ణన్ అనే వ్యక్తి ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం శ్రీరంగం రాజగోపురం వద్ద రాజన్ ప్రేమ్‌కుమార్‌కు చెందిన స్నాక్స్ దుకాణం వద్దకు రాధాకృష్ణన్ వెళ్లారు. అక్కడ రూ.10 విలువ చేసే శనగ గింజల ప్యాకెట్ ను తీసుకున్నాడు. పల్లీలను తీసుకుని రాధాకృష్ణన్ వెళ్తున్న క్రమంలో ప్రేమ్ కుమార్ కొడుకు డబ్బులు అడిగాడు. అయితే డబ్బులు ఇచ్చేందుకు ఆ పోలీసులు నిరాకరించడమే కాకుండా వ్యాపారిని దుర్భషలాడాడు. నన్నే డబ్బులు అడుగుతావా..? అంటూ ఆ షాపులోని వారిని బెదిరించాడు.
ఆ దుకాణాంలోనే ఉన్న రాజన్ ప్రేమ్ కుమార్ ఆ ఎస్ఐ ను శాంతింపజేసేందుకు ట్రై చేశాడు. అయినా కానీ పవర్ ఉందనే అహంకారంతో రాధాకృష్ణన్ షాపు వాళ్లపై దురుసుగా ప్రవర్తించాడు. ఆ తరువాత రాజన్ ప్రేమ్ కుమార్ తన షాపులోని సిసిటివి ఫుటేజీ వీడియో క్లిప్పింగ్‌ను నెటింట్లో పోస్ట్ చేశాడు. అంతేకాక ఆ వీడియో రికార్డింగ్‌తో ఉన్నతాధికారులు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదపై విచారణ చేపట్టిన అధికారులు ఎస్సై రాధాకృష్ణదే తప్పని తేల్చారు. దీంతో వెంటనే ఆయను విధుల నుంచి తొలగిస్తూ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడే పోలీసు సిబ్బందికి కూడా ఇదే తరహా శిక్ష ఉంటుందని సిటీ కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలకు అండగా ఉండే పోలీసులు ఇలాంటివి అవినీతి, బెదిరింపులకు పాల్పకడే పనులు చేయొద్దంటూ పోలీసులకు సూచించారు. మొత్తంగా 10 రూపాయల పల్లీలు కోసం ఎస్సై కక్కుర్తి పడటంతో ఏకంగా ఆయన ఉద్యోగానికి ఎసరు వచ్చింది. బాధితులకు అండగా నిలబడి…దురుసుగా ప్రవర్తించిన ఎస్సైకి తగిన శిక్ష వేసిన కమిషనర్ పై స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా పోలీసులు చాలా మంది నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తుంటే..ఎస్సై రాధాకృష్ణన్ లాంటి వారు మాత్రం అవినీతికి, లంచాలకు అలవాటు పడి సామాన్య ప్రజలను పట్టి పీడిస్తుంటారు. ఇలాంటి చీడపురుగుల వల్లనే మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.