iDreamPost
android-app
ios-app

మగాడిగా మారిన లేడీ కానిస్టేబుల్‌.. మహిళతో వివాహం తర్వాత మగ బిడ్డకు తండ్రి!

  • Published Jan 20, 2024 | 6:35 PM Updated Updated Jan 20, 2024 | 6:35 PM

ఇటీవల దేశంలో ప్రేమ వివాహాలు బాగా పెరిగిపోయాయి. తమ మనసుకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.. విచిత్రం ఏంటంటే మగవారిని మగవారు.. ఆడవారిని ఆడవారే ప్రేమించుకుని పెద్దలను, సమాజాన్ని ఎదిరించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. కొంతమంది యువకులు ట్రాన్స్ జెండర్లను పెళ్లి చేసుకుంటున్నారు.

ఇటీవల దేశంలో ప్రేమ వివాహాలు బాగా పెరిగిపోయాయి. తమ మనసుకు నచ్చిన వారిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు.. విచిత్రం ఏంటంటే మగవారిని మగవారు.. ఆడవారిని ఆడవారే ప్రేమించుకుని పెద్దలను, సమాజాన్ని ఎదిరించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. కొంతమంది యువకులు ట్రాన్స్ జెండర్లను పెళ్లి చేసుకుంటున్నారు.

మగాడిగా మారిన లేడీ కానిస్టేబుల్‌.. మహిళతో వివాహం తర్వాత మగ బిడ్డకు తండ్రి!

ప్రేమ ఎంతో మధురమైనది.. మనసుకు నచ్చిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని భావించి చాలా మంది ప్రేమ వివాహాలకే జై కొడుతున్నారు. కొతమంది పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంటే.. కొంతమంది పెద్దలను ఒప్పించి సంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్య ఒక అడుగు ముందు వేసి మగవారిని మగవారు, ఆడవాళ్లను ఆడవాళ్లు ప్రేమించుకొని పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. ప్రకృతికి విరుద్దంగా జరుగుతున్న ఈ వివాహాలను చాలా వరకు కుటుంబ పెద్దలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా స్త్రీ నుంచి పురుషుడిగా మారిన ఓ కానిస్టేబుల్ తండ్రి అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఓ లేడీ కానిస్టేబుల్ పురుషుడిగా మారి మరో మహిళని వివాహం చేసుకుంది. వీరి పెళ్లైన నాలుగేళ్ల తర్వాత పండంటి మగబిడ్డకు తండ్రైంది. వింటానికి చోద్యంగా ఉన్నా ఈది నిజం. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగింది. అసలు విషయానికి వస్తే.. మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్ గావ్ తాలూకాలోని రాజేగావ్ కు చెందిన లలితా సాల్వే పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యింది. 25 ఏళ్ల లలితా సాల్వే తన శరీరంలోని మార్పులు గమనించి వైద్యులను సంప్రదించింది. 2013 లో వైద్య పరీక్షల్లో ఆమెకు వై (Y) క్రోమోజామ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. సాధారణంగా మగవారితో సంబంధం కలిగి ఉంటాయి, ఆడవారికి సాధారణంగా రెండు X క్రోమోజోమ్‌లు ఉంటాయి. లింగ డిస్ఫోరియాతో బాధపడుతున్నట్లు వైద్యులు లలిత్ సాల్వేకి లింగమార్పిడి శస్త్రచికిత్సను సిఫార్సు చేశారు.

A lady constable who turned into a female

ఈ క్రమంలోనే 2017 లో లలితా సాల్వే బాంబే హై కోర్టును ఆశ్రయించింది. లింగ మార్పిడి సర్జరీ కోసం నెల రోజులు సెలవు కోరింది. బాంబే హై కోర్టుతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతితో లలితా సాల్వే లింగమార్పిడి శస్త్ర చికిత్స చేయించుకుంది. 2018 నుంచి 2020 వరకు ఆమెకు పలు సర్జరీల ద్వారా పురుషుడిగా మారింది. ఈ క్రమంలోనే లలిత్ కుమార్ సాల్వేగా పేరు మార్చుకొని 2020 లో చత్రపతి శంభాజీనగర్ కు చెందిన సీమా తో వివాహం జరిగింది. నాలుగేళ్ల తర్వాత జనవరి 15 న ఈ జంటకు బాగు పుట్టాడు. తండ్రి కావడంపై లలిత్ కుమార్ సాల్వే ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘స్త్రీ నుంచి పురుషుడిగా నా ప్రయాణంలో ఎన్నో కష్టాలు అనుభవించాను. ఈ సమయంలో చాలా మంది నన్ను ఆదరించి ఆశీర్వదించారు.. నా భార్య సీమ బిడ్డను కనాలనుకుంది. ఇప్పుడు తండ్రిని అయినందుకు చాలా సంతోషంగా ఉంది.’ కుమారుడికి ఆరుష్ అని నామకరణం చేస్తామని లలిత్ కుమార్ సాల్వే చెప్పాడు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.